అయోధ్య రామమందిర ప్రారంభోత్సవం: లక్నోకు చేరుకున్న పవన్ కళ్యాణ్

లక్నో: అయోధ్య రామ మందిర ప్రారంభోత్సవ వేడుకలో పాల్గొనేందుకు ప్రముఖ నటుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆదివారం ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని లక్నోకు చేరుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 500 ఏళ్ల తర్వాత దేశ ప్రజల సుదీర్ఘకల సాకారం అవుతోందని అన్నారు.

రామ్‌లల్లా ప్రతిష్టాపన కార్యక్రమంలో భాగస్వామినయ్యే అవకాశం లభించడం ఆనందంగా ఉందన్నారు పవన్ కళ్యాణ్. కాగా, సోమవారం తెల్లవారుజామున లక్నో నుంచి అయోధ్యకు బయల్దేరి వెళ్లనున్నారు పవన్ కళ్యాణ్. అయోధ్య రామ మందిర ప్రారంభోత్సవానికి తెలుగు రాష్ట్రాలకు చెందిన పలువురు రాజకీయ, సినీ, ఇతర రంగాల ప్రముఖులకు ఆహ్వానాలు అందిన విషయం తెలిసిందే.

Ayodhya Ram mandir inauguration: pawan kalyan reached lucknow

అయోధ్య రామ మందిరంలో బాల రాముడి విగ్రహ ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం సోమవారం ఉదయం ప్రధాని నరేంద్ర మోడీ చేతుల మీదుగా జరగనుంది. తొలుత రాముడి విగ్రహానికి ఉన్న కళ్లకు గంతలు విప్పి ప్రధాని మోడీ దర్శనం చేసుకోనున్నారు. అనంతరం హారతి ఇవ్వనున్నారు. అయితే, ప్రాణప్రతిష్ట రోజున సామాన్య భక్తులకు ఆలయంలోకి అనుమతి లేదు. జనవరి 23 నుంచి ప్రజలందరికీ బాల రాముడి దర్శన భాగ్యం కల్పించనున్నారు.

కాగా, అయోధ్య రామ మందిర ప్రారంభోత్స వేడుకకు దేశంలోని సుమారు 4 వేలకుపైగా వివిధ రంగాల ప్రముఖులు, స్వామిజీలు, ఆధ్యాత్మిక వేత్తలకు రామ మందిర ట్రస్ట్, వీహెచ్‌పీ ఆహ్వానాలు పంపాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వ పాలకులు, వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు అయోధ్యకు చేరుకుంటున్నారు. వేలాది మంది భక్తులు కూడా అక్కడికి చేరుకుంటున్నారు. ఇప్పటికే అయోధ్య రామ మందిర ప్రారంభోత్సవం కోసం అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. దీపాలంకరణలతో దేదీప్యమానంగా వెలిగిపోతోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+