కలకలం: కోడలు తల నరికి పోలీస్ స్టేషన్ తీసుకెళ్లిన అత్త

చిత్తూరు: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అన్నమయ్య జిల్లాలో దారుణ ఘటన చోటు చేసుకుంది. కుటుంబ కలహాల కారణంగా కోడలి తలను అత్త నరికి చంపింది. అంతేగాక, తలను పట్టుకుని ఏకంగా పోలీస్ స్టేషన్ కు తీసుకెళ్లింది. స్థానికంగా ఈ ఘటన కలకలం రేపింది.

అన్నమయ్య జిల్లాలోని కే రామాపురంలో ఉండే సుబ్బమ్మ.. తన కోడలు వసుంధర తల నరికి నేరుగా పోలీస్ స్టేషన్ కు వెళ్లి లొంగిపోయింది. వసుంధరను.. పక్కా పథకం ప్రకారం సుబ్బమ్మ తన ఇంటికి భోజనానికి పిలిచింది.

Aunty brutally killed her daughter-in-law in annamayya district

అప్పటికే ఇంట్లో మాటువేసి ఉన్న కొందరితో కలిసి.. దారుణంగా తల నరికేశారు. అనంతరం తలను పట్టుకుని సుబ్బమ్మ అరకిలోమీటరు దూరంలోని పోలీస్ స్టేషన్ కు వెళ్లింది. దీంతో పోలీసులు కూడా నివ్వెరపోయారు.

Recommended Video

    పోలీస్ సిబ్బందికి ఇస్తున్న ఆహారం కుక్కలు కూడా తినవు *News | Telugu OneIndia

    ఈ దృశ్యాన్ని చూసి ప్రజలు భయభ్రాంతులకు గురయ్యారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఘటనా స్థలికి వెళ్లి పరిశీలించారు. వివాహేతర సంబంధం, ఆస్తి తగాదాలే హత్యకు కారణమై ఉంటాయని అనుమానిస్తున్నారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+