బద్వేలులో వైసీపీ ఖాతాలో టీడీపీ ఓట్లు- బీజేపీ డిపాజిట్ గల్లంతు : కొత్త సమీకరణాలకు వేదికగా...!!
బద్వేల్‌లో వైఎస్సార్‌సీపీ ఘన విజయం సాధించింది. 90,550 ఓట్ల మెజార్టీతో వైఎస్సార్‌సీపీ అభ్యర్థి డాక్టర్ సుధ విజయం సాధించారు. పోలైన మొత్తం ఓట్లలో వైసీపీ అభ్యర్ధి 76 శాతం ఓట్లు సాధించారు. 2019 లో వైసీపీ అభ్యర్ధి వెంకట సుబ్బయ్య సాధించిన మెజార్టీ కంటే ఈ సారి ఆయన సతీమణి దాసరి సుధ రెండింతల మెజార్టీ సాధించారు. ఈ ఎన్నికల్లో వైకాపాకు 1,12,072, భాజపాకు 21,661 ఓట్లు పోలయ్యాయి. కాంగ్రెస్‌కు 6,217 ఓట్లు దక్కగా.. నోటాకు 3,636 ఓట్లు వచ్చాయి.నాలుగు కౌంటింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయగా, ఒక్కో కౌంటింగ్ కేంద్రంలో ఏడు టేబుళ్లను ఏర్పాటు చేశారు. గరిష్టంగా 13 రౌండ్లలో ఓట్ల లెక్కింపు పూర్తయ్యింది. బద్వేల్‌లో బీజేపీ, కాంగ్రెస్ డిపాజిట్ కోల్పోయాయి.

బద్వేలు ఎన్నికలో కొత్త సమీకరణాలు
బీజేపీ, టీడీపీ, జనసేన కలిసినా డిపాజిట్ గల్లంతయ్యింది. మొదటి నుంచి ప్రతి రౌండ్‌లోనూ వైఎస్సార్‌సీపీ ఆధిక్యత ప్రదర్శించింది. ఇక్కడ గెలుపు ఖాయమని ముందు నుంచి వైసీపీ అంచనా వేసింది. దీంతో..మెజార్టీ పైనే ప్రధానంగా ఫోకస్ చేసింది. 2019 ఎన్నికల్లో వచ్చిన 45 వేల మెజార్టీకి రెట్టింపు ఈ ఉప ఎన్నికల్లో దక్కించుకుంది. అయితే, ఈ ఎన్నిక ల్లో చోటు చేసుకున్న పరిణామాలు.. పడిన ఓట్లను పరిశీలిస్తే ఈ ఎన్నిక ద్వారా ఏపీలో కొత్త సమీకరణాలు మొదలైనట్లుగా అంచనాలు వ్యక్తం అవుతున్నాయి. 2019 ఎన్నికల్లో ఇక్కడ పోటీ చేసిన వైసీపీ అభ్యర్ధి కి 95,482 ఓట్లు రాగా, ఈ సారి 1,12,072 ఓట్లు వచ్చినట్లు తెలుస్తోంది. టీడీపీకి 2019 ఎన్నికల్లో 50,748 ఓట్లు పోలయ్యాయి.

వైసీపీ ఖాతాలో పడిన టీడీపీ ఓట్లు
అదే విధంగా బీజేపీ అభ్యర్ధికి 735 ఓట్లు దక్కగా, కాంగ్రెస్ కు 2,337 ఓట్లు పోలయ్యాయి. ఇక, ఇప్పుడు ఎన్నికల్లో టీడీపీ..జనసేన పోటీ చేయలేదు. వైసీపీ అప్పుడూ..ఇప్పుడూ ఒంటరిగానే పోటీ చేసింది. క్షేత్ర స్థాయిలో టీడీపీ పోటీలో లేకపోవటంతో..వైసీపీ వ్యతిరేక ఓటుతో పాటుగా టీడీపీ ఓటు బ్యాంకును తమ వైపు తిప్పుకొనేందుకు బీజేపీ నేతలు ప్రయత్నించారు. అదే సమయంలో పవన్ ఫ్యాన్స్ తో పాటుగా జనసేన మద్దతు దారుల ఓట్లు తమకే పడతాయని అంచనా వేసింది. అయితే, బీజేపీ ఓటు బ్యాంకు గత ఎన్నికల్లో 735 నుంచి ఇప్పుడు 21,661 కి చేరింది. టీడీపీ నుంచి బీజేపీలో చేరిన సీఎం రమేష్..ఆదినారాయణ రెడ్డి ఇక్కడ పార్టీ అభ్యర్ది కోసం కీలకంగా పని చేసారు. దీంతో..కొంత మేర టీడీపీ ఓట్లు సాధించినట్లు గా పోలయిన ఓట్లు స్పష్టం చేస్తున్నాయి.

టీడీపీ ఓటర్ల మనసు మారుతోందా
అదే సమయంలో కాంగ్రెస్ ఓట్లు సైతం కొంత మేర పెరిగాయి. ఇక్కడ టీడీపీ ఓట్లు పూర్తిగా బీజేపీకి బదిలీ కాలేదు. వైసీపీకి సైతం ఆ ఓట్లు బదిలీ కావటం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. టీడీపీ బరిలో లేకపోవటం వలన వారు బైపోల్ లో భాగంగా వైసీపీ వైపు మొగ్గు చూపారా..లేక, టీడీపీ ఓటు పూర్తిగా వైసీపీకి టర్న్ అయిందా అనేది ఇప్పుడు ఆసక్తి కర చర్చగా మారుతోంది. ప్రభుత్వ సంక్షేమ పధకాలే వారిని తమ వైపు తిప్పాయని వైసీపీ నేతలు చెబుతున్నారు. టీడీపీ ఓటర్లు వైపీపీ వైపు మొగ్గు చూపుతున్నారని విశ్లేషిస్తున్నానరు. ఇదే సమయంలో టీడీపీ ఓటర్లు బీజేపీకి ఓట్లు వేయటం ద్వారా రానున్న ఎన్నికల్లో బీజేపీ..జనసేన...టీడీపీ కలిసి 2014 తరహాలో పొత్తులకు సంకేతంగా ఒక అభిప్రాయం వ్యక్తం అవుతోంది. ప్రధాని మోదీ పైన చేసిన వ్యాఖ్యలతో టీడీపీ అధినేత చంద్రబాబును బీజేపీ అగ్ర నాయకత్వం పూర్తిగా పక్కన పెట్టింది.

కొత్త పొత్తులకు సంకేతాలా
కానీ, రెండు పార్టీలు కలిసి పని చేయాల్సి న అవసరాన్ని ఈ ఓట్ల లెక్కల ద్వారా వివరించటానికి అవకాశం ఏర్పడుతుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇదే సమయంలో పవన్ కళ్యాణ్ ప్రచారంలోకి రాకపోయినా.. క్షేత్ర స్థాయిలో జనసేన కార్యకర్తలు బీజేపీకి మద్దతుగా పని చేసారు. టీడీపీతో పొత్తు లేదని చెబుతున్న బీజేపీ నేతలు..తమ పార్టీ ఏజెంట్లుగా టీడీపీ నేతలను కూర్చోబెట్టటం పైన వైసీపీ నేతలు ఆధారాలు సైతం బయట పెట్టారు. దీని ద్వారా సీఎం సొంత జిల్లాలోని బీజేపీ నేతలు మాత్రం టీడీపీని..బీజేపీని దగ్గర చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారనే అభిప్రాయం బలంగా వినిపిస్తోంది. ఒక వైపు పవన్ కళ్యాణ్ చేస్తున్న డిమాండ్లకు చంద్రబాబు మద్దతు..టీడీపీ అధినేత ఎంచుకున్న అంశాలకు పరోక్షంగా పవన్ మద్దతి ఇస్తూ ఇద్దరూ కలిసి సీఎం జగన్ ను టార్గెట్ చేస్తున్నారు.

రానున్న రోజుల్లో కీలక పరిణామాలకు ఛాన్స్
ఇదే సమయంలో కొందరు ఏపీ బీజేపీ నేతలు సైతం టీడీపీతో పొత్తు కోరుకుంటున్నారు. ఇప్పటికే 2024 ఎన్నికల్లోనూ తాము ఒంటరిగానే పోటీ చేస్తామని వైసీపీ స్పష్టం చేసింది. అయితే, ఏపీలో వేగంగా మారుతున్న రాజకీయ సమీకరణాలతో పొత్తుల పైన రానున్న రోజుల్లో మరింత వేగంగా అడుగులు పడే అవకాశం కనిపిస్తోంది. టీడీపీతో పొత్తు కావాలని కొందరు బీజేపీ నేతలు కోరుకుంటున్నా...అదే విధంగా పవన్ తో పొత్తు అవసరమని టీడీపీ నేతలు భావిస్తున్నా.. ఢిల్లీలోని కేంద్ర పెద్దల మూడ్..వారి నిర్ణయాలకు అనుగుణంగానే ఏపీలో కొత్త పొత్తులకు రూట్ క్లియర్ కానుంది. దీంతో..సీఎం జగన్ లక్ష్యంగా ఏపీలో రాజకీయ సమీకరణాలు వేగంగా మారే అవకాశం కనిపిస్తోంది.
-
ప్రకాష్ రాజ్ ఇంట తీవ్ర విషాదం.. పవన్ కళ్యాణ్ ఎమోషనల్ పోస్ట్ !! -
సోషల్ మీడియాలో సెన్సేషన్ గా మారిన "అల్లు అర్జున్" రిలేటివ్.. -
టీవీకే అభ్యర్థుల జాబితా విడుదల వేళ.. త్రిష ప్రీ- ప్లాన్డ్ గా !! -
బెస్ట్ వెయిట్ లాస్ జ్యూస్.. రోజూ తాగితే పొట్ట వద్దన్నా పోతుంది..!! -
తెలుగు ఇండస్ట్రీ హిట్ హిందీ రీమేక్‌లో శ్రీలీల.. ట్రోలింగ్ చూస్తే ఏడుపే !! -
ఇంటిమేట్ సీన్లలో నన్ను వాడుకున్నారు.. కట్ చెప్పినా వినలేదు: స్టార్ హీరోయిన్ -
అక్కినేని అఖిల్ సంచలన నిర్ణయం.. వైరల్ అవుతున్న ఎమోషనల్ పోస్ట్..! -
2028 అమెరికా అధ్యక్షుడు ఆయనే.. భారత్ కు గుడ్ న్యూస్..!! -
రోజూ ఉదయాన్నే ఖాళీ కడుపుతో ఈ నీళ్లు తాగితే చాలు- లివర్, కిడ్నీలు క్లీన్..!! -
జన్మ నక్షత్రం మఖ, పుబ్బ, ఉత్తర ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
SRH కొంప మునిగిందక్కడే- RCB కి టర్నింగ్ పాయింట్ -
IPL 2026: చరిత్ర సృష్టించిన ముంబై ఇండియన్స్.. 14 ఏళ్ల తర్వాత బోణీ!












Click it and Unblock the Notifications