చరిత్ర సృష్టించిన ఏపీ ప్రభుత్వ పాఠశాల విద్యార్థినులు

ప్రపంచ ఆరోగ్య దినోత్సవాన్ని పురస్కరించుకొని అల్లూరి సీతారామరాజు జిల్లా అరకులోయలో ప్రభుత్వ పాఠశాల విద్యార్థినులు నిర్వహించిన సూర్య నమస్కారాలకు ప్రపంచ గుర్తింపు లభించింది. 108 నిమిషాల్లో 108 సూర్య నమస్కారాలను నిర్వహించారా గిరిజన విద్యార్థినులు.

అరకులోయతో పాటు అయిదు మండలాల నుండి సుమారు 20,000 మంది గిరిజన విద్యార్థులు ఈ ఈవెంట్‌లో పాల్గొన్నారు. ఇతర మండలాలకు చెందిన విద్యార్థినులు 13,000 మందికి పైగా ఉన్నారిందులో. ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా 108 సూర్య నమస్కారాలు చేసి సరికొత్త ప్రపంచ రికార్డును నెలకొల్పారు. దీన్ని లండన్ వరల్డ్ రికార్డ్స్ అధికారికంగా గుర్తించింది.

Around 20000 tribal students perform 108 Surya Namaskars in Araku sets a world record

అరకులోయ ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంలో దీన్ని నిర్వహించారు. గిరిజన విద్యార్థినుల శక్తి సామర్థ్యాలకు అద్దం పట్టిన కార్యక్రమం ఇది. జిల్లా ఇన్‌ఛార్జ్ మంత్రి గుమ్మడి సంధ్యారాణి ఈ కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించారు. ప్రారంభం నుంచి 108 నిమిషాల పాటు నిరంతరాయంగా కొనసాగింది. లండన్ వరల్డ్ రికార్డ్స్ యూనియన్ మేనేజర్ అలిస్ రేనౌడ్ స్వయంగా ఈ కార్యక్రమాన్ని పర్యవేక్షించారు.

ఈ ప్రపంచ రికార్డును నెలకొల్పడానికి అయిదు నెలల పాటు కఠోరంగా శ్రమించారు. యోగసాధనలో పాల్గొన్నారు. ప్రతి రోజూ తెల్లవారు జామున 4 గంటలకే నిద్ర లేచేవాళ్లు. క్రమం తప్పకుండా యోగా, సూర్య నమస్కారాలు, ఇతర ఆసనాల్లో వాళ్లంతా శిక్షణ పొందారు. దీని ఫలితంగా గిన్నిస్ బుక్ రికార్డును సాధించారు.

ఫిజికల్ ఎడ్యుకేషన టీచర్ల పర్యవేక్షణలో వాళ్ల శిక్షణ సాగింది. ఆయా పాఠశాలల బోధన, బోధనేతర సిబ్బంది, గిరిజన సంక్షేమ మంత్రిత్వ శాఖ అధికారుల మార్గదర్శకత్వంలో శ్రమించారు.. రాటుదేలారు. ఈ కార్యక్రమం విద్యార్థుల చిత్తశుద్ధికి, వారి శారీరక- మానసిక దృఢత్వానికి నిదర్శనంగా నిలిచినట్టయింది.

జిల్లా కలెక్టర్ దినేశ్‌కుమార్‌, జాయింట్ కలెక్టర్ అభిషేక్‌గౌడ్‌, సబ్‌కలెక్టర్‌ శౌర్యమన్‌ పటేల్‌, జిల్లా అధికారులు ఇందులో పాల్గొన్నారు. విద్యార్థులకు ఎలాంటి లోటు రానివ్వకుండా చూసుకున్నామని కలెక్టర్ తెలిపారు. విద్యార్థులకు రవాణా, భోజన సదుపాయాలు, మంచినీటి సౌకర్యాన్ని కల్పించామని, పిల్లలు డీహైడ్రేషన్‌కు గురికాకుండా అవసరమైన ఓఆర్‌ఎస్‌ ప్యాకెట్లు సిద్ధంగా ఉంచామని చెప్పారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+