Avakai 2026: ఆవకాయ్ అమరావతి ఫెస్టివల్..! ఫ్రీ పాస్ లు ఇలా ..!

ఏపీలో ఈసారి సంక్రాంతి పండుగ సందర్భంగా విజయవాడ ప్రత్యేకతల్ని స్థానికులతో పాటు ఇతర ప్రాంతాల వారికి తెలియజెప్పేందుకు వీలుగా ప్రభుత్వం ఆవకాయ్ అమరావతి ఫెస్టివల్ నిర్వహిస్తోంది. రాష్ట్ర పర్యాటక శాఖ ఈ వేడుకల్ని నిర్వహించబోతోంది. ఇందులో భాగంగా పలు ఈవెంట్లు, సాంస్కృతిక కార్యక్రమాలు, పోటీలు ఉంటాయి. అయితే ఇందులో పాల్గొనాలనుకునే వారి కోసం ఓ వెబ్ సైట్ ను ప్రారంభించారు. ఇందులో నమోదు చేసుకున్న వారికి ఫ్రీ పాస్ లు ఇవ్వనున్నారు.

ఆవకాయ్ అమరావతి ఫెస్టివల్ పాస్ ల కోసం రిజిస్ట్రేషన్ చేసుకునేందుకు వీలుగా ప్రభుత్వం ప్రత్యేక వెబ్ సైట్ https://avakaifestival.com/ పేరుతో ప్రారంభించారు. ఇందులోకి వెళ్లి రిజిస్టేషన్ బటన్ నొక్కితే హైపర్ లింక్ ద్వారా పాస్ ల వెబ్ సైట్ ఓపెన్ అవుతుంది. అక్కడ ఈ నెల 8వ తేదీ నుంచి 10వ తేదీ వరకూ జరిగే ఈవెంట్లు, వాటి పాస్ లు, వాటిని ఎలా రిజిస్ట్రేషషన్ చేసుకుని తీసుకోవాలన్న వివరాలు కనిపిస్తాయి.

Avakai 2026 Amaravati Festival How to Get Your Free pass

ఆవకాయ్ అమరావతి ఫెస్టివల్ ఈవెంట్లను విజయవాడలోని పున్నమిఘాట్ తో పాటు భవానీ ఐల్యాండ్ లలో నిర్వహిస్తారు. ఈ నెల 8వ తేదీన సాయంత్రం 4 గంటల నుంచి 11 గంటల వరకూ పున్నమి ఘాట్ లో ఈవెంట్లు ఉంటాయి. అలాగే 9వ తేదీన ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3.30 వరకూ భవానీ ఐలాండ్ లో, సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు పున్నమి ఘాట్ లో ఈవెంట్స్ ఉంటాయి. 10వ తేదీ కూడా సేమ్ ఉదయం ఈవెంట్స్ భవానీ ఐల్యాండ్ లో, సాయంత్రం ఈవెంట్స్ పున్నమి ఘాట్ లో నిర్వహిస్తారు. వెబ్ సైట్ లో పూర్తి వివరాలు అందుబాటులో ఉంచారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+