ఒక్కోక్కర్ని కలుస్తూ ధైర్యం: బాలకృష్ణను కలచివేసింది
అనంతపురం: బస్సు ప్రమాదంలో ముక్కుపచ్చలారని చిన్నారులు ప్రాణాలు కోల్పోవడం తనను కలచివేసిందని హిందూపురం శాసన సభ్యుడు, తెలుగు హీరో నందమూరి బాలకృష్ణ గురువారం అన్నారు. పెనుగొండ బస్సు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి హిందూపురం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను ఆయన ఉదయం పరామర్శించారు.
ఆయన ఆసుపత్రిలో ఒక్కొక్కర్ని పరామర్శిస్తూ ధైర్యం చెప్పారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. బాధితులను అన్ని విధాలుగా ఆదుకుంటామని హామీ ఇచ్చారు. ప్రమాదంపై విచారణ జరుగుతోందన్నారు. నివేదిక వచ్చాక ప్రమాదానికి కారణమైన వారిపై చర్యలు తీసుకుంటామని చెప్పారు.

ప్రతీ ఒక్కరూ బాధ్యతగా వ్యవహరిస్తే భవిష్యతులో ఇలాంటి ఘటనలు జరుగకుండా ఉంటుందన్నారు. గాయపడిన వారికి వైద్యులు మంచి వైద్యం అందిస్తున్నారన్నారు. కాగా, పెనుగొండ బస్సు ప్రమాదంలో పలువురు మృతి చెందిన విషయం తెలిసిందే.
అనపర్తి దగ్గర గూడ్స్ రైల్‌లో మంటలు
విశాఖపట్నం నుంచి విజయవాడకు బొగ్గులోడుతో వెళుతున్న గూడ్స్ రైలులో గురువారం ఉదయం మంటలు చెలరేగాయి. విషయం తెలుసుకున్న రైల్వే సిబ్బంది వెంటనే రైలును ఆపి, ఫైర్ స్టేషన్‌కు సమాచారమిచ్చారు. రైల్వే సిబ్బంది సమాచారంతో హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకొన్న ఫైర్ ఇంజన్ సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకొచ్చినట్లు తెలస్తోంది.












Click it and Unblock the Notifications