వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

year ender 2020 : ఏపీలో ప్రభుత్వాన్ని అప్రదిష్ట పాలు చేసిన ముఖ్యమైన ఘటనలు ,ఆలయాలపై దాడులు, విగ్రహ విధ్వంసాలు

|
Google Oneindia TeluguNews

2020 వ సంవత్సరంలో ఏపీ ప్రభుత్వాన్ని అత్యధికంగా అప్రదిష్ట పాలు చేశాయి ఆలయాలపై దాడులు, విగ్రహ విధ్వంస ఘటనలు. జగన్మోహన్ రెడ్డి సీఎంగా బాధ్యతలు చేపట్టిన నాటి నుండి హిందూ వ్యతిరేక ప్రభుత్వమని ప్రచారం జరుగుతూనే ఉంది. జగన్మోహన్ రెడ్డిపై మతపరమైన విమర్శలు అనేకం చోటు చేసుకున్నాయి. ఈ క్రమంలో అంతర్వేదిలో రథం దగ్ధం ఘటనతో మొదలైన ఆలయాలపై దాడులు, విగ్రహ విధ్వంసం ఘటనల పరంపర నేటికీ కొనసాగుతూనే ఉంది.

2020లో ఏపీలో విషం చిమ్మిన విషాదం , భయానక దృశ్యం .. విశాఖ ఎల్జీ పాలిమర్స్ గ్యాస్ లీక్ దుర్ఘటన2020లో ఏపీలో విషం చిమ్మిన విషాదం , భయానక దృశ్యం .. విశాఖ ఎల్జీ పాలిమర్స్ గ్యాస్ లీక్ దుర్ఘటన

తూర్పుగోదావరి జిల్లా అంతర్వేది లో రథం దగ్ధం ఘటన

తూర్పుగోదావరి జిల్లా అంతర్వేది లో రథం దగ్ధం ఘటన


2020 వ సంవత్సరంలో ఏపీ ప్రభుత్వానికి తలనొప్పిగా, వైయస్ జగన్మోహన్ రెడ్డికి అత్యంత ఇబ్బందికరంగా ఆలయాలపై దాడులు, విగ్రహాల విధ్వంసాల ఘటనలు రాష్ట్రంలో పెను దుమారం రేపాయి. ప్రతిపక్షాల విమర్శలకు కారణమయ్యాయి. పెద్ద ఎత్తున ఉద్రిక్తతలకు వేదికగా మారాయి.తూర్పుగోదావరి జిల్లా అంతర్వేది లో లక్ష్మీ నరసింహ స్వామి వారి కళ్యాణోత్సవ రధం దగ్ధం ఘటన హిందూ సమాజంలోనూ, ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలోనూ పెను దుమారం రేపింది.

ఛలో అంతర్వేది అంటూ ప్రతిపక్షాల ఆందోళన .. కేసు విచారణ సీబీఐకి అప్పగించిన జగన్

ఛలో అంతర్వేది అంటూ ప్రతిపక్షాల ఆందోళన .. కేసు విచారణ సీబీఐకి అప్పగించిన జగన్

అంతర్వేది స్వామి వారి రథం దగ్ధం ఘటన నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం తక్షణ విచారణకు ఆదేశించినా ప్రతిపక్ష పార్టీలు మాత్రం చలో అంతర్వేది అంటూ నిరసనలకు దిగి ఉద్రిక్త పరిస్థితులకు కారణమయ్యాయి. ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి వల్లే హిందూ దేవాలయాలపై దాడులు జరుగుతున్నాయని పెద్ద ఎత్తున విమర్శలు రావడంతో పాటుగా, రథం దగ్ధం సంఘటనపై సీబీఐ విచారణకు ఆదేశించాలని ప్రతిపక్ష పార్టీలు డిమాండ్ చేశాయి. దీంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అంతర్వేది రథం దగ్ధం ఘటనపై సిబిఐ విచారణకు ఆదేశించింది.

కనకదుర్గ అమ్మవారి వెండి రథం .. మూడు సింహాలు మాయం ఘటన

కనకదుర్గ అమ్మవారి వెండి రథం .. మూడు సింహాలు మాయం ఘటన

అంతర్వేది రథ సంఘటనపై ఆగ్రహజ్వాలలు చల్లారక ముందే విజయవాడ కనకదుర్గ అమ్మవారి ఆలయంలో అమ్మవారి వెండి రథంలో మూడు సింహాలు మాయమైన సంఘటన వెలుగు చూసింది. అంతర్వేది రథ సంఘటనపై ఆగ్రహజ్వాలలు చల్లారక ముందే విజయవాడ కనకదుర్గ అమ్మవారి ఆలయంలో అమ్మవారి వెండి రథంలో పదిహేను లక్షల రూపాయల విలువచేసే మూడు వెండి సింహాలు మాయమయ్యాయి. ఇది హిందువుల మనోభావాలను మరోమారు గాయపరిచిన ఘటన .

మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ బర్తరఫ్ కు డిమాండ్

మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ బర్తరఫ్ కు డిమాండ్


ఈ ఘటన నేపథ్యంలో అమ్మవారి వెండి రధాన్ని పరిశీలించిన ప్రతిపక్ష పార్టీలు భగ్గుమన్నాయి. దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ ను బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశాయి. ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల ఇటువంటి ఘటనలు పెరిగిపోతున్నాయని మండిపడ్డాయి. ఈ ఘటన ఏపీ సర్కార్ ను అత్యంత ఇరకాటంలో పెట్టింది. నేటికీ దీనిపై విచారణ కొనసాగుతోంది. విజయవాడలోని దుర్గ గుడి వెండి రథంలోని మూడు సింహాల మాయం ఘటన తర్వాత ఆలయాలపై దాడులు , విగ్రహ ధ్వంసాల ఘటనలు ప్రజలను టెన్షన్ పెట్టిస్తున్నాయి . ప్రతిపక్ష పార్టీలకు , హిందూ సంఘాలకు ఆగ్రహం తెప్పిస్తున్నాయి.

రాష్ట్రంలో వరుస ఆలయాలపై దాడులు , విగ్రహ ధ్వంసాల ఘటనలు

రాష్ట్రంలో వరుస ఆలయాలపై దాడులు , విగ్రహ ధ్వంసాల ఘటనలు

ఆ తర్వాత వరుసగా నిడమానూరులో సాయిబాబా ఆలయంలో సాయిబాబా విగ్రహాన్ని ధ్వంసం చేశారు గుర్తుతెలియని ఆగంతకులు.ఏలేశ్వరం మండలంలోని శివాలయం దగ్గర్లో గల శ్రీ సీతారామాంజనేయ వ్యాయామ కళాశాల వద్ద ఉన్న ఆంజనేయస్వామి విగ్రహాన్ని గుర్తుతెలియని దుండగులు విరగ్గొట్టారు. కర్నూలు జిల్లాలో పత్తికొండ మార్కెట్ యార్డ్ సమీపాన ఉన్న ఆంజనేయ స్వామి దేవాలయంలో విగ్రహాన్ని కొందరు దుండగులు ధ్వంసం చేశారు. విగ్రహం ఉన్న ప్రదేశం నుంచి దాన్ని తొలగించి రోడ్డుపై పడేసి వెళ్లిపోయారు.

నేటికీ ఆగని ఘటనలు .. రెండు రోజుల క్రితం పొన్నెకల్లు ఆంజనేయస్వామి విగ్రహాన్ని పెకలించిన ఘటన

నేటికీ ఆగని ఘటనలు .. రెండు రోజుల క్రితం పొన్నెకల్లు ఆంజనేయస్వామి విగ్రహాన్ని పెకలించిన ఘటన

చిత్తూరు జిల్లాలోని గంగాధర్ నెల్లూరు మండలం అగర మంగలంలో ఉన్న ఈశ్వర ఆలయంలో నంది విగ్రహాన్ని దుండగులు ధ్వంసం చేశారు . రాత్రి సమయంలో గుర్తుతెలియని వ్యక్తులు నంది విగ్రహాన్ని ధ్వంసం చేశారు. పశ్చిమగోదావరి జిల్లా ఉండ్రాజవరం మండలం సుర్యరావుపాలెం లో అమ్మవారి ఆలయ ముఖద్వారాన్ని దుండగులు కూల్చివేశారు. ఇదే సమయంలో నెల్లూరు జిల్లా బోగోలు మండలం కొండ బిట్రగుంట లో ప్రసన్న వెంకటేశ్వర స్వామి ఆలయ రథానికి నిప్పు పెట్టారు ఆగంతకులు. దీంతో రథం దగ్ధమైంది. తాజాగా కర్నూలు జిల్లా పొన్నెకల్లు ఆంజనేయస్వామి విగ్రహాన్ని పెకలించి వేయడంపై ప్రతిపక్ష పార్టీలు నిప్పులు చెరుగుతున్నాయి.

అధికార పార్టీకి కంటి మీద కునుకు లేకుండా .. అప్రదిష్ట పాలు చేసిన ఘటనలు

అధికార పార్టీకి కంటి మీద కునుకు లేకుండా .. అప్రదిష్ట పాలు చేసిన ఘటనలు

అంతర్వేది రథం దగ్ధం ఘటనతో మొదలైన ఆలయాలపై దాడులు, విగ్రహాల విధ్వంసాలు నేటికీ కొనసాగుతున్నాయి . ఒకపక్క రాజధాని సమస్య, మరోపక్క కరోనా కారణంగా కొనసాగుతున్న కల్లోలం, ఇంకోపక్క ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న ఏపీలో తాజాగా మత ఘర్షణలకు కారణం అయ్యేలా ఆలయాలపై దాడులు అధికార పార్టీకి కంటి మీద కునుకు లేకుండా చేశాయి. రాష్ట్రంలో శాంతి భద్రతల పరిరక్షణ కోసం ఎంతగా ప్రయత్నం చేస్తున్నా, ఆలయాలపై జరుగుతున్న దాడులు ప్రశ్నార్థకంగా మారాయి.

ఆలయాల రక్షణకు ఆదేశించిన సీఎం జగన్ .. 2020లో ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టిన కీలక ఘటనలు ఇవే

ఆలయాల రక్షణకు ఆదేశించిన సీఎం జగన్ .. 2020లో ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టిన కీలక ఘటనలు ఇవే

ప్రతిపక్షాల , హిందూ సంఘాల ఆందోళనలతో ఆలయాల పటిష్ట రక్షణకు సీఎం జగన్ ఆదేశించారు. హిందూ ఆలయాలలో ఉండే రథాలపై మరింత నిఘా పెంచాలని ఆదేశించిన ప్రభుత్వం సీసీ కెమెరాలను ఏర్పాటు చేయాలని పేర్కొంది. అంతేకాదు రక్షణ సిబ్బందిని కూడా నియమించాలని, అతిపురాతనమైన రథాలకు సంబంధించి ఇన్సూరెన్స్ లు కూడా చేయాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఏది ఏమైనా 2020లో ఏపీ సర్కార్ ను తీవ్రంగా ఇబ్బంది పెట్టిన సంఘటనల్లో ఆలయాలపై దాడులు , విగ్రహ ధ్వంసాలు ముందు వరుసలో ఉంటాయి.

English summary
Attacks on temples and vandalism of idols have been the biggest misfortune for the AP government in 2020. There is a campaign in AP Jaganmohan Reddy has been took over as CM for an anti-Hindu government . There has been a lot of religious criticism of Jaganmohan Reddy. The series of attacks on temples and destruction of idols, which began with the Antarvedi chariot burnt incident , continues to this day.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X