ఏపీలో అధికారం దక్కేదెవరికి, మంత్రుల్లో గెలిచేదెవరు - తేల్చేసిన వేణుస్వామి ...!!
ఏపీలో ఎన్నికల సమరం హోరా హోరీగా సాగుతోంది. ప్రధాన పార్టీలకు గెలుపు ప్రతిష్ఠాత్మకంగా మారుతోంది. గెలుపు పైన ధీమా వ్యక్తం చేస్తున్నా...లోలోపల మాత్రం పార్టీల అధినేతల్లో ఆందోళన కొనసాగుతోంది. కొత్త తెలుగు సంవత్సరం ప్రారంభం వేళ ఏపీలో జరగుతున్న ఎన్నికల్లో ఏ పార్టీ అధికారంలోకి వస్తుందనే అంశం పైన జ్యోతిష్కులు వేణుస్వామి అంచనాలు వెల్లడించారు. నెల్లూరు ఎంపీ ఫలితంతో పాటుగా, మంత్రుల గురించి కీలక అంశాలను చెప్పుకొచ్చారు.
హోరా హోరీ పోరు
ఏపీలో ఎన్నికల పోరు రసవత్తరంగా మారుతోంది. జగన్ ను ఓడించటమే లక్ష్యంగా కూటమిలోని మూడు పార్టీలు ప్రచారం కొనసాగిస్తున్నాయి. అటు జగన్ తనకు రెండో సారి అధికారం పైన ధీమాగా ఉన్నారు. కాంగ్రెస్, వామపక్షాల కూటమి బరిలోకి దిగింది. ఈ సమయంలో పలు సర్వ సంస్థలు ఏపీ ఎన్నికల ఫలితాల పైన తమ అంచనాలను బయట పెడుతున్నాయి. ప్రముఖ జ్యోతిష్కులు వేణుస్వామి ఏపీలో అధికారం ఎవరికి దక్కుతుందనే అంశంలో గ్రహ బలాల ఆధారంగా తన అంచనాలను వెల్లడించారు. ఏపీలో తిరిగి జగన్ అధికారం దక్కించుకుంటారని చెప్పుకొచ్చారు. అయితే, జూన్ తరువాత కొన్ని కీలక పరిణామాలు చోటు చేసుకుంటాయని పేర్కొన్నారు. అవి ఏంటనేది ఫలితాల తరువాత మాట్లాడుకుందామని చెప్పారు.

జగన్ కే అధికారం
జగన రాశి, నక్షత్రాలు అనుకూలంగా ఉన్నాయన్నారు. అదే సమయంలో వైసీపీ ముఖ్యనేత విజయ సాయిరెడ్డి పోటీ చేస్తున్న నెల్లూరు పార్లమెంట్ స్థానం గురించి ఆసక్తికర విశ్లేషణ చేసారు. నెల్లూరు ఎంపీ స్థానం కోసం వైసీపీ నుంచి విజయ సాయిరెడ్డి, టీడీపీ నుంచి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి పోటీ పడుతున్నారు. ఇద్దరి మధ్య పోటీలో ఇద్దరి జాతకం ప్రకారం సాయిరెడ్డికి పది శాతం వరకు అడ్వాంటేజ్ ఉంటుందని వేణుస్వామి తన అంచనాగా వెల్లడించారు. మంత్రుల్లో ముగ్గురి పరిస్థితిని వేణుస్వామి చెప్పుకొచ్చారు. మంత్రులు రోజా, అంబటి రాంబాబు, గుడివాడ అమర్నాధ్ టఫ్ ఫైట ఎదుర్కొంటున్నారని విశ్లేషించారు. అయితే, వారు ఓడిపోతారా అనే దానికి మంత్రి క్లారిటీ ఇవ్వలేదు. టఫ్ ఫైట్ గా మాత్రమే చెబుతున్నానన్నారు.

కేటీఆర్ పై కేసులు
ఇక..ఇదే సమయంలో తెలంగాణ రాజకీయాల గురించి ప్రస్తావించారు. బీఆర్ఎస్ నుంచి తిరిగి టీఆర్ఎస్ పేరు మార్పు అవసరమని వివరించారు. సీఎం రేవంత్ ఈ ఎన్నికల తరువాత కొన్ని కీలక పరిణామాలు ఎదుర్కొంటారని అంచనా వేసారు. ఇక, బీఆర్ఎస్ ముఖ్య నేత కేటీఆర్ కేసులు ఎదుర్కోవాల్సి వస్తుందని వేణుస్వామి సంచలన వ్యాఖ్యలు చేసారు. తెలంగాణ రాజకీయాల్లో ఈ రెండు అంశాలు మినహా కొత్తగా చోటు చేసుకొనే అవకాశం లేదన్నారు. ఏపీలో మాత్రం జూన్ తరువాత కీలక పరిణామాలు చోటు చేసుకుంటాయని వేణుస్వామి చెప్పుకొచ్చారు. దీంతో, ఇప్పుడు హోరా హోరీగా మారిన ఏపీ ఎన్నికల సమరంలో వేణుస్వామి అంచనాలు వైరల్ అవుతున్నాయి.












Click it and Unblock the Notifications