ఏపీ ఎగ్జిట్ పోల్స్ సిద్దం - ఫలితం ఏకపక్షం..!!
AP Exit Poll 2024: ఏపీలో అధికారం దక్కేదెవరికి. హోరా హోరీగా సాగిన ఎన్నికల్లో ఫలితం పైన ఉత్కంఠ పెరుగుతోంది. ఇప్పటికే జగన్ 2019 కంటే ఎక్కువ సీట్లు గెలుస్తామని ధీమా వ్యక్తం చేసారు. చంద్రబాబు తమదే అధికారం అంటూ విశ్వాసంతో ఉన్నారు. కూటమి, వైసీపీలో గెలుపు పై ధీమా కనిపిస్తున్నా..లోలోపల మాత్రం ఆందోళన కొనసాగుతోంది. ఈ సమయంలోనే ఎగ్జిట్ పోల్స్ ఓటరు తమ అంచనాలతో ముందుకు వచ్చాయి. ప్రజా మద్దతు ఎవరితో తేల్చేసాయి. అధికారికంగా వెల్లడించేందుకు సిద్దమయ్యాయి.
హోరా హోరీ పోరు
ఏపీ ఎన్నికల్లో టీడీపీ కూటమి, వైసీపీ మధ్య హోరా హోరీ పోరు సాగింది. పోలింగ్ సరళి పైన రెండు వైపులా క్షేత్ర స్థాయి నుంచి పూర్తి స్థాయి లో సమీక్షజరిగింది. తమకు దక్కే సీట్ల పైన జగన్, చంద్రబాబు పూర్తి క్లారిటీతో ఉన్నారు. పార్టీల అధ్యక్షులుగా ఏం చెప్పాలో పార్టీ నేతలతో అదే చెబుతున్నారు. కానీ, వాస్తవం ఏంటనేది ఇద్దరికీ స్పష్టత ఉంది.

సీఎం జగన్, టీడీపీ అధినేత చంద్రబాబు పోలింగ్ జరిగిన నాడే కొన్ని ప్రముఖ సర్వే సంస్థలతో ఎగ్జిట్ పోల్స్ చేయించారు. ఓటింగ్ సరళి పైన ఒక స్పష్టత కు వచ్చారు. పలు సంస్థలు ఇచ్చిన నివేదికలను క్రోడీకరించి పూర్తి స్పష్టత తెచ్చుకున్నారు. అయితే..ఈ సారి ఏపీలో ఎగ్జిట్ పోల్స్ సర్వే సంస్థల సమర్థతకు పరీక్షగా నిలుస్తున్నాయి.
సర్వే సంస్థలు తేల్చేసాయి
తెలుగు రాష్ట్రాలు కేంద్రంగా పని చేసే ఎనిమిది ప్రధాన సర్వే సంస్థలు ఫలితం పైన ఇప్పటికే ఒక అంచనాకు వచ్చాయి. ఓటరు పల్స్ తెలుసకోవటం కష్టంగా మారిందని సర్వే సంస్థల ప్రతినిధుల సమాచారం. అయితే, ప్రతీ ఎన్నికల్లో వాస్తవ లెక్కలు అందించే సంస్థలుగా గుర్తింపు పొందిన ప్రముఖమైన రెండు సంస్థలు మాత్రం ఏపీలో వార్ ఒన సైడ్ గానే జరిగిందని నిర్దారణకు వచ్చినట్లు విశ్వసనీయ సమాచారం.
పోలింగ్ జగన్ ఐప్యాక్ సంస్థ సమావేశంలో తమకు 2019 కంటే ఎక్కువ సీట్లు వస్తాయంటూ ధీమా వ్యక్తం చేసారు.జగన్ కు ఐప్యాక్ తో పాటుగా నిఘా, తమ సొంత మీడియా సంస్థ, మరో మూడు సర్వే ఏజెన్సీల నివేదికల ఆధారంగా పోలింగ్ కేంద్రాల నుంచి తెప్పించుకున్న లెక్కల పైన పూర్తిగా కసరత్తు చేసిన తరువాతనే జగన్ ఈ ప్రకటన చేసారని పార్టీ నేతలు చెబుతున్నారు.
ఫలితం ఏకపక్షం
అదే సమయంలో టీడీపీ నుంచి గెలుపు ఖాయమని చెబుతున్నా..తమ పార్టీ ఎన్ని సీట్లు గెలుస్తుందనేది ఆ పార్టీ ముఖ్యులు చెప్పటం లేదు. అయితే, మహిళా ఓట్ బ్యాంక్...పెరిగిన రెండు శాతం ఓటింగ్ లో ఎక్కువగా గ్రామీణ స్థాయిలో పెరుగుదుల కనిపిస్తుండటంతో వైసీపీ నేతల్లో ధీమా కనిపిస్తోంది.అదే సమయంలో ప్రభుత్వం పైన ఉన్న వ్యతిరేకత..పలు వర్గాల్లో ఉన్నఆగ్రహం పూర్తిగా తమకు అనుకూల ఓటుగా మారిందనేది టీడీపీ అంచనా.
కొన్ని సంస్థలు తమ విశ్వసనీయతను కాపాడుకొనేందుకు హోరా హోరీ పోరుగా ఎగ్జిట్ పోల్స్ ఇచ్చేందుకు సిద్దం అవుతున్నాయి. దీంతో..పార్టీల ముఖ్యులకు ఎన్నికల ఫలితం పై స్పస్టత వచ్చినా..అసలు ఫలితం ముందు వచ్చే ఎగ్జిట్ పోల్స్ పైన సామాన్యుల్లో మరింత ఉత్కంఠ పెరుగుతోంది.












Click it and Unblock the Notifications