హైద్రాబాద్ యుటి ఒప్పుకోం: అశోక్, కెసిఆర్‌కు జవాబు
కర్నూలు: రాష్ట్ర రాజధాని హైదరాబాదును కేంద్రపాలిత ప్రాంతంగా లేదా ఉమ్మడి రాజధానిగా ఒప్పుకునేది లేదని, సమైక్యాంధ్ర కోసం పార్లమెంటులో బిల్లును అడ్డుకునే సత్తా తమకు ఉందని ఎపిఎన్జీవో అధ్యక్షుడు అశోక్ బాబు ఆదివారం కర్నూలులో జరిగిన సేవ్ ఆంధ్ర ప్రదేశ్ సభలో అన్నారు. తమను కించపర్చినా, రెచ్చగొట్టినా తాము రెచ్చిపోయేది లేదన్నారు. 2009 మేనిఫెస్టోలో తెలంగాణ అంశమే లేదని కాంగ్రెసు పార్టీని తాము గెలిపించామని, ఇప్పుడు విభజన ప్రకటన ఎలా చేస్తారని ప్రశ్నించారు.

తమ ఉద్యమం వెనుక ప్రజలు తప్ప మరెవరు లేరన్నారు. సీమాంద్రులు దోపిడీదారులని దోచుకున్నారని విమర్శిస్తున్నారని ఎవరు ద్రోహులో తేల్చుకుందామా అని ప్రశ్నించారు. వారే తెలంగాణ ప్రజలకు ద్రోహులని తాము కాదన్నారు. తాము తెలంగాణ ప్రజలకు మిత్రులమని, ఈ అంశంపై చర్చించేందుకు సిద్ధమన్నారు. తాము ద్రోహులని నిరూపిస్తే సమైక్యాంధ్ర ఉద్యమాన్ని ఆపేస్తామని సవాల్ చేశారు. మీరు ద్రోహులని నిరూపిస్తే ఇక అంతటితో విభజన వాదానికి శుభం కార్డు వేస్తారా చెప్పాలన్నారు.
ఇందుకు సిద్ధమైతే వారే చర్చకు తేదీ, వేదిక చెప్పాలని సవాల్ విసిరారు. ప్రపంచంలో ప్రస్తుత నినాదం సమైక్యమేనని చెప్పారు. పది జిల్లాల సభ ఎలా ఉంది? ఒక్క జిల్లా సభ ఎలా ఉందంటూ హైదరాబాద్‌లో జరిగిన సకల జన భేరిని ఉద్దేశించి అశోక్ బాబు వ్యాఖ్యానించారు. హైదరాబాద్ సభలో కెసిఆర్ సంధించిన ప్రశ్నలకు కర్నూలు సభలో అశోక్‌బాబు జవాబులు ఇచ్చారు.
సీమాంధ్ర ఉద్యమం ఎటువంటిదో తెలుసుకోవాలంటే కెసిఆర్.. టిఎన్జీవో నాయకులు ఇక్కడికి వచ్చి కార్మికులతో మాట్లాడాలన్నారు. ఉద్యమాన్ని 60 రోజులే కాదు.. 172 రోజులు చేసే సంకల్పం తమకుందని, మమ్మల్ని రెచ్చగొట్టవద్దని, మాటల్లో చేతల్లో తమది గాంధేయవాదమని, మీ వాదన.. ఉద్యమంలో బలం లేదన్నారు. అందుకే రెచ్చిపోతున్నారన్నారు. మీరు చేసే వ్యాఖ్యలకు తాము స్పందించడం లేదని, కలిసి ఉండాలని భావిస్తున్నామన్నారు.
'ఇన్నాళ్లూ మీరు సర్దుకుపోయారని అంటున్నారు. ఇకనుంచి మేం సర్దుకుపోతాం. హైదరాబాద్ సభలో కానిస్టేబుల్ జై తెలంగాణ అన్నందుకు కొట్టారని.. కొట్టించారని అన్నావు. ఇదేనా మీ సంస్కారం అని ప్రశ్నించావు. మా మీద చెప్పు వేస్తే ఊరుకునే సంస్కారం మాకు ఉంది. అదే సంస్కారం నీకు ఉందా? ఆ సభలో మామీద ఓ వ్యక్తి చెప్పు వేశాడు. మరో వ్యక్తి తెలంగాణ నినాదాలు చేశాడు. అయినా పోలీసులు కొడుతుంటే వద్దని వారించాం. అవాకులు చవాకులు పేలితే సహించం.
మీ అవాకులు చవాకులకు స్పందించే స్థాయి మాది కాదు. నువ్వే నీ ప్రజలను అవమానించావు. సంస్కృతి పుట్టుకతో రావాలి. ఆ సంస్కృతి తెలంగాణలో ఉంది. తెలంగాణలో ఎవరూ ఇటువంటి పనులు సహించరు. ఆప్యాయతకు, అమాయకత్వానికి వాళ్లు పెట్టింది పేరు. మీరే తప్పుదారి పట్టించారు. అశోక్ బాబు ఎవరని అడుగుతున్నావు. ఒక్కసారి సెంచరీ కొట్టిన తర్వాతే ధోనీ పేరు దేశవ్యాప్తంగా మార్మోగింది. నేనూ అంతే. నన్ను తాకే స్థాయిలో కూడా మీరు లేరు. ఇక, ఉద్యమం కూడా మీ చేతుల్లో లేదు.
ఆ విషయం నాకు తెలుసు. ఎక్కడ సెటిల్ చేయాలో అక్కడే సెటిల్ చేసుకుంటాం. హైదరాబాద్‌లో స్థానబలం ఉందని మాట్లాడితే.. ఢిల్లీలో ఎంపీల మెడలు వంచి బిల్లుపై సంతకం చేయకుండా ఆపే సత్తా మాకుంది. కేంద్ర ప్రభుత్వం రాజకీయ అవకాశ వాదం, సీట్ల కోసమే తెలంగాణకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. మా సహనాన్ని పరీక్షిస్తే పార్లమెంటులో బిల్లు పెడితే హైదరాబాద్‌లో మిలియన్ మార్చ్ చేపడతాం. దానిని అడ్డుకుంటుందో ఏం చేస్తుందో కేంద్రానికే వదిలేస్తాం.
ఏ రాజకీయ నాయకుడు అయినా ఒక్క రూపాయి ఇవ్వకుండా ఇటువంటి సభ నిర్వహిస్తే ఆయన కాళ్లకు నమస్కరిస్తా. ఈ విషయం నాకంటే రాజకీయ నాయకులకే ఎక్కువ తెలుసు. స్వాత్రంత్య పోరాటంలో ఉన్న ఐక్యతే ఇప్పుడు కూడా కనిపిస్తోంది. వీసమెత్తు స్వార్థం, రాజకీయం లేవు. తెలంగాణవాదం పుట్టించింది వలసవాదే విభజనవాదుల వాదనలో బలం లేదు. వాళ్లు భయపడుతున్నారు. అందుకే రెచ్చగొడుతున్నారు.
ఒక చిన్న పిల్లాడు చీకట్లో వెళుతున్నాడనుకోండి. గట్టిగా అరుచుకుంటూ పాటలు పాడుకుంటూ వెళతాడు. విభజనవాదులూ అంతే. భయపడుతున్నారు కనకే రెచ్చగొడుతున్నారు. హైదరాబాద్ సభలో ఎవరో అన్నారు.. మాకు ఒక్క గంట సమయం ఇచ్చి చూడండి ఏం జరుగుతుందో అని! ఒక్క గంట సమయం ఇచ్చి చూడడానికి ఇవేమీ పెళ్లి చూపులు కావు. ప్రేలాపనలు, రెచ్చగొట్టే వ్యాఖ్యలు మంచిది కాదు. తెలంగాణ ఏర్పడాలంటే సీమాంద్రుల అంగీకారం అవసరం. ఏకాభిప్రాయం లేకుండా రాష్ట్రం ఏర్పడదు.
తెలంగాణలోని 60 శాతం ప్రజలు సమైక్యాంధ్రనే కోరుకుంటున్నారు. తెలంగాణలోని ఏ వ్యక్తీ వాదాన్ని పుట్టించలేదు. 1969లో జరిగిన ఉద్యమం తెలంగాణ కోసం కాదు. ముల్కీ నిబంధనలపైనే. దోచుకున్నామని అంటున్నారు. ఏం దోచుకున్నాం. హైదరాబాద్‌కు లక్షల టన్నుల ఇసుక వెళ్లింది మా నందిగామ నుంచే. హైదరాబాద్ నుంచి పూచికపుల్ల కూడా మాకు రాలేదు.
మా బొగ్గు తీసుకు పోయారని అంటున్నారు.
హైదరాబాద్ వెలుగులన్నీ మా వీటీపీఎస్ నుంచి వెళ్లినవే. అందుకు ప్రతిగా 40 ఏళ్లుగా మా రైతులు నష్టపోయారు. మా కృష్ణా బ్యారేజీని నాశనం చేశారు. సీమాంధ్రలో ఉత్పత్తయ్యే విద్యుత్తులో 60 శాతం హైదరాబాద్‌కే వెళుతోంది. మేం.. మీ బొగ్గు వాడుకోలేదు. గోదావరి నీళ్లు వాడుకోలేదు. కృష్ణా నీళ్లు మీరే ఎక్కువగా వాడుకుంటున్నారు. ఒక్క హైదరాబాద్‌కే 18 టీఎంసీల నీటిని వాడుకుంటున్నారు.
హైదరాబాద్ మాదని మేం అంటే.. ఇక్కడ పది శాతం కూడా సీమాంద్రులు లేరని అంటున్నారు కదా మీరు. హైదరాబాద్‌లో నాలుగు లక్షలమంది కూడా సీమాంద్రులు లేనప్పుడు రాష్ట్రం విడిపోతే హైదరాబాద్‌కు నీటిని సరఫరా చేసే కృష్ణా పైపులను మూసివేయాలని మేం డిమాండ్ చేస్తాం. మూసేయిస్తావా? రాష్ట్రం విడిపోతే నీటి యుద్ధాలే. తల్లిదండ్రులను, అన్నదమ్ములను పంచుకున్నవాళ్లు ఉన్నారు. కానీ, నదీజలాల సమస్యను ఎవరు ఎవరు పరిష్కరిస్తారు.
-
నా దేవత- ఆమె రాకతోనే నా జీవితం ఇలా మారిపోయింది -
ఆయన చలవ వల్లే- సక్సెస్ మంత్ర బయటపెట్టిన సంజు -
రిటైర్మెంట్ పై సూర్య కుమార్ సంచలన ప్రకటన..!! -
రోహిత్‌కు పెళ్లాం పోరు.. స్టేడియంలో డిష్యూం.. డిష్యూం! వీడియో -
ప్రపంచ్ కప్ తో సూర్య టీం ముందుగా అక్కడికే, వెంట పెట్టుకొని వెళ్లిన జైషా..!! -
Viral Video: ఆ తొలి స్పర్శ, బిడ్డను ఎత్తుకోవడానికి వణికిపోయాడు -
ఇంత నిలకడ మా పోర్ట్‌లోని క్రేన్‌కు కూడా ఉండదు- సంజు శాంసన్ పై ప్రశంసలు -
11 రోజుల్లో 13,560 కి.మీ నాన్ స్టాప్ జర్నీ: చిరు ప్రాణి రెక్కల ముందు సప్త మహా సముద్రాలు చిన్నబోయాయ్ -
తెలంగాణ నూతన సీఎస్ గా- రేవంత్ మార్క్ నిర్ణయం..!! -
కివీసీ ప్లేయర్ కన్నీటి పర్యంతం, ఓడినందుకు కాదు - ఇండియన్ వైబ్రేషన్స్ తో ఒక్కసారిగా..!! -
Kavuri Sambasiva Rao: కావూరి సాంబశివరావు మృతి వార్తలు ? క్లారిటీ ఇదే..! -
పాకిస్తాన్ కు ఐసీసీ భారీ నగదు బహుమతి! ఎన్ని కోట్లంటే..!












Click it and Unblock the Notifications