జగన్‌పార్టీ నేతపై బాంబులతో దాడి, మరోచోట ప్రేమోన్మాది

Attack on YSR Congress Party leader
కడప/హైదరాబాద్/అదిలాబాద్: కడప జిల్లాలో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకుడు సుధాకర్ రెడ్డిపై ఈ తెల్లవారుజామున బాంబులతో దాడి జరిగినట్లుగా తెలుస్తోంది. లింగాల మండలం గునకలపల్లిలో ఆయన ప్రత్యర్థులు దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో ఆయన ప్రాణాలతో తృటిలో తప్పించుకోగా, మరో ఇద్దరు మాత్రం గాయపడ్డారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.

ప్రేమించలేదని పొడిచాడు

తనను ప్రేమించలేదని ఓ ప్రేమోన్మాది ఓ విద్యార్థిని కత్తితో పొడిచి చంపాడు. అదిలాబాద్ జిల్లా జైపూర్ మండలం కాన్కూరులో అనూష తొమ్మిదో తరగతి చదువుతోంది. ఈమెపై అదే గ్రామానికి చెందిన రవి అనే విద్యార్థి కత్తితో దాడి చేశాడు. ఆమెను ఆసుపత్రికి తరలిస్తుండగా మృతి చెందింది.

అనూష పైన మంగళవారం రాత్రి దాడి జరిగింది. రెండు నెలల నుండి తనను ప్రేమించాలంటూ రవి ఆమెను వేధిస్తున్నాడు. విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు హెచ్చరించారు. దీంతో రవి మంగళవారం రాత్రి ఈ దారుణానికి పాల్పడ్డాడు.

అనుమానాస్పద మృతి

పంజాగుట్టలో ఓ యువకుడు అనుమానాస్పదంగా మృతి చెందాడు. గుంటూరు జిల్లాకు చెందిన మహేష్ బిటెక్ పూర్తి చేసి పంజాగుట్టలోని ఓ ప్రయివేటు సంస్థలో ఉద్యోగం చేస్తున్నాడు. దగ్గర్లోని ఓ హాస్టల్లో నివాసం ఉంటున్న మహేష్ మంగళవారం విధులు నిర్వహించాల్సి ఉంది. హాస్టల్ వద్ద జీవచ్చవంలా పడి ఉండటంతో సిబ్బంది పోలీసులకు సమాచారం అందించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+