నారా లోకేష్‌పై దాడి: ఇరువైపులా కేసులు (పిక్చర్స్)

మహబూబ్‌నగర్: మహబూబ్‌నగర్ జిల్లా పెబ్బేరు మండల కేంద్రంలో ఎన్నికల ప్రచారంలో భాగంగా తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు తనయుడు నారా లోకేష్ ఆదివారం సాయంత్రం రోడ్‌షో జరుగుతున్న క్రమంలో ఆయన కాన్వాయ్‌పై తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) నాయకులు నాయకులు దాడికి దిగిన సంఘటనలో ఇరువైపులా కేసులు నమోదయ్యాయి. దాడి ఘటనలో విధులు నిర్వహిస్తున్న హెడ్‌కానిస్టేబుల్ సాగర్‌కు స్వల్ప గాయాలయ్యాయి. ఆయన ఫిర్యాదు మేరకు పెద్ద ఎల్లారెడ్డి, వార్డు సభ్యులు శివసాయిపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై మహేశ్వర్‌రావు తెలిపారు.

కారుకు నిప్పంటించిన సంఘటనలో మండల కేంద్రానికి చెందిన టిఆర్‌ఎస్ నాయకుడు ఫిర్యాదు మేరకు వనపర్తికి చెందిన గొల్ల వెంకటయ్య, చిన్నరాములు, కాటమోని బుచ్చన్న, సహదేవుడు, మేకల కర్రెస్వామి, గొల్ల ఎల్లయ్య, గుడిసె ఎల్ల శ్రీను, గుడిసె పెద్ద రాములు, వనం రాములు, మాలపల్లి రామన్‌గౌడ్, రాంపురం గోపాల్, ఎం.రాజశేఖర్, మేకల వెంకటయ్య, రామకృష్ణ, తిరుపతయ్య, పొద్దుపల్లి ఎల్ల స్వామిలపై 5 సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు ఆయన తెలిపారు.

బిజెపికి చెందిన సబ్బిరెడ్డి వెంకట్‌రెడ్డి కారును ధ్వంసం చేసిన సంఘటనలో సాయిబాబ పిర్యాదు మేరకు టిఆర్‌ఎస్ నాయకులు కోదండరామిరెడ్డి, హర్షవర్థన్‌రెడ్డి, భీరం రాజశేఖర్‌రెడ్డి, రంగస్వామి, గాలం పరంధాములు, చిన్న ఎల్లారెడ్డిలపై కేసు నమోదు చేశామన్నారు. ఇరు పార్టీలకు చెందిన 12మందిని రిమాండ్‌కు తరళించినట్లు తెలిపారు. మిగతా వారిని కూడా త్వరలో అరెస్టు చేసి రిమాండ్‌కు పంపుతామన్నారు.

పెబ్బేర్‌లో రోడ్ షో నిర్వహిస్తున్న లోకేష్

పెబ్బేర్‌లో రోడ్ షో నిర్వహిస్తున్న లోకేష్

తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడి తనయుడు నారా లోకేష్ మహబూబ్‌నగర్ జిల్లా పెబ్బేర్ మండల కేంద్రానికి వచ్చినప్పటి దృశ్యం

దాడికి తెరాస యత్నం..

దాడికి తెరాస యత్నం..

నారా లోకేష్‌పై తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) కార్యకర్తలు మద్యం బాటిళ్లతో, ఇతర సాధనాలతో దాడికి ప్రయత్నించారు.

కారులో బీరు బాటిళ్లు..

కారులో బీరు బాటిళ్లు..

తెరాస నాయకుడి కారులో బీరు బాటిళ్లు ఉన్నాయనే ఆరోపణలు వచ్చాయి. ఆ కారులో బీరు బాటిళ్లను చూడవచ్చు.

తెరాస నేత కారు ధ్వంసం

తెరాస నేత కారు ధ్వంసం

నారా లోకేష్‌పై దాడికి ఆగ్రహించిన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు తెరాస నేత కారును ధ్వంసం చేసి, దానికి నిప్పంటించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+