ఏపీలో దారుణం: ప్రియుడి కోసం భర్తను చంపి, అంత్యక్రియలు చేసి... ఆపై
సమాజంలో రోజురోజుకీ పరిస్థితులు దారుణంగా తయారవుతున్నాయి. భర్తలను భార్యలు హత మారుస్తున్న ఘటనలు సభ్యసమాజం నిద్రపోయేలా చేస్తున్నాయి. ప్రియుడు కోసం భర్తలను హత మారుస్తున్న భార్యల సంఖ్య పెరిగిపోతుంది. తాజాగా అటువంటి ఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చోటుచేసుకుంది.కృష్ణాజిల్లా గన్నవరం మండలం వెంకట నరసింహ పురం లో ఓ వివాహిత భర్తను హత్య చేసి గుట్టు చప్పుడు కాకుండా అంత్యక్రియలు కూడా నిర్వహించిన ఘటన చోటు చేసుకుంది.
చక్కని సంసారంలో చిచ్చు పెట్టిన ప్రియుడు
ప్రియుడి కోసం ప్రేమించి పెళ్లి చేసుకొని 15 ఏళ్లుగా అన్యోన్యంగా కాపురం చేసిన భర్తనే హతమార్చింది. ఈ కేసు వివరాల్లోకి వెళితే 15 ఏళ్ల క్రితం లక్ష్మణ్, పావని లు పెద్దలను ఎదిరించి మరీ ప్రేమ వివాహం చేసుకున్నారు. వీరిద్దరూ వెంకట నరసింహ పురంలో అద్దెకు ఉంటూ జీవనం కొనసాగిస్తున్నారు. వీరికి ఇద్దరు ఆడపిల్లలు. చక్కగా సాగుతున్న ఈ సంసారంలో సమీప బంధువు ఒకడు చిచ్చు పెట్టాడు.

మృతి చెందిన భర్త, అంత్యక్రియలు
ప్రదీప్ అనే సమీప బంధువు పావని తో పరిచయాన్ని పెంచుకున్నాడు. అది కాస్త వివాహేతర సంబంధంగా మారింది. ఈ క్రమంలో లక్ష్మణ్ కు అనుమానం వచ్చి పావని ని ప్రశ్నించగా ఇద్దరి మధ్య గొడవలు జరుగుతున్నాయి.ఏం జరిగిందో తెలియదు కానీ ఈనెల 13వ తేదీన నరసింహపురం లో లక్ష్మణ్ మరణించాడు. భార్య పావని తనకేమీ తెలియనట్లు భర్త అంత్యక్రియలను హడావుడిగా చింతకుంట గ్రామంలో జరిపించింది.
భార్యపై మృతుని బంధువుల అనుమానం
అయితే లక్ష్మణ్ తరపు బంధువులకు పావని వ్యవహార శైలి పైన అనుమానం రావడంతో, వారు ఆరా తీశారు. దీంతో పావనికి ప్రదీప్ కి మధ్య ఉన్న వివాహేతర సంబంధం బయటకు వచ్చింది. ఈ క్రమంలో అనుమానంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు.దీంతో పావని తాను తన ప్రియుడు ప్రదీప్ తో కలిసి భర్తను హతమార్చినట్టు ఒప్పుకుంది.
భర్తను, ప్రియుడితో కలిసి హతమార్చిన భార్య
ఈ ఘటన పైన లక్ష్మణ్ కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు గన్నవరం పోలీసులు కేసు నమోదుచేసి పావనిని అదుపులోకి తీసుకున్నారు. ఇరువురిని అరెస్ట్ చేసి ఇక ఈ కేసులో మృతదేహాన్ని బయటకు తీయడానికి నిర్ణయించారు. పోస్టుమార్టం నిర్వహించడానికి మృతదేహాన్ని వెలికి తీస్తామని పోలీసులు పేర్కొన్నారు. ఏదిఏమైనా వివాహేతర సంబంధం కోసం కట్టుకున్న వాడిని కడతేర్చింది.












Click it and Unblock the Notifications