చంద్రబాబు, కెసిఆర్ నా స్కూల్ నుంచే వచ్చారు: వీహెచ్
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, తెలంగాణ ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావుపై తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేత, ఎంపి వి హనుమంతరావు తనదైన శైలిలో స్పందించారు. ఆయన శనివారం మాట్లాడుతూ.. బాబు, కెసిఆర్‌లు తన స్కూలు నుంచే వచ్చారని చెప్పారు.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రైతులకు అన్యాయం చేస్తూ, పారిశ్రామికవేత్తల కొమ్ముకాస్తున్నాయని ఆరోపించారు. రైతుల పక్షాన కాంగ్రెస్ పార్టీ పోరాటం చేస్తోందని అన్నారు. కొంతమంది నేతల వలసల వల్ల కాంగ్రెస్ పార్టీకి వచ్చిన నష్టమేమీ లేదని హనుమంతరావు అన్నారు.

తుగ్లక్ పాలనే బెటర్: షబ్బీర్ అలీ
పిచ్చి తుగ్లక్ సాగించిన పాలనకంటే తెలంగాణలో సిఎం కెసిఆర్ పాలన అధ్వానంగా ఉందని కాంగ్రెస్ సీనియర్ నేత షబ్బీర్ అలీ ఆరోపించారు. ఆయన శనివారం మీడియాతో మాట్లాడుతూ.. 11 నెలల్లో కెసిఆర్ సర్కారుకు మొట్టికాయలేస్తూ హైకోర్టు 11 తీర్పులు ఇచ్చిందని గుర్తు చేశారు.
హైకోర్టు తీర్పులే కెసిఆర్ తుగ్లక్ పాలనకు నిదర్శనమని షబ్బీర్ అన్నారు. ప్రభుత్వాల నిర్లక్ష్య వైఖరి, ప్రకృతి వైపరీత్యాల నేపథ్యంలో అవస్థలు పడుతున్న అన్నదాతకు భరోసా ఇచ్చేందుకే కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ పర్యటనలు చేస్తున్నారని తెలిపారు. రాహుల్ పర్యటనను అడ్డుకోవాలని చూసేవారికి రైతులే తగిన రీతిలో బుద్ధి చెబుతారని ఆయన హెచ్చరించారు.












Click it and Unblock the Notifications