గంటకోటి: బాబు ముందే అయ్యన్న షాక్, అలిగిన గంటా
విశాఖపట్నం: తెలుగుదేశం పార్టీలో చేరిన సందర్భంగా మాజీ మంత్రి గంటా శ్రీనివాస రావుకు ఆ పార్టీ సీనియర్ నేత అయ్యన్నపాత్రుడు బుధవారం ఝలక్ ఇచ్చారు. విశాఖలో ఏర్పాటు చేసిన ప్రజాగర్జనలో గంటా టిడిపిలో చేరారు. ఈ సందర్భంగా అయ్యన్న పాత్రుడు మాట్లాడుతూ.. గంటకో పార్టీ మారవద్దని గంటాకు పరోక్షంగా హితవు పలికారు. దీంతో గంటా, ఇతర నేతలు కొంత ఇబ్బంది పడ్డారు.
ఇప్పుడు పార్టీలోకి కొత్తగా చేరిన వారికి తాను ఒక విజ్ఞప్తి చేస్తున్నానని, గంటకో పార్టీని మారవద్దని, అయిదేళ్లు పార్టీ కోసం కష్టపడి పని చేయాలని సూచించారు. టిడిపి కార్యకర్తలో అండగా ఉన్నారంటూ 1982 నుండి పరిణామాలను ప్రస్తావించారు. తాను పార్టీ కార్యకర్తగానే చస్తానంటూ ఉద్వేగంగా చెప్పారు.

అయ్యన్న వ్యాఖ్యలతో గంటా కొంత మనస్తాపం చెందారు. ఆయన వేదికపై నుండి లేచి వెళ్లిపోయే ప్రయత్నం చేశారు. అయితే, అక్కడే ఉన్న రాజ్యసభ సభ్యులు గరికపాటి మోహన రావు, ఇతర నాయకులు ఆయనను సముదాయించి మళ్లీ కూర్చో బెట్టారు. కాగా, పార్టీ తనకు అప్పగించిన బాధ్యతలను తుచ తప్పకుండా పాటిస్తానని గంటా శ్రీనివాస రావు చెప్పారు.
కాగా, విశాఖపట్నంలో టిడిపి నిర్వహించిన ప్రజాగర్జన సభలో మాజీ మంత్రి గంటా శ్రీనివాస రావు బృందం చంద్రబాబు సమక్షంలో సైకిల్ ఎక్కారు. ఎమ్మెల్యేలు కన్నబాబు రాజు (యలమంచిలి), అవంతి శ్రీనివాస రావు (భీమిలి), పంచకర్ల రమేశ్ బాబు (పెందుర్తి), చింతలపూడి వెంకట్రామయ్య (గాజువాక), విశాఖ మాజీ మేయరు రాజాన రమణి తదితరులు పార్టీలో చేరారు.
గంటా అలక
అయ్యన్నపాత్రుడి వ్యాఖ్యలపై గంటా శ్రీనివాస రావు, ఆయన వర్గం కలత చెందింది. దీంతో గురువారం గంటా నివాసంలో ఆయన వర్గం భేటీ అయింది.












Click it and Unblock the Notifications