ఎన్టీఆర్ కు ఇవ్వరుగా.. లోకేష్ కైనా..! చంద్రబాబుకు ఓవైసీ కీలక సూచన..!
సుదీర్ఘ చరిత్ర కలిగిన తెలుగు దేశం పార్టీ పగ్గాల్ని ఓవైపు, ఆంధ్రప్రదేశ్ సీఎం పగ్గాల్ని మరోవైపు మోస్తున్న నారా చంద్రబాబు నాయుడికి హైదరాబాద్ ఎంపీ, ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ కీలక సూచన చేశారు. ముఖ్యంగా పార్టీ పగ్గాల విషయంలో లోకేష్ కు మద్దతుగా ఓవైసీ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. అలాగే ఎన్టీఆర్ విషయంలోనూ చంద్రబాబు వైఖరిని ఓవైసీ కుండబద్దలు కొట్టేశారు.
ఏపీ సీఎం చంద్రబాబు, ఆయన కుమారుడు, మంత్రి నారా లోకేష్, జూనియర్ ఎన్టీఆర్ ను ఉద్దేశించి అసదుద్దీన్ ఓవైసీ కీలక వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు తన కంటే, తన పార్టీ కంటే లోకేష్ కు ఎక్కువ నష్టం చేస్తున్నారని అభిప్రాయపడ్డారు. ఎలాగో తన తర్వాత కుమారుడు లోకేషే పార్టీ పగ్గాలు తీసుకుంటాడు కదా, జూనియర్ ఎన్టీఆర్ అయితే ఆ పదవికి పోటీ రాడు కదా అని ఓవైసీ వ్యాఖ్యానించారు.

జూనియర్ ఎన్టీఆర్ నుద్దేశించి మాట్లాడుతున్నప్పుడు ఎంఐఎం శ్రేణులు ఉత్సాహంగా చప్పట్లు చరుస్తుండగా.. ఆయన అంత పాపులరా అని ఓవైసీ వారిని ప్రశ్నించారు. చంద్రబాబు సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న నేత అని, గతంలో సీఎంగా తొమ్మిదేళ్లు, విపక్ష నేతగా పదేళ్లు పనిచేశారని గుర్తుచేశారు. అటువంటి వ్యక్తి లోకేష్ విషయంలో సరైన నిర్ణయం తీసుకోవాలని ఓవైసీ సూచించారు.
ఇప్పటికే ఏపీ రాజకీయాల్లో మంత్రిగా, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా చురుగ్గా వ్యవహరిస్తున్న లోకేష్ కు చంద్రబాబుకు ఆటోమేటిక్ వారసుడిగా ఇప్పటికే పేరు వచ్చేసింది. అదే సమయంలో ఆయన కాబోయే సీఎం అనే వ్యాఖ్యలు టీడీపీ నేతల నుంచి వినిపిస్తూనే ఉన్నాయి. ఇంత పాజిటివ్ పరిస్ధితులు ఉన్నప్పుడు లోకేష్ కు నష్టం చేయకుండా టీడీపీ పగ్గాలు ఇచ్చేయాలని అసదుద్దీన్ ఓవైసీ చేసిన సూచన ప్రాధాన్యం సంతరించుకుంది.












Click it and Unblock the Notifications