టి: జగన్‌కు ఇష్టంలేదని శైలజానాథ్, సర్ది చెప్పిన కిరణ్

సభలో తమను సస్పెండ్ చేయించుకొని ప్రజలలోకి వెళ్లి మొసలి కన్నీరు కార్చాలని చూస్తున్నారన్నారు. చర్చ జరిగి బిల్లును ఓడిస్తే న్యాయపోరాటానికి కూడా అవకాశముంటుందని కానీ, చర్చకు ఆ పార్టీ ముందుకు రావడం లేదన్నారు. చర్చ జరిగాక బిల్లును 159 మంది ఎమ్మెల్యేలు ఓడిస్తారని కానీ, సమైక్య మెజార్టీని తగ్గించేందుకు జగన్ ప్రయత్నిస్తున్నారన్నారు.
దూళిపాళ్ల ఆగ్రహం
సభలో బిల్లును ఓడించేందుకు ప్రయత్నించాలని దూళిపాళ్ల నరేంద్ర అన్నారు. సమైక్యం పేరుతో జగన్ నాటకాలాడుతున్నారని ధ్వజమెత్తారు. జగన్ సమైక్య ముసుగులో ఉన్న విభజనవాది అని ఆరోపించారు. డిల్లీ పౌరుషానికి పోటీ అన్న జగన్ ఇప్పుడు తెలుగు వారి గౌరవాన్ని ఢిల్లీలో తాకట్టు పెట్టారన్నారు. జగన్‌ను సీమాంధ్ర ప్రజలు తరిమి కొట్టాలన్నారు. బెయిల్ కోసం సోనియా కాళ్లు పట్టుకున్న జగన్ మమ్మల్ని విమర్శించడమా అన్నారు.
జగన్ పార్టీ ఎమ్మెల్యేల సస్పెన్షన్‌కు ఛాన్స్
వైయస్సార్ కాంగ్రెసు పార్టీ శాసన సభ్యులను సభ నుండి సస్పెండ్ చేసే అవకాశాలున్నాయి. చర్చకు జగన్ పార్టీ సహకరించనందున ఆ పార్టీ ఎమ్మెల్యేలను సస్పెండ్ చేసి సభ సజావుగా సాగేలా చూడాలని ప్రభుత్వం చూస్తోంది. సభాపతి నాదెండ్ల మనోహర్‌తో మంత్రులు శైలజానాథ్, ఆనం రామనారాయణ రెడ్డి, రఘువీరా రెడ్డిలు భేటీ అయ్యారు.
సభ వాయిదా
శాసన సభలో చర్చించాలని కోరుతూ పలు అంశాలపై స్పీకర్‌కు పార్టీలు వాయిదా తీర్మానాలు ఇచ్చాయి. సమైక్య, తెలంగాణ ఉద్యమాలపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వైఖరిపై చర్చ కోరుతూ టిడిపి, సమైక్యం తీర్మానం కోసం వైయస్సార్ కాంగ్రెసు, గ్రామ సేవకుల వేతనాలు పెంచాలని సిపిఎం వాయిదా తీర్మానం ఇచ్చాయి. సభ ప్రారంభమయ్యాక వాటిని స్పీకర్ తిరస్కరించారు. ఈ సమయంలో ఇరు ప్రాంతాల ఎమ్మెల్యేలు జై తెలంగాణ, జై సమైక్యాంధ్ర అంటూ నినాదాలు చేశారు. గందరగోళం నెలకొనడంతో స్పీకర్ సభను వాయిదా వేశారు.
మండలిలో...
శాసన మండలిలో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ పైన మంత్రి శైలజానాథ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రం సమైక్యంగా ఉండటం జగన్ పార్టీకి ఇష్టం లేదని, విడిపోతేనే తమకు లాభమని, విభజన కోరుకుంటోందని ఆరోపించారు. అందుకే చర్చను అడ్డుకుంటుందన్నారు. విభజన బిల్లు రాజ్యాంగ విరుద్దంగా ఉందన్న శైలజానాథ్, బిల్లుపై పూర్తి సమాచారం ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. ఇప్పటికే తమ వద్ద ఉన్న సమాచారం ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నామని, పూర్తి సమాచారం ఇవ్వాలని కేంద్రాన్ని కోరామన్నారు.
అభ్యంతరం లేదు
పూర్తి సమాచారం ఇస్తే బిల్లు పైన చర్చించేందుకు తమకు అభ్యంతరం లేదని యనమల రామకృష్ణుడు మండలిలో అన్నారు. బిల్లుపై ప్రభుత్వం వద్ద ఉన్న సమాచారాన్ని భలో పెట్టారన్నారు. బిల్లులో లోపాలున్నాయని, పూర్తి సమాచారం ఇవ్వాలని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ ఎమ్మెల్సీలు డిమాండ్ చేశారు.
పొన్నాల, ఎర్రబెల్లి వాగ్వాదం
ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి సమక్షంలో టిటిడిపి నేత ఎర్రబెల్లి దయాకర రావు, మంత్రి పొన్నాల లక్ష్మయ్యల మధ్య వాగ్వాదం జరిగింది. టిటిడిపి నేతలు కిరణ్‌ను కలిసి గేమింగ్ జోన్ బాధితులకు న్యాయం చేయాలని కోరారు. ఈ సమయంలో పొన్నాలపై బ్రోకర్ అంటూ మండిపడ్డారు. పొన్నాల తీవ్రంగా స్పందించారు. వారికి కిరణ్ సర్ది చెప్పారు. అనంతరం బాధితులకు న్యాయం చేస్తానని హామీ ఇచ్చారు.












Click it and Unblock the Notifications