కొడాలి నానిపై అరెస్ట్ వారెంట్.. కోర్టు సీరియస్, కీలక ఆదేశాలు!!
మాజీ మంత్రి గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని పై జారీ చేసిన అరెస్ట్ వారెంట్ పెండింగ్ పై ప్రజాప్రతినిధుల కోర్టులో విచారణ జరిగింది. కోర్టు కీలక ఆదేశాలు ఇచ్చింది.
మాజీ మంత్రి గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని పై జారీ చేసిన అరెస్ట్ వారెంట్ పెండింగ్ పై ప్రజాప్రతినిధుల కోర్టులో విచారణ జరిగింది. కొడాలి నాని తీరుపై, ఆయన కోర్టుకి రాకపోవడంపై ఆగ్రహం చేసిన వ్యక్తం చేసిన ప్రజా ప్రతినిధుల న్యాయస్థానం కొడాలి నానిపై అరెస్టు వారెంట్ ను అమలు చేయాలని ఆదేశాలు జారీ చేసింది. గవర్నర్ పేట సీఐ కి న్యాయమూర్తి గాయత్రీ దేవి ఈ మేరకు ఆదేశాలను జారీ చేశారు.
కోర్టు ధిక్కారం కింద కొడాలి నాని పై జారీ అయిన అరెస్ట్ వారెంట్ ను అమలు చేయాలని ఆదేశాలు ఇచ్చింది ప్రజా ప్రతినిధుల న్యాయస్థానం. గతంలో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్న సమయంలో ప్రత్యేక హోదా అంశంపై కొడాలి నాని ర్యాలీ నిర్వహించారు. 2016 మే 10వ తేదీన విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రం నుంచి మాజీ మంత్రి కొలుసు పార్థసారధితో పాటు మరికొందరితో కలిసి కొడాలి నాని అముమతి లేకున్నా వన్ వేలో ర్యాలీ నిర్వహించారు. పోలీసుల ఉత్తర్వులను ఉల్లంఘించి ట్రాఫిక్ కు తీవ్ర అంతరాయం కలిగించారని ఆరోపణలతో, అప్పుడు కొడాలి నాని పై గవర్నర్ పేట పోలీస్ స్టేషన్లో కేసు నమోదు అయింది.

ఈ కేసు విచారణకు కొడాలి నాని హాజరు కాకపోవడంతో కోర్టు అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. 2023 జనవరి 5వ తేదీ నుంచి ఈ కేసు పెండింగ్లో ఉంది. కేసు వాయిదాలకు కోర్టుకు కొడాలి నాని హాజరు కావడం లేదు. దీంతో కొడాలి నాని తీరుపై కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. గవర్నర్ పేట సిఐ సురేష్ కుమార్ ఈ మేరకు కోర్టుకు హాజరై ధర్మాసనం ముందు వివరణ ఇచ్చారు. దీంతో గుడివాడ ఎమ్మెల్యే నాని పై అరెస్టు వారెంట్ పెండింగ్లో ఉందని, దానిని తక్షణమే అమలు చేయాలని న్యాయమూర్తి గాయత్రి దేవి సిఐని ఆదేశించారు.
-
తెలంగాణలో కొత్త అసెంబ్లీ సీట్లు ఇవే, కలిసొచ్చేది ఆ పార్టీకే- అసలు లెక్క..!! -
టీవి ఛానళ్లకు కేంద్రం బిగ్ షాక్.. టీవి రేటింగ్స్‌పై కొత్త పాలసీ !! -
Petrol: మార్చి గండం.. 'నో స్టాక్' బోర్డులకు అసలు కారణం ఇదే! -
సీఎం సభ నుంచి వస్తుండగా ఊహించని ప్రమాదం.. 10 మంది దుర్మరణం! -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
తిరుమలలో హోటళ్ల బంద్, భక్తుల ఇబ్బందులు- ఆ ఒక్కటే ఆధారం..!! -
'ఆ ఒక్క కండీషన్ తో స్టార్ హీరోతో నిజంగానే శోభనం'.. హీరోయిన్ సంచలనం..!! -
మడమ తిప్పని ఇరాన్: శాంతి కోసం 5 కండీషన్లతో అమెరికాకు షాక్ -
భారత జట్టుకు అవమానం.. స్టేడియంలోకి నో ఎంట్రీ! -
శ్రీరాముడిగా మెప్పించిన తెలుగు హీరోలు వీళ్ళే..? -
మళ్ళీ లాక్డౌన్? కేంద్రం సంచలన ప్రకటన -
వచ్చే మూడు నెలలు హై అలర్ట్, ఏపీలో ఎండల ముప్పు











Click it and Unblock the Notifications