వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఆత్మకూరు ఉపఎన్నికకు షెడ్యూల్ విడుదల: జూన్ 23న పోలింగ్, దేశంలోని ఇతర స్థానాలకు కూడా

|
Google Oneindia TeluguNews

అమరావతి: కేంద్ర ఎన్నికల సంఘం దేశ వ్యాప్తంగా ఉపఎన్నికలకు సిద్ధమైంది.
నెల్లూరు జిల్లా ఆత్మకూరు అసెంబ్లీ స్థానంలో ఉపఎన్నికకు కేంద్ర ఎన్నికల సంఘం బుధవారం రాత్రి షెడ్యూల్ విడుదల చేసింది. మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి ఆకస్మిక మరణంతో ఖాళీ అయిన ఈ స్థానంలో జూన్ 23న పోలింగ్ జరపాలని నిర్ణయించింది.

దేశ వ్యాప్తంగా ఆరు రాష్ట్రాల్లో ఖాళీగా ఉన్న మూడు లోక్‌సభ స్థానాలు, ఏడు అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు నిర్వహించేందుకు బుధవారం రాత్రి ఈసీ షెడ్యూల్‌ను విడుదల చేసింది.

atmakur by-poll schedule released with other by elections in india

మే 30న ఉప ఎన్నికలకు గెజిట్ నోటిఫికేషన్ విడుదల
జూన్ 6న నామినేషన్లకు తుది గడువు
జూన్ 7న నామినేషన్ల పరిశీలన
జూన్ 9న నామినేషన్ల ఉపసంహరణ
జూన్ 23న పోలింగ్
జూన్ 26న ఓట్ల లెక్కింపు

దేశ వ్యాప్తంగా ఉపఎన్నికలు జరిగే లోక్ సభ, అసెంబ్లీ స్థానాలు

సంగ్రూర్(పంజాబ్), రాంపూర్, అజంగఢ్(ఉత్తరప్రదేశ్) పార్లమెంటు స్థానాలతోపాటు అగర్తలా, టౌన్ బోర్డోవలి, సుర్మా, జుబరాజ్‌నగర్(త్రిపుర), రాజిందర్ నగర్(ఢిల్లీ), మందర్(జార్ఖండ్) అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు జరగనున్నాయి.

మరోవైపు, ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, బీహార్ రాష్ట్రాల్లో త్వరలో ఖాళీ అవుతున్న 30 ఎమ్మెల్సీ స్థానాలను భర్తీచేసేందుకు ఈసీ షెడ్యూల్ ను ప్రకటించింది. జులై 6 నాటికి యూపీలో సీఎం యోగి ఆదిత్యనాథ్ తోపాటు మరో 13 మంది సభ్యుల పదవీ కాలం ముగియనుంది. మహారాష్ట్రలో జులై 7 నాటికి 10 మంది ఎమ్మెల్సీలు, బీహార్ రాష్ట్రంలో ఏడుగురికి పదవీ కాలం జులై 21తో ముగియనుంది. వీటన్నింటికీ జూన్ 20న ఎన్నికలు నిర్వహించాలని ఈసీ నిర్ణయించింది.

English summary
atmakur by-poll schedule released with other by elections in india.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X