అక్కినేని అఖిల్ జాతకం చెప్పిన వేణుస్వామి
ఎవరికైనా అనుకున్న పని అవ్వకపోయినా, జీవితంలో విజయం అందకపోయినా అందరూ చెప్పే మాటేమిటంటే.. జాతకాలు బాగోలేదని. ముఖ్యంగా సినీ పరిశ్రమలో ఉన్నవారు వీటిని ఎక్కువగా నమ్ముతారు. తెలుగు చలనచిత్ర పరిశ్రమకు సంబంధించి జాతకాలు అంటే అందరికీ టక్కున గుర్తుకొచ్చేది వేణుస్వామి. సెలబ్రటీల జాతకాలు చెప్పడంతోపాటు వాటిలో ఏమైనా దోషాలున్నా చెప్పి వారితో అందుకు పరిహారాలు చేయిస్తుంటాడు.
వేణుస్వామి చెప్పేవి గతంలో ఎవరూ నమ్మకపోయినప్పటికీ సమంత, నయనతార విషయంలో చెప్పినవి చెప్పినట్లుగా జరగడంతో అందరూ వేణుస్వామి చేత పరిహారాలు చేయించుకుంటున్నారు. తమ జాతకంలో దోషాలున్నాయని రష్మిక, నిధి అగర్వాల్ యాగాలు చేయించుకున్నారు. ప్రభాస్,ఎన్టీఆర్, చరణ్, అల్లు అర్జున్ గురించి కూడా వేణు స్వామి సంచలన విషయాలు చెప్పారు.

తాజాగా అక్కినేని వారసుడు అఖిల్ పరాజయాలకు కూడా ఆయన కారణం చెప్పారు. అతడి జాతకంలో దోషం ఉండడం వలనే పరాజయాలు పలకరిస్తున్నాయన్నారు. అఖిల్ జాతకంలో నాగదోషం ఉందని, ఈ దోషం ఉన్నవారు ఇతరుల సలహాలు తీసుకోకుండా సొంత నిర్ణయాలు తీసుకోవాలని, అలాచేస్తే అఖిల్ మంచి విజయాలు అందుకుంటాడన్నారు. ఎవరి సలహా తీసుకున్నా ఇలాంటి పరాజయాలు పలకరిస్తాయన్నారు.
అక్కినేని అఖిల్ జాతకంలో చంద్రుడు నీచంలో ఉన్నాడని, తల్లి చంద్రుడు.. తండ్రి సూర్యుడు అనుకుంటే.. చంద్రుడు నీచంలో ఉండటం వల్ల అఖిల్ సినిమాల విషయంలో అక్కినేని అమల ప్రమేయం కలిసి రాదని చెప్పారు. ఇదంతా జాతక ప్రకారం మాత్రమే జరుగుతుందని, వ్యక్తిగతంగా పరిగణించొద్దన్నారు. ప్రస్తుతం వేణుస్వామి అఖిల్ విషయంలో చేసిన ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.












Click it and Unblock the Notifications