బ్యాడ్ లక్:ఎంసెట్ పాస్,ఇంటర్ ఫెయిల్...11,237 మంది విద్యార్థులు
అమరావతి:దురదృష్టం అంటే వీళ్లదే...క్లిష్టమైన ఎంసెట్ లో అలవోకగా ఉత్తీర్ణత సాధించిన వీళ్లు ఇంటర్ పరీక్షలో ఫెయిలవడం కొంపముంచేసింది. విచిత్రంగా ఇలాంటి విద్యార్థులు వేలాది మంది ఉండటం ఆశ్చర్యం కలిగిస్తోంది.
ఇలా ఎంసెట్ పాసై ఇంటర్ ఫెయిలైన వాళ్లు ఆంధ్రప్రదేశ్ లో ఏకంగా 11,237 మంది విద్యార్థులు ఉండటం గమనార్హం. బుధవారం వెలువడిన ఎంసెట్ పరీక్షా ఫలితాల్లో రిజల్ట్ చూసుకున్న వీరు అందులో పాసవడం చూసి మరింత ఆవేదనకు గురయ్యారు. అదెలాగంటే వీరు ఇటీవలే విడుదలైన ఇంటర్ పరీక్షా ఫలితాల్లో ఆల్రెడీ ఫెయిలై ఉండటమే కారణం.

ఇంటర్ లో కూడా పాసై ఉంటే తాము కూడా చక్కగా ఇంజనీర్, డాక్టర్ అయ్యేవాళ్లమని, దేవుడు వరమిచ్చినా పూజారి కరుణించని చందంగా క్లిష్టమైన ఎంసెట్ అధిగమించి అర్హత సాధించినా సాధారణమైన ఇంటర్మీడియట్ లో పాస్ కాలేకపోయామని మథనపడుతున్నారు. ఇలా ఇంటర్ ఫెయిలై ఎంసెట్ అర్హత సాధించిన విద్యార్థులు ఇంజనీరింగ్ విభాగంలో 8,569 మంది ఉండగా అగ్రికల్చర్ అండ్ మెడికల్ విభాగంలో 2,668 మంది ఉన్నారు.
వీరందరూ ఇంటర్‌లో ఉత్తీర్ణత కానందున ప్రస్తుతానికి ఎంసెట్ ర్యాంకులకు దూరమయ్యారు. అయితే వీరందరికీ ఊరట కలిగించే అంశం ఒకటుంది. అదేమిటంటే త్వరలో జరగబోయే ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించడం. అలా సప్లిమెంటరీ పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులకు కూడా ఎంసెట్ ర్యాంకులు కేటాయిస్తారు. కాబట్టి అలా ఎంసెట్ అవకాశాన్ని చేజారనీయకుండా ఒడిసిపట్టుకునే అవకాశం వీరందరికీ ఇంకా మిగిలేవుంది.
-
ఇందిరమ్మ లబ్దిదారులకు గుడ్ న్యూస్.. రెండో విడత ఇళ్లపై కీలక ప్రకటన -
బంగారం ధరలకు గత వైభవం -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, అసలు సమస్య - ఇలా చేయండి..!! -
Vijay: ఎంజీఆర్, జయలలిత చేయని సాహసం చేస్తున్న విజయ్? డీఎంకే కంచుకోటలో..! -
INS Aridhaman: ప్రళయ కాల రుద్రుడు, నీటి అడుగున భారత్ విశ్వరూపం.. -
బీఆర్ఎస్ లో చేరిక పై తేల్చేసిన జీవన్ రెడ్డి, వాట్ నెక్స్ట్..!! -
ఉద్యోగులకు కూటమి ప్రభుత్వం భారీ గుడ్‌న్యూస్ -
నయనతార బ్రేకప్ వెనుక అసలు రహస్యం.. ప్రభుదేవా ఆ ఒక్క కండీషన్ వల్లే? -
విశాఖ రైల్వే జోన్ పరిధిలో కీలక మార్పులు, ప్రధాన మార్గం విలీనం..!! -
అదే గానీ జరిగితే.. పాకిస్థాన్‌కు రాజ్‌నాథ్ సింగ్ స్ట్రాంగ్ వార్నింగ్.. -
వివాహేతర సంబంధాల్లో రెండో స్థానంలో హైదరాబాద్.. తాజా సర్వేలో.. -
వాస్తు ప్రకారం.. ఇంట్లో ఈ మొక్కలు పెరుగుతూ ఉంటే సంపద పెరుగుతూ ఉంటుంది












Click it and Unblock the Notifications