టిపై వారం: 30 వరకు గడువు, ఎన్నికల్లోగా ఏర్పాటుకే

న్యూఢిల్లీ: తెలంగాణ ముసాయిదా బిల్లు పైన ఆంధ్రప్రదేశ్ శాసన సభలో చర్చకు రాష్ట్రపతి వారం రోజుల పాటు పొడిగించారు. ఈ నెల 30వ తేదీ వరకు అసెంబ్లీ అభిప్రాయం చెప్పాల్సి ఉంటుంది. బిల్లుపై గడువు పెంచే అంశంపై గురువారం ఢిల్లీలో జోరుగా చర్చలు జరిగాయి. బిల్లుపైన గడువు పెంచినట్లు వచ్చిన వార్తలను రాష్ట్రపతి కార్యాలయ వర్గాలు ధ్రువీకరించాయి. గణతంత్ర దినోత్సవాన్ని మినహాయిస్తే ఆరు రోజులు ఉంటుంది.

తొలుత రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీతో కేంద్ర హోంమంత్రి సుశీల్ కుమార్ షిండే భేటీ అయ్యారు. అనంతరం ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీతో పార్టీ సీనియర్ నేతలు సుశీల్ కుమార్ షిండే, ఆంటోని, గులాం నబీ ఆజాద్, దిగ్విజయ్ సింగ్ తదితరులు భేటీ అయ్యారు. వారి భేటీలో తెలంగాణ అంశమే ప్రధాన అజెండాగా తెలుస్తోంది.

Assembly gets another week to debate on Telangana Bill

అంతకుముందు షిండే, రాష్ట్రపతి భేటీలో గడువుపై తర్జన భర్జన సాగినట్లుగా వార్తలు వచ్చాయి. నెల రోజుల గడువు పెంచడం కష్ట సాధ్యమని షిండే చెప్పారు. అనంతరం రాష్ట్రపతి వారం రోజుల పాటు గడువు పెంచారు.

ఫిబ్రవరి 5వ తేదీ నుండి పార్లమెంటు సమావేశాలు ఉన్న నేపథ్యంలో నాలుగు వారాలు అంటే నెల రోజుల పాటు గడువు పెంపు కుదరదని కేంద్రం, కాంగ్రెసు వర్గాలు చెప్పాయి. వచ్చే పార్లమెంటు సమావేశాల్లోనే తెలంగాణ ముసాయిదా బిల్లును పెట్టాలని కేంద్రం భావిస్తోంది. ఎన్నికల్లోపు ఈ ప్రక్రియను పూర్తి చేయాలని బలంగా నిర్ణయించుకున్నారంటున్నారు. ఈ నేపథ్యంలో వారం రోజుల గడువుకు అంగీకరించినట్లుగా తెలుస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+