ఫొటో: ఎటిఎం మోసగాడి ఆటకట్టు, జల్సాలకే...
హైదరాబాద్: ఎటిఎం సెంటర్ల వద్ద కాపు కాసి, వృద్ధులను లక్ష్యం చేసుకుని మోసాలకు పాల్పడుతున్న ముఠా గుట్టును హైదరాబాద్‌లోని సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు రట్టు చేశారు. ఎసిపి ప్రతాపరెడ్డి అందుకు సంబందించిన వివరాలను మీడియా ప్రతినిధులకు వెల్లడించారు.
హైదరాబాదు నగరానికి చెందిన నాగేశ్వర రావు, అతని స్నేహితుడు జయవర్ధన్ రెడ్డి ఎటిఎం సెంటర్ల వద్ద మాటు వేస్తుంటారు. అక్కడికి డబ్బు డ్రా చేసేందుకు వచ్చే వృద్ధులకు సహాయం చేస్తున్నట్లు నటించి ఎటిఎం కార్డుపై ఉన్న నెంబర్‌తో పాటు పిన్ నెంబర్‌ను దొంగచాటుగా తెలుసుకుంటారు.

ఆ తర్వాత ఇంటర్నెట్ ద్వారా కార్డుహోల్డర్ ఖాతాలో ఉన్న డబ్బును మరో ఖాతాలోకి బదిలీ చేసి డ్రా చేసుకుని జల్సాలు చేస్తారు. ఈ క్రమంలో కెపిహెచ్‌బి కాలనీకి చెందిన వైయస్ రంగారావుకు చెందిన ఆంధ్రా బ్యాంక్ ఎటిఎం కార్డు వివరాలు తెలుసుకుని డబ్బులు డ్రా చేశారు. ఇలా వివిధ వ్యక్తులకు చెందిన సుమారు 11 లక్షల రూపాయలను కాజేశారు.
రంగారావు ఫిర్యాదు మేరకు ఇన్‌స్పెక్టర్ రాజశేఖర రెడ్డి కేసు నమోదు చేసుకుని నిందితుల్లో ఒకడైన నాగేశ్వర రావును అరెస్టు చేశారు. జయవర్ధన్ రెడ్డి కోసం గాలింపు చర్యలు చేపట్టారు.












Click it and Unblock the Notifications