ఏపీ రాజధాని ఏది - తేల్చేసిన ఓటర్లు, ఇక అక్కడే...!!

ఏపీ ఫలితం ఎన్నో సమస్యలకు పరిష్కారం ఇస్తోంది. ఏపీలో రాజధాని వ్యవహారం దాదాపు అయిదేళ్ల కాలంగా వివాదంగా మారింది. న్యాయస్థానం పరిధిలో ఉంది. విశాఖ పరిపాలనా రాజధాని నినాదంతో వైసీపీ ముందుకు వెళ్లింది. ఎన్డీఏ కూటమిలోని మూడు పార్టీలతో పాటుగా కాంగ్రెస్ సైతం అమరావతికి జై కొట్టింది. కానీ, ఓటర్లు ఏం తీర్పు ఇచ్చారు. ప్రత్యేకంగా ఉత్తరాంధ్ర..అమరావతి పరిధిలో ఏ పార్టీకి ప్రజలు మొగ్గు చూపారు..ఆ తీర్పే రాజధాని పైన ప్రజాభిప్రాయంగా చర్చ జరుగుతోంది.

ఏపీ రాజధాని పై క్లారిటీ
ఏపీ రాజధానిగా అమరావతి కొనసాగతుందా. జగన్ చెప్పిన విధంగా మూడు రాజధానులే ఏపీ ప్రజలు కోరుకుంటున్నారా. జూన్ 4న వెల్లడి కానున్న ఫలితాల్లో ఏపీలో అధికారంతో పాటుగా రాజధాని అంశం పైన స్పష్టత రానుంది. సీఎం జగన్.మళ్లీ గెలుస్తున్నాం.. విశాఖలోనే ప్రమాణం చేస్తా... విశాఖ నుంచే పాలన కొనసాగిస్తా అని ధీమాగా చెప్పుకొచ్చారు. చంద్రబాబు గెలుస్తున్నారు..అమరావతిలో ప్రమాణ స్వీకారం ఉంటుందని టీడీపీ నేతలు చెబుతున్నారు. విశాఖలో జగన్ జూన్ 9న ప్రమాణ స్వీకారం చేస్తారంటూ ముహూర్తం సైతం ప్రకటించారు.

Assembly Poll Results may give clarity about Captial new govt take final decision

ప్రజలు తీర్పు ఇచ్చినట్లేనా
అమరావతిని శాసన రాజధానిగా కొనసాగిస్తూ విశాఖను పరిపాలన రాజధానిగా.. కర్నూలును న్యాయ రాజధానిగా చేస్తామని జగన్ ప్రకటించారు. ప్రస్తుతం ఈ వివాదం సుప్రీంకోర్టు పరిధిలో ఉంది. ప్రతిపక్షాలు అమరావతి మాత్రమే రాజధానిగా ఉండాలంటూ నినదించారు. దీంతో..ఈ సారి ఎన్నికల్లో రాజధాని వ్యవహారం అమరావత్సి వర్సెస్ విశాఖగా మారింది. ఎన్నికల ముందే ఎవరి స్టాండ్ ఏంటో క్లియర్ కట్‌గా ప్రజల ముందు పెట్టారు. దీంతో ఎన్నికల్లో వచ్చే తీర్పు రాజధానిపై రెఫరెండంగా చర్చ జరుగుతోంది. విశాఖ నగరంతో పాటుగా ఉత్తరాంధ్ర..అదే విధంగా అమరావతి పరిధిలోని రెండు జిల్లాల్లో ఏ పార్టీకి ప్రజలు పట్టం కట్టారనే దానికి అనుగుణంగా రాజధాని పైన ప్రజల మూడ్ పై క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తోంది.

కొత్త ప్రభుత్వం నిర్ణయం
ఇక..ఫలితాల తరువాత కొత్త ప్రభుత్వం రాజధాని పైన కీలక నిర్ణయం తీసుకొనే అవకాశం కనిపిస్తోంది. ఎన్నికల్లో ప్రజలు వైసీపీకి మద్దతిచ్చి గెలిపిస్తే..మూడు రాజధానుల పై జగన్ ముందుకు వెళ్లవచ్చని గతంలో టీడీపీ ముఖ్య నేతలు సవాల్ చేసారు. ఇప్పుడు రాజధాని పైన పార్టీల స్టాండ్ స్పష్టం అయిన తరువాత పోలింగ్ జరిగింది. ఇక...వచ్చే తీర్పుకు అనుగుణంగా సుప్రీంలో కేసు విషయంలో కొత్త ప్రభుత్వం కీలక అడుగులు వేసే అవకాశం కనిపిస్తోంది. అయితే, జగన్ కు పట్టం కడితే కోర్టు తుది తీర్పు వచ్చే వరకూ విశాఖ కేంద్రంగా సీఎం పాలన చేసే అవకాశం ఉంది. కూటమి గెలిస్తే సుప్రీంలో ప్రభుత్వం చేసిన అప్పీల్ పైన నిర్ణయంతో పాటుగా..అమరావతిని కొనసాగించే అవకాశం ఉందనే చర్చ సాగుతోంది. దీంతో..ఎన్నికల ఫలితంతో రాజధాని అంశం తేలే ఛాన్స్ కనిపిస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+