ఎట్టకేలకు డిజిపి ఆఫీసులో లొంగిపోయిన అవినాష్
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సిఎం, హోంమంత్రి చినరాజప్ప బంధువునంటూ.. దక్షిణ భారతదేశపు మానవ హక్కుల అధ్యక్షుడినంటూ పలువురిని మోసం చేసిన అవినాష్ ఎట్టకేలకు గురువారం పోలీసుల ఎదుట లొంగిపోయాడు. గురువారం హైదరాబాద్‌లోని ఆంధ్రప్రదేశ్ డిజిపి కార్యాలయానికి వచ్చిన అవినాష్.. ఉన్నతాధికారులు ఎదుట లొంగిపోయాడు.
ఏపి హోంమంత్రి బంధువునంటూ పలువురిని మోసం చేయడమే కాకుండా, అతడ్ని నిలదీసిన బాధితులపై దాడికి పాల్పడ్డాడు. అంతేగాక, వారిని చిత్రహింసలకు గురి చేశాడు. బాధితుల ఫిర్యాదు మేరకు తూర్పుగోదావరి జిల్లా పోలీసులు అవినాష్ పై మంగళవారం కేసు నమోదు చేశారు.

పరారీలో ఉండటంతో అతడి కోసం గాలింపు బృందాలు పలు ప్రాంతాల్లో తనిఖీ చేపట్టాయి. ఈ క్రమంలో గురువారం అవినాష్ నగరంలోని ఏపి డిజిపి కార్యాలయానికి నేరుగా వచ్చి లొంగిపోయాడు.
ఇది ఇలా ఉండగా, మానవ హక్కుల ప్రతినిధినంటూ ప్రచారం చేసుకుని మోసం చేసిన కారణంగా మానవ హక్కుల కమిషన్ కూడా అతడి మోసాలను సుమోటోగా కేసుగా స్వీకరించింది. ఇందుకు వివిధ వార్తా పత్రికల్లో వచ్చిన కథనాలను ఆధారంగా తీసుకుంది. జిల్లా ఎస్పీ, కలెక్టర్లకు మానవ హక్కుల సంఘం నోటీసులు కూడా జారీ చేసింది. ఏప్రిల్ 6లోగా అవినాష్ ఆగడాలపై నివేదిక అందించాలని ఆదేంశించింది.












Click it and Unblock the Notifications