Bahrain: బహ్రెయిన్ లో తెలుగు వారికి గుడ్ న్యూస్..! నేటి నుంచే...!
ఇరాన్ యుద్దం కారణంగా గల్ఫ్ దేశాల్లో ఉన్న భారతీయులపై తీవ్ర ప్రభావం పడుతోంది. అమెరికా-ఇజ్రాయెల్ తమపై దాడులు ప్రారంభించగా.. ఇరాన్ గల్ఫ్ దేశాల మీద ప్రతిదాడులతో విరుచుకుపడటం మొదలుపెట్టింది. దీంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న భారతీయుల్ని తిరిగి స్వదేశానికి రప్పించే ప్రక్రియ ముమ్మరంగా సాగుతోంది. ఇందులో భాగంగా బహ్రెయిన్ (Bahrain) లో భారీ సంఖ్యలో ఉన్న భారతీయుల్ని, ముఖ్యంగా తెలుగు వారిని స్వదేశానికి రప్పించే ప్రక్రియ ప్రారంభమైంది.
ఇరాన్ నిత్యం చేస్తున్న దాడులతో బహ్రెయిన్ విమానాల రాకపోకల్ని నిలిపేసింది. దీంతో అక్కడ భారతీయులు పెద్ద సంఖ్యలో చిక్కుకుపోయారు. అయితే బహ్రెయిన్ లో తెలుగు వారిని వెనక్కి రప్పించేందుకు కేంద్ర విమానయానశాఖ, డీజీసీఏ సాయంతో ఏపీ ప్రభుత్వం ప్రయత్నాలు ప్రారంభించింది. ఎట్టకేలకు ఇవాళ్టి నుంచి బహ్రెయిన్ లో తెలుగు వారిని వెనక్కి తీసుకువచ్చే ప్రక్రియ ప్రారంభమైందని ప్రభుత్వం ప్రకటించింది. బహ్రెయిన్ నుంచి విమాన సర్వీసులకు అనుమతి లేకపోవడంతో ఈ విమానాలకు టికెట్లు బుక్ చేసుకున్న వారిని బస్సుల్లో సౌదీకి తరలిస్తున్నారు. అక్కడి నుంచి భారత్ కు తరలిస్తారు. సౌదీలోని 'దమమ్ ఎయిర్ పోర్ట్' నుంచి విమానాలు నడుపుతున్నారు.

ఇవాళ్టి నుంచి రోజుకు 58 మంది చొప్పున తెలుగు వారిని కొచ్చి విమానాశ్రయానికి తీసుకొస్తున్నట్లు గల్ఫ్ ఎయిర్ తెలిపింది పేర్కొంది. ఈ విమానాలు ఎప్పుడు బయలుదేరుతాయి, ఎప్పుడు చేరుకుంటాయన్న దానిపై బహ్రెయిన్ లోని తెలుగు సంఘం ప్రతినిధులు వెల్లడించారు. దీని ప్రకారం రేపు 138 మందితో కూడీన మరో విమానం బహ్రెయిన్ నుంచి ముంబైకి రానుంది. ఢిల్లీలోని ఏపీ భవన్ అధికారులు బహ్రెయిన్ నుంచి తెలుగు వారిని వెనక్కి రప్పించేందుకు జరుగుతున్న ప్రయత్నాలపై ఎప్పటికప్పుడు వివరాలు అందిస్తున్నారు.












Click it and Unblock the Notifications