ఏపీలో ఎల్లుండి నుంచి ఆటోలు, సిటీ బస్సులూ 12 వరకే- ఆ తర్వాత తిరిగితే సీజ్‌

ఏపీలో కరోనా కేసుల విజృంభణ దృష్ట్యా రాకపోకల నియంత్రణకు ఎల్లుండి నుంచి పాక్షిక కర్ఫ్యూ అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగా ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకే షాపులు తెరిచేందుకు అనుమతిస్తామని ఇవాళ ప్రకటించింది. దీంతో పాటు ప్రజా రవాణాపైనా ఆంక్షలు విధించనున్నారు.

Recommended Video

    AP Govt Announces Night Curfew From Tomorrow, Free Vaccine To Above 18-45 Years

    ఏపీలో కరోనా కేసుల కల్లోలం దృష్ట్యా ఎల్లుండి నుంచి ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకే ప్రజా రవాణాను కూడా అనుమతించాలని ప్రభుత్వం నిర్ణయించింది. మధ్యాహ్నం 12 గంటల తర్వాత రోడ్లపైకి వచ్చే ఆటోలను సీజ్‌ చేయాలని ఆదేశాలు ఇచ్చారు. వీటితో పాటు సిటీ బస్సుల రాకపోకలను కూడా నియంత్రించేందుకు వీలుగా అధికారులకు ఆదేశాలు వెళ్లాయి. నిర్ణీత సమయాలను మించి రాకపోకల్ని నియంత్రించడం ద్వారా కరోనా వ్యాప్తికి అడ్డుకట్ట వేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.

    autos, city buses in ap will run upto 12pm only from april 5 amid partial day curfew

    మద్యాహ్నం 12 గంటల తర్వాత అత్యవసర సేవల వాహనాలను మాత్రమే రోడ్లపైకి అనుమతించనున్నారు. ఉదయం షాపులు తెరిచే సమయంలోనే ప్రజా రవాణాకు కూడా అనుమతించాలని నిర్ణయించిన ప్రభుత్వం.. ఆ సమయంలోనూ 144 సెక్షన్‌ అమలు చేయబోతోంది. అంటే గుంపులు గుంపులుగా షాపింగ్‌లు చేయడం, ప్రయాణాలు చేయడాన్ని నిషేధిస్తున్నారు. ఎల్లుండి నుంచి మొదలయ్యే ఈ ఆంక్షలు రెండు వారాల పాటు కొనసాగుతాయని ప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది.

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+