అవంతిపై అయ్యన్న హాట్ ట్వీట్- రాసలీలల ఆడియో ప్రస్తావిస్తూ-పదవి పోయాక అలా

ఏపీ కార్యనిర్వాహక రాజధానిగా విశాఖపట్నాన్ని ఎంపిక చేసినా అక్కడ కొత్తగా అభివృద్ధి పనులు వేగంగా జరగకపోవడంతో దీనిపై వైసీపీ, టీడీపీ మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. ఇందులో భాగంగా తాజాగా మంత్రి పదవి కోల్పోయిన భీమిలి ఎమ్మెల్యే అవంతి శ్రీనివాస్ కూ, టీడీపీ మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడుకూ మధ్య మాటల యుద్ధం సాగుతోంది.

భీమిలిలో తాజాగా చంద్రబాబు పర్యటన నేపథ్యంలో అవంతి చేసిన వ్యాఖ్యలపై స్పందించిన టీడీపీ మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు ట్విట్టర్ లో కౌంటర్ ఇచ్చారు. అదే సమయంలో అవంతి శ్రీనివాస్ కు సంబంధించి గతంలో బయటపడిన రొమాన్స్ ఆడియోను కూడా అందులో ప్రస్తావించారు. దీంతో ఇప్పుడు అయ్యన్నపాత్రుడు వ్యాఖ్యలు ఇరుపార్టీల్లో చర్చనీయాంశవుతున్నాయి.

ayyannapatrudu hot tweet on avanthi srinivas with mentioning his romantic audio leak

విశాఖ ని రాజధానిగా ప్రకటించిన తరువాత అవంతి గారి రాసలీలలు ఆడియో విడుదల తప్ప విశాఖ అభివృద్ధి అదనంగా ఒక్క రూపాయి అయినా వైసిపి ప్రభుత్వం విడుదల చేసిందా? పదవి పోయాకా పరువు కాపాడుకోవడానికి ఉత్తరాంధ్ర గుర్తొచ్చిందా? మంత్రిగా ఉన్నప్పుడు ఉత్తరాంధ్ర అభివృద్ది కోసం ఒక్క రూపాయి కూడా ఎందుకు కేటాయించడం లేదని జగన్ రెడ్డి గారిని నిలదీసే ధైర్యం లేని మీకు ఇప్పుడు ఉత్తరాంధ్ర ప్రజలు గుర్తొచ్చారా అవంతి గారు? అంటూ అయ్యన్నపాత్రుడు తన ట్వీట్ లో అవంతిని నిలదీశారు.

మరో ట్వీట్ లో వైజాగ్ కు నిధులు ఎందుకు కేటాయించడం లేదని జగన్ రెడ్డి గారిని నిలదీసే ధైర్యం లేని మీకు ఇప్పుడు ఉత్తరాంధ్ర ప్రజలు గుర్తొచ్చారా అవంతి గారు?. అంటూ అయ్యన్నపాత్రుడు ప్రశ్నించారు. వైజాగ్ ను కొత్త రాజధానిగా ప్రకటించినా నిధుల విడుదల వేగంగా లేకపోవడంతో వైసీపీ నేతల్ని టీడీపీ టార్గెట్ చేస్తోంది. ఇందులో భాగంగానే పరస్పర మాటల యుద్ధం సాగుతున్నట్లు తెలుస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+