Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Badvel Results: 70 వేలకు చేరిన వైసీపీ మెజార్టీ - సీఎం జగన్ టార్గెట్ మేరకు : రౌండ్ల వారీగా ఎవరికెన్ని...!!

ముఖ్యమంత్రి సొంత జిల్లా కడప లో జరిగిన బద్వేలు బై పోల్ లో అధికార వైసీపీ ఏకపక్షంగా దూసుకెళ్తోంది. 2019లో సాధించిన మెజార్టీ కంటే రెట్టింపు రావాలని ముఖ్యమంత్రి జగన్ పార్టీ ఎన్నికల బాధ్యులకు నిర్దేశించారు. 2019 ఎన్నికల్లో బద్వేలు నుంచి వైసీపీ అభ్యర్దిగా గెలిచిన వెంకట సుబ్బయ్య 45 వేల మెజార్టీ సాధించారు. ఆయన మరణంతో వెంకట సుబ్బయ్య సతీమణి వైసీపీ అభ్యర్ధిగా బరిలోకి దిగారు. టీడీపీ..జనసేన బద్వే లు బై పోల్ కు దూరంగా ఉన్నారు. దీంతో..టీడీపీ ఓట్లతో పాటుగా ప్రభుత్వ వ్యతిరేక ఓటు తమ వైపు మలచుకొనేందుకు బీజేపీ ప్రయత్నాలు చేసింది.

దరి దాపుల్లో లేని బీజేపీ- కాంగ్రెస్

దరి దాపుల్లో లేని బీజేపీ- కాంగ్రెస్

జిల్లాకు చెందిన మాజీ టీడీపీ నేతలు సీఎం రమేష్... మాజీ మంత్రి ఆదినారాయణ రెడ్డి ఇక్కడ ప్రధానంగా బాధ్యతలు తీసుకున్నారు. బద్వేలు ఎన్నికల బాధ్యతలను సీనియర్ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి సీఎం జగన్ అప్పగించారు. ముందు నుంచి వ్యూహాత్మకం గా మండలాలకు సైతం ఇన్ ఛార్జ్ లను నియమించి..ఎమ్మెల్యేలకు అప్పగించారు. తాము గెలుపు కోసం ఆలోచన చేయటం లేదని..మెజార్టీ సాధించటమే తమ లక్ష్యమని వైసీపీ నేతలు స్పష్టం చేసారు.

సీఎం లేఖలు - నేతలకు బాధ్యతలు

సీఎం లేఖలు - నేతలకు బాధ్యతలు


సీఎం జగన్ తాను ప్రచారానికి రాలేకపోతున్నానని..వైసీపీకి ఓట్లు వేసి తమ అభ్యర్ధి దాసరి సుధను భారీ మెజార్టీతో గెలిపించాలంటూ ప్రతీ ఓటరకు లేఖ రాసారు. ఇక, ఈ రోజు కౌంటింగ్ ప్రారంభమైన తరువాత పోస్టల్ బ్యాలెట్ మొదలు ఇప్పుడు ఎనిమిది రౌండ్లు పూర్తయ్యే వరకూ వైసీపీ ప్రతీ రౌండ్ లోనూ ఏకపక్షంగా ఓట్లు సాధిస్తూ వచ్చింది. పోటీలో నిలిచిన కాంగ్రెస్..బీజేపీ అభ్యర్ధులు దరి దాపుల్లోకి రాలేదు. వారు వెనుకబడి ఉన్నారు. బద్వేలులో ఇప్పటి వరకు 8 రౌండ్ల కౌంటింగ్ పూర్తయింది.

70 వేల మెజార్టీకి చేరువలో

70 వేల మెజార్టీకి చేరువలో

8వ రౌండ్ లో వైసీపీ 9,691 ఓట్లు సాధించగా, బీజేపీకి 1,964 ఓట్లు, కాంగ్రెస్ కు 774 ఓట్లు వచ్చాయి. కాగా, వైసీపీ అభ్యర్ది దాసరి సుధ 68,492 ఓట్ల ఆధిక్యతతో నిలిచారు. ఏడో రౌండ్‌లో వైఎస్సార్‌సీపీకి 10,726, బీజేపీకి 1924, కాంగ్రెస్‌కు 841 ఓట్లు పోలయ్యాయి. ఏడు రౌండ్లు ముగిసే సరికి వైఎస్సార్‌సీపీ 74991 ఓట్లు సాధించింది. ఆరో రౌండ్‌లో వైఎస్సార్‌సీపీకి 11,383, బీజేపీకి 1940, కాంగ్రెస్‌కు 531 ఓట్లు పోలయ్యాయి. ఆరు రౌండ్లు ముగిసేసరికి వైఎస్సార్‌ వైఎస్సార్‌సీపీ 64,265 ఓట్లు సాధించింది. ఆరో రౌండ్‌ ముగిసే సరికి 52,024 ఓట్ల ఆధిక్యంలో వైఎస్సార్‌సీపీ కొనసాగుతోంది. వైఎస్సార్‌సీపీకి 64,265 ఓట్లు, బీజేపీకి 12,241 ఓట్లు పోలయ్యాయి.తొలి రౌండ్‌లో వైఎస్సార్‌సీపీ 10,478, బీజేపీ 1688, కాంగ్రెస్‌కు 580 ఓట్లు లభించాయి.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+