''కేశినేని విక్రయించిన బస్సుల కొలతల్లో తేడా, అన్నీ నిబంధనల ప్రకారమే''

Posted By:
Subscribe to Oneindia Telugu

విజయవాడ: నిబంధనల ప్రకారమే ప్రైవేట్ బస్సులను నడుపుతున్నామని ప్రైవేట్ బస్సు ఆపరేటర్ల సంఘం ఉపాధ్యక్షుడు సునీల్ రెడ్డి చెప్పారు.తమకు కేశినేని నాని కుటుంబమే ఆదర్శమన్నారు. నాని విక్రయించిన బస్సుల కొలతల్లో కూడ తేడాలున్నాయని ఆయన ఆరోపించారు.

శనివారం నాడు అమరావతిలో ఆయన ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడును కలిశారు. ప్రైవేట్ బస్సు ఆపరేటర్ల సమస్యలను ఆయన ముఖ్యమంత్రికి వివరించారు. తమ సమస్యలను పరిష్కరించాలని ఆయన చంద్రబాబును కోరారు.

As per rules we are running buses: Sunil Reddy

అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా విజయవాడ ఎంపీ కేశినేని నానిపై విమర్శలు గుప్పించారు. తామంతా నిబంధనల ప్రకారంగానే బస్సులను నడుపుతున్నట్టు చెప్పారు.

బస్సులను ఎక్కడ రిజిస్ట్రేషన్ చేయించినా పక్క రాష్ట్రాల్లో బస్సులు ప్రవేశించే సమయంలో ఆ రాష్ట్రాలకు పన్ను కడుతామన్నారు.తామంతా కేశినేని నాని కుటుంబం చూపిన బాటలోనే నడుస్తున్నామన్నారు. ప్రైవేట్ బస్సుల వ్యాపారంలో మంచైనా , చెడైనా నాని కుటుంబం ఏ మార్గాన్ని అనుసరించిందో తాము కూడ అదే మార్గంలో ముందుకు వెళ్తున్నట్టు చెప్పారు.

ప్రభుత్వం నడిపే బస్సుల కొలతల్లోనూ తేడాలున్నాయన్నారు. తమ బస్సులకు కొంత వెసులుబాటు ఇవ్వాలని ఆయన కోరారు. కేశినేని నాని అమ్మిన బస్సుల కొలతల్లో కూడ తేడాలున్నాయన్నారు. చార్జీల నిర్ణయంలో ప్రభుత్వం ఏ పాలసీని నిర్ణయించలేదన్నారు సునీల్ రెడ్డి.

బస్సుల వ్యాపారం నుండి బయటకు వెళ్ళిపోయిన కేశినేని తమను ఇబ్బందిపెట్టడం సరైందికాదన్నారాయన.అరుణాచల్ ప్రదేశ్ ప్రభుత్వం ఆదేశాలపై ఈటానగర్ కోర్టు స్టే ఇచ్చిందన్నారు. కావాలంటే బస్సు ఆపరేటర్లు ఎంపీ నానిని కలుస్తామన్నారు.

ప్రమాదానికి గురైన ఆరెంజ్ ట్రావెల్స్ బస్సును పటమట పోలీస్ స్టేషన్ నుండి విడుదల చేయలేదన్నారు. డెలివరీకి ముందు రిజిస్ట్రేషన్ జరుగుతోందనడం సరికాదన్నారు సునీల్ రెడ్డి.

చట్టప్రకారంగానే బస్సులను నడుపుతున్నట్టు చెప్పారు. ప్రభుత్వ బస్సులు కూడ నిబంధనలకు విరుద్దంగా నడుస్తున్నాయన్నారు. అరుణాచల్ ప్రదేశ్ రిజిస్ట్రేషన్ ఉన్న బస్సులను నాలుగేళ్ళుగా నడుపుతున్నట్టు చెప్పారు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
As per rules we are running buses said private bus operators association vice president Sunil Reddy. He met Andhra pradesh chiefminister Chandrababu naidu on Saturday in Amaravati.he slams on Vijayawada MP Kesineni Nani.
Please Wait while comments are loading...