నెల్లూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

జ్వాలాముఖి ఆలయంలో అర్ధరాత్రి మహిళ ప్రదర్శనలు: అమ్మవారేనంటూ..

|
Google Oneindia TeluguNews

నెల్లూరు: ఆత్మకూరు పట్టణంలోని అమ్మవారి ఆలయంలో దసర ఉత్సవాలు ఘనంగా ముగిశాయి. కాగా, ఐదు రోజులుగా పట్టణంలోని జ్వాలాముఖి అమ్మవారి ఆలయానికి వేసిన తాళాలు, తలుపులు వేసినట్లుగానే ఉండగా, అర్ధరాత్రి ఓ మహిళ ఆలయం ప్రాంగణంలో ప్రదక్షిణలు చేస్తున్న వీడియోలు వైరల్‌గా మారాయి.

సెల్‌ఫోన్లలో వీడియో తీశారు..

సెల్‌ఫోన్లలో వీడియో తీశారు..


ఈ విషయం స్థానికంగా కలకలంగా మారింది. దుర్గాష్టమి రోజున రాత్రి నుంచి ఇలా జరుగుతుందని పలువురు చెబుతున్నారు. ఆలయ పూజారి కృష్ణప్రసాద్ సైతం తనకు ఇలా శబ్ధాలు వినిపించాయని చెప్పడంతో కొందరు యువకులు తమ సెల్‌ఫోన్ కెమెరాల్లో ఆ దృశ్యాలను చిత్రీకరించారు.

పండగ సెలవుల నుంచి పని బాట...అంతా ఒకేసారి రాక:ఎటు చూసినా జనంతో కిటకిట...ప్రయాణ కష్టాలు పండగ సెలవుల నుంచి పని బాట...అంతా ఒకేసారి రాక:ఎటు చూసినా జనంతో కిటకిట...ప్రయాణ కష్టాలు

 పసుపు రంగు చీరలో..

పసుపు రంగు చీరలో..

పసుపురంగు వస్త్రాలు ధరించిన ఓ మహిళ ముఖం కనిపించకుండా ఆలయ ప్రాంగణంలో అర్ధరాత్రి ప్రదిక్షణలు చేస్తున్న వీడియోలు వెలుగులోకి వచ్చాయి. ఆదివారం పలు టీవీ జర్నలిస్టులు ఆలయానికి చేరుకుని భక్తుల అభిప్రాయాలను చిత్రీకరిస్తుండటం అక్కడ సందడి నెలకొంది.

 భారీ ఎత్తున భక్తులు..

భారీ ఎత్తున భక్తులు..


అమ్మవారు ప్రదిక్షణలు చేశారని వార్తలు రావడంతో భారీ ఎత్తున భక్తులు వచ్చి జ్వాలాముఖి అమ్మవారిని సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. అమ్మవారే ప్రదక్షిణలు చేశారని భక్తులు చెబుతున్నారు.

 జ్వాలాముఖి అమ్మవారినే వచ్చాను

జ్వాలాముఖి అమ్మవారినే వచ్చాను


కాగా, అమ్మవారి పూనకం వచ్చిన ఓ మహిళ.. తన భక్తుల కోసం తాను గుడిలో ప్రదిక్షణలు చేశానని, తన పిల్లలకు తాను రక్షణగా ఉంటానని చెప్పారు. గ్రామదేవతలం తమ ప్రజలను రక్షించుకోవాల్సిన బాధ్యత తమదేనని అన్నారు. ఎవరు ఏమనుకున్నా.. తమ ప్రజల కోసమే గుడిలో ప్రదక్షిణలు చేశామని చెప్పారు.

English summary
Unbelievable Incident At Jwalamukhi Temple in Atmakur, Nellore district.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X