Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ప్రకాశం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం... ఐదుగురు అక్కడికక్కడే మృతి... ఆటో గేదె కళేబరాన్ని ఢీకొని బోల్తా...

ప్రకాశం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఒంగోలు-కర్నూలు రహదారిపై ఓ ఆటో బోల్తా కొట్టింది. ఈ ఘటనలో ఐదుగురు మృతి చెందగా.. మరికొందరు తీవ్రంగా గాయపడ్డారు. తర్లుపాడు మండలం రోలుగుంపాడు ఎస్టీ కాలనీ సమీపంలో ఈ ప్రమాదం జరిగింది. రోడ్డుపై అడ్డంగా పడి వున్న గేదె కళేబరాన్ని ఢీకొని ఆటో బోల్తా కొట్టినట్లు తెలుస్తోంది.

బేస్తవారి పేట మండలం కొత్తపల్లిలో జరిగిన ఓ శుభకార్యానికి వెళ్లి తిరిగొస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ప్రమాద సమయంలో మొత్తం 14 మంది ప్రయాణికులు ఆటోలో ఉన్నట్లు సమాచారం. ప్రమాద సమాచారం అందిన వెంటనే పోలీసులు హుటాహుటిన అక్కడికి చేరుకున్నారు. క్షతగాత్రులను మార్కాపురం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. వీరిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. మృతులను దర్శికి చెందిన పొట్లపాటి సారమ్మ,గొంగటి మార్తమ్మ,కోటమ్మ,ఇత్తడి లింగమ్మ,వెంకటేశ్వర్ రెడ్డిగా గుర్తించారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలుస్తోంది.

 A road accident took place in Prakasam district. An auto overturns on the Ongole-Kurnool road. Five people were killed and several others were injured in the incident. The accident took place near Tarlupadu Mandal Rolgumpadu ST Colony.

నాలుగు రోజుల క్రితం ఇదే ప్రకాశం జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో నలుగురు మృతి చెందిన సంగతి తెలిసిందే. బొలేరో వాహనం నుంచి జారిపడటంతో నలుగురు మృతి చెందారు. వీరిలో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందగా... మరో ఇద్దరు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. తుర్లపాడు-కొనకమిట్ల మండలాల సరిహద్దు గ్రామమైన కలుజువ్వలపాడు సమీపంలోని హైవేపై ఈ ప్రమాదం చోటు చేసుకుంది.

త్రిపురాంతకం మండలం సోమేపల్లికి చెందిన యువతికి,పొదిలి మండలంలోని అక్కచెరువుకు చెందిన యువకుడితో వివాహం నిశ్చయమైంది. బుధవారం(ఆగస్టు 25) వరుడి స్వగ్రామంలో వివాహం జరగాల్సి ఉంది. ఇందుకోసం వధువును తీసుకుని కుటుంబ సభ్యులు బుధవారం తెల్లవారుజామున సోమేపల్లి నుంచి అక్క చెరువుకు బొలెరో వాహనంలో బయలుదేరారు.

మార్గమధ్యలో బొలెరో వాహనం వెనుక డోర్ తెరుచుకుంది. దీంతో వెనుక సీట్లలో కూర్చొన్నవారు కిందపడిపోయారు. ఇందులో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందగా... మరో ఇద్దరు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. మరికొందరు తీవ్రంగా గాయపడ్డారు. మృతులను శ్రీను, అనిల్, సుబ్బారావు, కార్తీక్‌లుగా గుర్తించారు. వధువు ముందు వైపు సీట్లో కూర్చోవడంతో ఆమెకు ప్రమాదం తప్పింది.
ప్రమాదం కారణంగా ఇవాళ జరగాల్సిన పెళ్లి వాయిదా పడింది. సంఘటనా స్థలంలో వధువు కన్నీరు పెట్టిన తీరు స్థానికులను కలచివేసింది. మృతదేహాలను పోస్ట్‌మార్టం నిమిత్తం స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించినట్లు తెలుస్తోంది. ఈ ఘటనతో పెళ్లి జరగాల్సిన ఇంట తీవ్ర విషాదం నెలకొంది.

Recommended Video

    Andhra Pradesh : మాస్క్ లేకపోతే భారీ జరిమానా ! || Oneindia Telugu

    అంతకుముందు, శ్రీకాకుళం జిల్లాలోనూ ఓ బొలెరో వాహనం ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే. ప్రమాదంలో నలుగురు ఏఆర్ కానిస్టేబుళ్లు అక్కడికక్కడే మృతి చెందారు. వాహనం రోడ్ క్రాస్ చేస్తున్న సమయంలో టైర్ పేలి అదుపు తప్పగా... అటుగా వస్తున్న లారీ వేగంగా దాన్ని ఢీకొట్టింది. దీంతో బొలెరో వాహనంలో ఉన్న నలుగురు పోలీసులు ప్రాణాలు కోల్పోయారు.మందస మండలం బైరిసారంగిపురం గ్రామానికి చెందిన ఆర్మీ జవాన్ అంత్యక్రియలకు హాజరై తిరిగి వస్తున్న క్రమంలో రోడ్డు ప్రమాదం జరిగినట్లు చెబుతున్నారు.ప్రమాద ఘటనపై ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. విధినిర్వహణలో ఉన్న నలుగురు ఏఆర్ కానిస్టేబుళ్లు మృతి చెందడం అత్యంత బాధాకరమని పేర్కొన్నారు. ప్రయాణిస్తున్న కారు టైరు పేలి మృత్యువాత పడ్డారన్న విషయం దిగ్భ్రాంతికి గురిచేసిందన్నారు. మృతుల ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతున్ని ప్రార్థిస్తున్నానని పేర్కొన్నారు. మృతుల కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు. బాధిత కుటుంబాలను ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకోవాలన్నారు.

    More From
    Prev
    Next
    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+