బాలయ్య వస్తేనే తాళి కడతానంటున్న వీరాభిమాని.. భారీ సెట్టింగులతో.. నేడే పెళ్లి .. బాలకృష్ణ వస్తారా?
బాలయ్య వస్తేనే తాళి కడతానంటున్న వీరాభిమాని, మూడేళ్ళ నిరీక్షణ తర్వాత బాలయ్య వస్తానని హామీ ఇవ్వటంతో భారీ సెట్టింగులతో పెళ్ళికి రెడీ అయ్యారు. నేడే పెళ్లి మరి బాలకృష్ణ వస్తారా? చూడాలి.
పెళ్లంటే పందిళ్లు.. సందళ్లు.. తాళాలు.. తలంబ్రాలు ఇంత హంగామా మధ్య బంధుమిత్రుల సకటుంబ సపరివార సమేతంగా వధూవరులు ఒకటయ్యే జీవితంలోనే అత్యంత ముఖ్యమైన శుభకార్యం. పెళ్లి చేసుకునే వధూవరులకు అది వారి జీవితంలో ప్రధానమైన ఘట్టం. అయితే అటువంటి పెళ్లిని తమ అభిమాన నటుడు బాలకృష్ణ ముందు అంగరంగ వైభవంగా చేసుకోవాలని నిర్ణయించుకున్నాడు విశాఖ వాసి. దాని కోసం మూడేళ్ళు ఎదురుచూశాడు. ఇక ఇప్పుడు బాలయ్య వస్తేనే తాళి కడతానంటూ హంగామా చేస్తున్నాడు. తన పెళ్లికి బాలకృష్ణ ఖచ్చితంగా వస్తాడని.. రావాలయ్యా బాలయ్య అంటూ భారీగా ఏర్పాట్లు చేసి అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తున్నాడు. ఒకవేళ బాలకృష్ణ రాకుంటే పెళ్లి చేసుకోనని తెగేసి చెబుతున్నాడు సదరు అభిమాని.

పెళ్లి కార్డులలోనూ బాలయ్య ఫొటోలే .. వధూవరుల వీరాభిమానం
విశాఖపట్నం పెందుర్తి మండలం చింతల అగ్రహారానికి చెందిన కోమలి పెద్ది నాయుడు బాలకృష్ణకు వీరాభిమాని. ఆయన తండ్రి ఎన్టీఆర్ కు వీరాభిమాని. అంతకు తగ్గ బొంత అన్నట్టు పెద్ది నాయుడు చేసుకోబోయే వధువు గౌతమీ ప్రియ కూడా బాలయ్యకు వీరాభిమాని. ఈ వధూవరులు ఇద్దరు తమ పెళ్ళి బాలయ్య ముందు చేసుకోవాలని గట్టిగా నిర్ణయించుకున్నారు. పెళ్లి ముహూర్తం పెట్టుకున్న దగ్గర నుండి పెళ్లి కార్డులలోను ఎన్టీఆర్, బాలకృష్ణ ఫోటోలను ముద్రించి మరీ కార్డులను పంచి హంగామా చేశారు.

2019లో ఎంగేజ్మెంట్.. బాలయ్య బాబు కోసం వాయిదా.. నిరీక్షణ
ఇక తమ పెళ్ళికి బాలయ్యను ఆహ్వానించిన సదరు వీరాభిమాని, బాలకృష్ణ వస్తానని హామీ ఇవ్వడంతో గ్రామంలో రచ్చ చేస్తున్నాడు. పెళ్లికి ఊరంతా పందిరి వేసి, బాలయ్య రేంజ్ కు తగ్గట్టు భారీ ఏర్పాట్లు చేస్తున్నాడు. బాలయ్య బాబు రావాలి తమ పెళ్ళి జరగాలి అని పంతం పట్టిన వధూవరులు కోమలి పెద్ది నాయుడు, గౌతమీ ప్రియ ఎట్టకేలకు తమ కోరిక ఫలిస్తున్న నేపథ్యంలో ఈరోజు అర్ధరాత్రి 2 గంటల 12 నిమిషాలకు తెల్లవారితే ఆదివారం అనగా పెళ్లి ద్వారా ఒక్కటి కాబోతున్నారు. 2019లో ఎంగేజ్మెంట్ చేసుకున్న సదరు యువకుడు కేవలం తన పెళ్లికి బాలయ్య రావాలి అన్న ఉద్దేశంతోనే ఇంతకాలం వేచి చూసాడు.

మూడెకరాల స్థలంలో భారీ సెట్టింగులతో పెళ్లి వేడుక.. బాలయ్య వస్తారా?
బాలయ్య చిన్నల్లుడు మార్గాని భరత్ సహకారంతో బాలయ్యను పెళ్ళికి ఆహ్వానించి, బాలయ్య షెడ్యూల్ ని బట్టి పెళ్లి డేట్ ఫిక్స్ చేసుకున్నాడు. చివరకు ఎన్నాళ్లో వేచిన ఉదయం ఈరోజే ఎదురవుతుంది అన్నట్టు బాలయ్య వస్తానని చెప్పడంతో ఉబ్బితబ్బిబ్బై చేస్తున్న హంగామా అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తుంది. మూడు ఎకరాల స్థలంలో భారీ సెట్లు వేయించి 15 రోజుల ముందు నుంచే ఏర్పాట్లు చేయిస్తున్నాడు సదరు అభిమాని. బాలకృష్ణ ఫోటోలు ముద్రించిన టీ షర్టులు, గొడుగులు రెడీ చేశారు. ఇక ప్రైవేట్ సెక్యూరిటీని కూడా ఏర్పాటు చేసి బాలయ్యకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చర్యలు చేపట్టాడు.

ధూమ్ ధామ్ గా ఏర్పాట్లు .. బాలయ్య రాకపై అందరిలో ఆసక్తి
తమ అభిమాన నటుడు వస్తాడని, తమ జంటను ఆశీర్వదిస్తాడని నమ్మకంతో ధూమ్ ధామ్ గా ఏర్పాట్లు చేసుకున్నాడు పెద్ది నాయుడు ఊరంతా బాలయ్య ఫ్లెక్సీలు, కటౌట్లతో నింపేశాడు. ఇక పెద్ది నాయుడు వీరాభిమానం చూసిన ప్రతి ఒక్కరు ఇంతకీ బాలయ్య వస్తాడా? ఈ అభిమాని జంటను ఆశీర్వదిస్తాడా? ఒకవేళ రాకపోతే ఈ జంట పెళ్లి చేసుకోరా? వంటి అనేక ప్రశ్నలతో తెగ సతమతమైపోతున్నారు.
-
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, ఇలా చేయండి.. వెంటనే..!! -
ఆసియాలోనే అతిపెద్ద, ప్రపంచంలో నాలుగో అతిపెద్ద విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ -
తెలంగాణలో కొత్త అసెంబ్లీ సీట్లు ఇవే, కలిసొచ్చేది ఆ పార్టీకే- అసలు లెక్క..!! -
భారీగా బీర్ల ధరలు పెంపు, ఏ బ్రాండ్ ఎంత.!! -
పద్మవ్యూహంలోకి ట్రంప్ ? ఇరాన్ లో భూతల దాడి నరకమేనా ? -
పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గింపు - కేంద్రం అనూహ్య నిర్ణయం, వంట గ్యాస్ రేట్లూ ఇక..!! -
బంగారం ధరల్లో అనూహ్యం- భారీగా రీబౌండ్ -
రామ్చరణ్ ‘పెద్ది’ గ్లింప్స్ పై రివ్యూ -
రామ్ చరణ్ బర్త్డే గిఫ్ట్ మామూలుగా లేదుగా! -
సమ్మర్ స్పెషల్ 'పెసరపప్పు చారు'.. ఇదొక్కటి యాడ్ చేస్తే టేస్ట్ అద్దిరిపోద్ది..! -
అమెరికన్ కరెన్సీ ఇకపై.. !!












Click it and Unblock the Notifications