వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అసెంబ్లీ రూటు మార్పు: రైతులకు పోలీసుల నోటీసులు: ఉత్కంఠ..!

|
Google Oneindia TeluguNews

ఏపీ అసెంబ్లీ ప్రత్యేక సమావేశానికి సమయం దగ్గర పడుతోంది. మూడు రాజధానులు..అమరావతి నుండి పరిపాలనా రాజధాని తరలింపు దిశగా ఆ సమావేశం జరగనుంది. ఇప్పటికే అమరావతి నుండి రాజధాని తరలింపును నిరసిస్తూ అక్కడి స్థానికులు..రైతులు 32 రోజులుగా ఆందోళన చేస్తున్నారు. స్థానికుల అందోళన సమయంలో ముఖ్యమంత్రి సచివాలయానికి వచ్చే సమయంలో పెద్ద ఎత్తున బందోబస్తు ఏర్పాటు చేసిన పోలీసులు..ఇక, ఈ సమావేశాల కోసం కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. అసెంబ్లీకి వచ్చేందుకు మందడం సమస్యాత్మకంగా మారే అవకాశం ఉండటంతో..కొత్త రూటును సిద్దం చేస్తున్నారు. అదే విధంగా జైల్ బరో..ఛలో అసెంబ్లీకి పిలుపునివ్వటంతో జేఏసీ నేతలతో పాటుగా రైతులకు వ్యక్తిగతంగా పోలీసులు ముందస్తు నోటీసులు ఇవ్వటం ప్రారంభించారు.

అసెంబ్లీకి కొత్త రూటు సిద్దం..
అసెంబ్లీ పరిసర ప్రాంతాల్లో సమావేశాల సమయంలో స్థానికులు..రైతులు ఆందోళనకు దిగే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఇప్పటికే సచివాలయానికి వెళ్లే దారిలో మందడం..వెలగపూడి గ్రామాల్లో నిరసనలు పెద్ద ఎత్తున కొనసాగుతున్నాయి. దీంతో..అసెంబ్లీకి హాజరయ్యే స్పీకర్..సీఎం..మంత్రులు..ఎమ్మెల్యేలు..అధికారులకు ఇబ్బంది లేకుండా పోలీసులు ప్రత్యామ్నాయ చర్యల పైన ఫోకస్ చేసారు. అందులో బాగంగా అసెంబ్లీకి చేరుకోవడానికి మరో దారిని అధికారులు సిద్ధం చేస్తున్నారు. కొన్నేళ్లుగా వినియోగంలో లేని రోడ్డుకు మరమ్మతులు చేస్తున్నారు. కృష్ణాయపాలెం చెరువు నుంచి శాసనసభకు రావడానికి వీలుగా రోడ్డును గతంలో ఏర్పాటు చేశారు. ఇప్పటి వరకు ఆ రోడ్డును పట్టించుకోలేదు. కొన్ని రోజులుగా వాటిని పూడ్చి వాహనాల రాకపోకలకు వీలుగా మరమ్మతులు చేస్తున్నారు. రాజధాని తరలింపు ప్రకటన తర్వాత ప్రజల నుంచి తీవ్ర నిరసనలు వ్యక్తం అవుతుండటంతో ముందస్తుగా ఈ మార్గాన్ని అధికారులు సిద్దం చేస్తున్నారు. అవసరమైన సమయంలో ముఖ్యుల రాకపోకలు ఈ దారి మీదుగా కొనసాగించనున్నారు.

Assembly sessions tension:Police issued notices to leaders and farmers

నేతలు..రైతులకు పోలీసుల నోటీసులు..
ఇక..అసెంబ్లీ రాజధాని అంశం పైనే సమావేశమై..నిర్ణయం తీసుకొనే అవకాశం ఉండటంతో..ఉద్రిక్తలు ఏర్పడే ఛాన్స్ ఉందని పోలీసులు అంచనా వేస్తున్నారు. అందులో భాగంగా..అసెంబ్లీ పరిసర ప్రాంతాలల్లో పెద్ద ఎత్తున పోలీసు బలగాలను మొహరిస్తున్నారు. అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో రైతులకు ముందస్తు నోటీసులు ఇచ్చిన పోలీసులు..ఈ నెల 20న ఎటువంటి నిరసనలకు అనుమతి లేదని స్పష్టం చేస్తు న్నారు. చలో అసెంబ్లీతో పాటు జైల్ భరో కార్యక్రమానికి పిలునివ్వడంతో..జేఏసీలోని నేతలకు..రైతులకు ఈ నోటీసులు అందచేస్తున్నారు. సమావేశాలు జరిగే రోజున ఎటువంటి ఆందోళనలకి అనుమతి లేదన్న పోలీసులు..ఎవరైనా ఆంక్షలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరిస్తున్నారు. 29 గ్రామాల్లో రైతులతో పాటు పలు రాజకీయ పార్టీల నేతలకి నోటీసులు ఇచ్చిన పోలీసులు...గ్రామాల్లో సమావేశాలు.. కదిలక లపైనా నిఘా పెట్టినట్లుగా తెలుస్తోంది.

English summary
Police arranged new route for Assembly for leaders and officers. Due to protests in Amaravati villages pollice issued notices to local people and Jac leaders.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X