గడ్కరీకు బాలకృష్ణ విజ్ఞప్తి, 20 కాదు.. 45 ఎకరాల్లో తాత్కాలిక సచివాలయం
విజయవాడ/ఢిల్లీ: రహదారుల విషయంలో వెనుకబడిన అనంతపురం జిల్లాకు తగిన ప్రాధాన్యం టిడిపి హిందూపురం ఎమ్మెల్యే, నటుడు నందమూరి బాలకృష్ణ కేంద్రమంత్రి నితిన్ గడ్కరీకి గురువారం నాడు విజ్ఞప్తి చేశారు. ఆయన ఢిల్లీ పర్యటనలో ఉన్నారు.
ఈ రోజు నితిన్ గడ్కరీని కలిశారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో అనంతపురం జిల్లా హిందూపురంలో నిర్వహించనున్న లేపాక్షి ఉత్సవాలకు హాజరుకావాలని నితిన్ గడ్కరీని బాలకృష్ణ ఆహ్వానించారు.
అదే సమయంలో వెనుకబడిన అనంతపురం జిల్లాకు తగిన ప్రాధాన్యత ఇవ్వాలని కోరారు. జిల్లా అభివృద్ధికి సహకరించాలన్న తన విజ్ఞప్తికి గడ్కరీ సానుకూలంగా స్పందించారని చెప్పారు. రోడ్ల నిర్మాణానికి, మరమ్మతులకు తగిన నిధులు ఇవ్వాలని కోరానని తెలిపారు.

45 ఏకరాల్లో తాత్కాలిక సచివాలయం
తాత్కాలిక సచివాలయం నిర్మాణానికి సంబంధించి ఏపీ ప్రభుత్వం గురువారం తాత్కాలిక ఉత్తర్వులు జారీ చేసింది. తొలుత నిర్ణయించినట్లుగా 20 ఎకరాల్లో కాకుండా 45.12 ఎకరాల్లో సచివాలయం నిర్మించనున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొంది. గుంటూరు జిల్లా వెలగపూడిలో తాత్కాలిక సచివాలయం నిర్మించనున్నారు.
సీఆర్డీఏ వేదిక ఆధారంగా 45 ఎకరాల్లో సచివాలయ నిర్మాణానికి ప్రభుత్వం ఆమోదముద్ర వేసింది. వీటిలో 27.08 ఎకరాల్లో సమీకృత ప్రభుత్వ భవన సముదాయం, 18.47 ఎకరాల్లో ప్రజా సదుపాయాల భవనాలను నిర్మించనున్నారు.












Click it and Unblock the Notifications