కెసిఆర్‌కు లక్షమందితో వెల్‌కం, పూలవర్షం (పిక్చర్స్)
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షులు కల్వకుంట్ల చంద్రశేఖర రావుకు ఘన స్వాగతం పలికేందుకు ఆ పార్టీ క్యాడర్ సిద్ధమైంది. కెసిఆర్ ఢిల్లీ నుండి బుధవారం మధ్యాహ్నం హైదరాబాదుకు వస్తున్నారు. ఇందుకోసం అన్ని ఏర్పాట్లు చేశారు. లక్షమందితో ఘన స్వాగతం పలుకనున్నారు. గన్ పార్కు వరకు భారీ ర్యాలీ తీస్తారు. హెలికాప్టర్ ద్వారా పూల వర్షం కురిపిస్తారు. తాను తెలంగాణతోనే వస్తానని కెసిఆర్ ఢిల్లీ ఫ్లైటెక్కి... ఇప్పుడు ప్రత్యేక రాష్ట్రంతో తిరిగి వస్తున్నారు.
పార్టీ నాయకులు కనివినీ ఎరుగని రీతిలో స్వాగత ఏర్పాట్లను చేస్తున్నారు. బుధవారం నాటి ర్యాలీలో ఆయన దారి పొడవునా ప్రజలకు అభివాదం చేస్తూ, విజయ సంకేతం చూపిస్తూ, ముందుకు సాగుతారని పార్టీ వర్గాలు తెలిపాయి. కెసిఆర్ ఢిల్లీలో బుధవారం మధ్యాహ్నం 1.15 గంటలకు విమానం ఎక్కుతారు. 3.15 గంటలకు శంషాబాద్ విమానాశ్రయంలో దిగుతారు. చార్టెడ్ ఫ్లైట్‌లో బేగంపేట ఎయిర్‌పోర్టుకు చేరుకుంటారు.
బేగంపేట ఫ్లైఓవర్, లైఫ్ స్టైల్, సోమాజిగూడ, ఖైరతాబాద్, రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్, రవీంద్ర భారతి మీదుగా అసెంబ్లీ ఎదురుగా ఉన్న గన్‌పార్క్ వరకు ర్యాలీలో పాల్గొంటారు. గన్‌పార్క్‌లోని తెలంగాణ అమరవీరుల స్థూపం వద్ద నివాళి అర్పిస్తారు. అక్కడ హెలికాప్టర్ ద్వారా పూలవర్షం కురిపిస్తారు. గన్‌పార్క్ నుంచి తెలంగాణ భవన్‌కు చేరుకొని తెలంగాణ తల్లికి పూలమాల వేస్తారు. తదుపరి అక్కడి నుంచి బంజారాహిల్స్‌లోని నివాసానికి చేరుకొంటారు.
కాగా, కెసిఆర్‌కు స్వాగతం పలికేందుకు తెలంగాణలోని జిల్లాల నుండి భారీగా కార్యకర్తలు తరలి వస్తున్నారు. ఈ నేపథ్యంలో పార్కింగ్ ఏర్పాటు చేశారు. కరీంనగర్, సిద్దిపేట, నిజామాబాద్, ఆదిలాబాద్, కామారెడ్డి, మెదక్ వైపు నుంచి వచ్చే వాహనాలను పరేడ్ గ్రౌండ్స్ వద్ద, మహబూబ్‌నగర్, రంగారెడ్డి జిల్లాల నుంచి వచ్చే వాహనాలను నిజాం కళాశాల మైదానంలో, ఎగ్జిబిషన్ గ్రౌండ్‌లో, నల్గొండ, వరంగల్, ఖమ్మం జిల్లాల నుంచి వచ్చే వాహనాలను ఎన్టీఆర్ స్టేడియంలో పార్క్ చేస్తారు.
ట్రాఫిక్ మళ్లింపు
మంగళవారం హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తున్నట్టు నగర పోలీసు కమిషనర్ అనురాగ్ శర్మ ఓ ప్రకటనలతో తెలిపారు. బుధవారం మధ్యాహ్నం రెండు గంటల నుంచి సాయంత్రం ఏడు గంటల వరకు ఈ ఆంక్షలు అమలులో ఉంటాయని తెలిపారు.
విమానం ఆలస్యం కారణంగా కెసిఆర్ విజయోత్సవ ర్యాలీ సమయంలో మార్పులు చోటు చేసుకున్నాయి. సాయంత్రం 4 గంటలకు బేగంపేట ఎయిర్ పోర్టు నుంచి స్వాగత ర్యాలీ ప్రారంభమవుతుందని తెరాస ఎమ్మెల్యే హరీష్ రావు తెలిపారు.

కెసిఆర్
తెలంగాణ బిల్లు ఉభయ సభల్లో ఆమోదం పొందాక తొలిసారిగా తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షులు కల్వకుంట్ల చంద్రశేఖర రావు బుధవారం మధ్యాహ్నం నగరానికి వస్తున్నారు. ఆయన రాకను పురస్కరించుకుని టిఆర్‌ఎస్ శ్రేణులు బుధవారం బేగంపేట విమానాశ్రయం నుంచి అసెంబ్లీ ఎదుటున్న గన్‌పార్క్ వరకు ర్యాలీ నిర్వహించనున్నారు.

తెరాస
టిఆర్‌ఎస్ ర్యాలీ సందర్భంగా నేడు నగరంలో మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 7 గంటల వరకు భారీగా ట్రాఫిక్‌ను దారి మళ్ల్లిస్తున్నట్లు నగర పోలీస్ కమిషనర్ అనురాగ్ శర్మ తెలిపారు.

ఏర్పాట్లు
నాంపల్లి నుంచి వచ్చే ట్రాఫిక్‌ను ఎఆర్ పెట్రోల్ పంప్ మీదుగా బిజెఆర్ విగ్రహం వైపునకు, అబిడ్స్ నుంచి వచ్చే ట్రాఫిక్‌ను బిజెఆర్ విగ్రహం మీదుగా బషీర్‌బాగ్ వైపునకు, లిబర్టీ, హైదర్‌గూడ నుంచి వచ్చే ట్రాఫిక్‌ను బషీర్‌బాగ్, బిజెఆర్ విగ్రహం మీదుగా దారి మళ్లిస్తారు.

ట్రాఫిక్ మళ్లింపు
మెహిదీపట్నం నుంచి వచ్చే ట్రాఫిక్‌ను మసబ్ ట్యాంక్ వద్ద నుంచి బంజారాహిల్స్ రోడ్డు నెం. 1/12 మీదుగా, కాగా అక్కడి నుంచి వచ్చే వాహనాలను మసబ్ ట్యాంక్ వద్ద నుంచి మెహిదీపట్నం మీదుగా దారి మళ్లిస్తారు.

ట్రాఫిక్
తెలుగుతల్లి ఫ్లై ఓవర్ గుండా వచ్చే ట్రాఫిక్‌ను ఇక్బాల్ మినార్ వద్ద నుంచి లక్డికాపూల్ మీదుగా, పంజాగుట్ట, రాజ్‌భవన్ ప్రాంతాల నుంచి వచ్చే ట్రాఫిక్‌ను వివి విగ్రహం వద్ద నుంచి నెక్లెస్ రోటరీ మీదుగా, అప్పర్ ట్యాంక్‌బండ్ వచ్చే నుంచి ట్రాఫిక్‌ను తెలుగుతల్లి జంక్షన్ వద్ద నుంచి నెక్లెస్ రోటరీ మీదుగా దారి మళ్లిస్తారు.

మళ్లీంపు
ఎస్‌ఆర్ నగర్ నుంచి వచ్చే ట్రాఫిక్‌ను గ్రీన్‌ల్యాండ్స్ నుంచి బేగంపేట ఫ్లై ఓవర్ మీదుగా అమీర్‌పేట జంక్షన్, డికె రోడ్డు మీదుగా, శ్రీనగర్ టి జంక్షన్ నుంచి వచ్చే ట్రాఫిక్‌ను ఎన్‌ఎఫ్‌సిఎల్, తాజ్‌కృష్ణ మీదుగా, అక్కడి నుంచి వచ్చే వాహనాలను ఎన్‌ఎఫ్‌సిఎల్, శ్రీనగర్ టి జంక్షన్ మీదుగా దారి మళ్లిస్తారు.

భారీ కటౌట్లు
రైల్వే నిలయం నుంచి వచ్చే వాహనాలను సిటివో, ఎంజి రోడ్డు మీదుగా, తిరుమలగిరి వైపు నుంచి వచ్చే ట్రాఫిక్‌ను రసూల్‌పుర, మినిస్టర్స్ రోడ్డు మీదుగా దారి మళ్లిస్తారు.

కటౌట్లు
ట్రాఫిక్ దారి మళ్లింపుల దృష్ట్యా నగరవాసులు పోలీసు శాఖకు సహకరించాలని కమిషనర్ అనురాగ్ శర్మ నగర ప్రజలను బుధవారం కోరారు.

గ్రాండ్ వెల్ కమ్
పార్కింగ్ స్థలాల కేటాయింపుఅలాగే ర్యాలీకి హాజరయ్యేందుకు కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్, మెదక్ జిల్లాల నుంచి వచ్చే వాహనాలకు సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్‌లో, నల్లగొండ, ఖమ్మం, వరంగల్ జిల్లాల నుంచి వచ్చే వాహనాలకు ఎన్టీఆర్ స్టేడియంలో, మహబూబ్‌నగర్, రంగారెడ్డి నుంచి వచ్చే వాహనాలకు నిజాం కాలేజీ గ్రౌండ్స్‌లో పార్కింగ్ కేటాయించారు.

పంజాగుట్టలో
పార్టీ సీనియర్ నాయకుల వాహనాలకు ఆలియా కాలేజీ, మహబూబియా, ఎవి కాలేజ్, పబ్లిక్ గార్డెన్స్‌లతోపాటు రసూల్‌పుర హాకీ గ్రౌండ్స్‌లో పార్కింగ్ కేటాయించారు.

కెసిఆర్‌కు వెల్ కం
తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షులు కల్వకుంట్ల చంద్రశేఖర రావుకు ఘన స్వాగతం పలికేందుకు ఆ పార్టీ క్యాడర్ సిద్ధమైంది. కెసిఆర్ ఢిల్లీ నుండి బుధవారం మధ్యాహ్నం హైదరాబాదుకు వస్తున్నారు.












Click it and Unblock the Notifications