వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బాలయ్య డైలమా: అసెంబ్లీకా, లోకసభకా? (పిక్చర్స్)

By Pratap
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడి వియ్యంకుడు, నందమూరి హీరో బాలకృష్ణ ఎన్నికల బరిలోకి దిగడం ఖాయమైంది. అయితే, పార్లమెంటుకు పోటీ చేయాలా, అసెంబ్లీకి పోటీ చేయాలా అనే విషయంలో ఆయన డైలమాలో ఉన్నట్లు తెలుస్తోంది. బిజెపితో టిడిపికి ఎలాగు పొత్తు ఉంటుంది. దాని వల్ల ఎన్డీయే అధికారంలోకి వచ్చే పక్షంలో ఎంపిగా పోటీ చేయడం వల్ల కేంద్ర మంత్రి అయ్యే అవకాశం ఉంటుందని నందమూరి కుటుంబం బాలకృష్ణపై వత్తిడి చేస్తున్నట్టు సమాచారం.

భవిష్యత్‌లో రాజకీయంగా ఎదగాలంటే ఎంపి కన్నా, ఎమ్మెల్యేగా పోటీ చేయడమే ఉత్తమమని బాలకృష్ణ శ్రేయోభిలాషులు సూచిస్తున్నట్టు సమాచారం. ఈ రెండు వాదనల మధ్య బాలకృష్ణ మాత్రం ఎంపిగానా? ఎమ్మెల్యేగానా దేనికి పోటీ చేయాలనేది ఇంకా తేల్చుకోలేక పోతున్నట్టు చెబుతున్నారు. ఎన్టీఆర్ సొంత జిల్లా కృష్ణాలోని ఏ నియోజకవర్గం నుంచైనా ఎమ్మెల్యేగా పోటీకి దిగాలని ఇప్పటికే బాలకృష్ణకు చంద్రబాబు సూచించినట్టు సమాచారం. అయితే కృష్ణా జిల్లా నుంచి కాకుండా అనంతపురం జిల్లా హిందూపురం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసేందుకు బాలకృష్ణ ఆసక్తి కనబరుస్తున్నట్టు సమాచారం.

ఇలా ఉండగా, తాను దేనికి పోటీ చేయాలనేది పార్టీ అధిష్ఠానం నిర్ణయించాల్సి ఉంటుందని మంగళవారం ‘లెజెండ్' సినిమా యూనిట్‌తో కలిసి సింహాచలం దర్శనానికి వచ్చిన సందర్భంగా బాలకృష్ణ వ్యాఖ్యానించారు. బాలకృష్ణ నిర్ణయం తీసుకోవాలని అధినేత చంద్రబాబు, అధిష్ఠానం నిర్ణయం తీసుకోవాలని బాలకృష్ణ ఒకరిపై ఒకరు తోసేసుకుంటున్నారు. పైగా ఇప్పటి వరకు పార్టీ ప్రచారం కోసం బాలకృష్ణ చేసిందేమి లేదు.

బాలకృష్ణ అయినా మరొకరు అయినా పార్టీ కోసం ప్రచారం చేయాల్సిందేనని చంద్రబాబు చేసిన వ్యాఖ్యలలోని అంతరార్థం ఏమిటనేది అంతు బట్టడం లేదు. కేవలం తనకు కావాల్సిన టిక్కెట్ తీసుకుంటే సరిపోదు, పార్టీ కోసం రాష్టమ్రంతా తిరిగి ప్రచారం చేయాలని బాలకృష్ణను ఉద్దేశించి పరోక్షంగా చంద్రబాబు ఈ వ్యాఖ్యలు చేసి ఉంటారని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి.

సింహాద్రి అప్పన్న చెంత బాలయ్య

సింహాద్రి అప్పన్న చెంత బాలయ్య

ప్రముఖ తెలుగు సినీ నటుడు, తెలుగుదేశం నాయకుడు నందమూరి బాలకృష్ణ మంగళవారంనాడు సింహాద్రి అప్పన్నను దర్శించుకుని పూజలు నిర్వహించారు.

సినిమాల్లో లెజెండ్, మరి..

సినిమాల్లో లెజెండ్, మరి..

సినిమాల్లో తిరుగులేని కథానాయకుడిగా ఎదిగిన బాలకృష్ణ రాజకీయాల్లో ఏ మేరకు రాణిస్తాడో చూడాలి. సింహాద్రి అప్పన్న చెంత బాలయ్య ఇలా...

రాజకీయాలు తండ్రి కోసం..

రాజకీయాలు తండ్రి కోసం..

తన సినిమాలు అభిమానుల కోసమని, రాజకీయాలు తన తండ్రి ఎన్టీ రామారావు కోసమని బాలయ్య చెప్పారు.

అసెంబ్లీకా, పార్లమెంటుకా..

అసెంబ్లీకా, పార్లమెంటుకా..

పార్లమెంటుకు వెళ్తే బిజెపి అధికారంలోకి వస్తే కేంద్రంలో మంత్రి పదవి చేపట్టవచ్చునని కొంత మంది బాలయ్యకు చెబుతున్నారు. ఆయన ఏం చేస్తారో..

బాబుపై భారం..

బాబుపై భారం..

తాను ఎక్కడి నుంచి పోటీ చేయాలనే విషయాన్ని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు నిర్ణయిస్తారని బాలకృష్ణ చెప్పారు.

సినిమాల్లో సింహా..

సినిమాల్లో సింహా..

సినిమాల్లో సింహాగా రాణించిన బాలకృష్ణ రాజకీయాల్లో ఏ స్థాయిలో కుదురుకుంటారో చూడాలని అంటున్నారు.

English summary
It is said that Telugudesam aprty leader and Nandamuri hero Balakrishna is in dilemma wether to contest for assembly or Lok Sabha.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X