గొప్పతనాన్ని విదేశాల్లో చాటాలి: విద్యార్థులతో బాలకృష్ణ
అనంతపురం: తెలుగువారి గొప్పతనాన్ని దేశ విదేశాల్లో చాటాలని సినీనటుడు, తెలుగుదేశం పార్టీ హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ అన్నారు. హిందూపురం పట్టణంలోని సప్తగిరి కళాశాలలో శనివారం జరిగిన ఫ్రెషర్స్ డే కార్యక్రమానికి బాలకృష్ణ ముఖ్య అతిథిగా విచ్చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. క్రమశిక్షణతో కూడిన విద్యను నేర్చుకోవాలని విద్యార్థులకు సూచించారు. తాము ఎన్టీఆర్ ఆశయాలతో ముందుకెళ్తున్నామని చెప్పారు. సమాజంలో మహిళలకు ప్రాధాన్యత ఇచ్చి రాజకీయాల్లోకి తీసుకువచ్చింది ఎన్టీఆర్ అని తెలిపారు.

సమాజంలో యువశక్తి కీలకమని, విద్యార్థులు లక్ష్యాన్ని ఎంచుకొని ముందుకు వెళ్లాలని మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి అన్నారు. ఈ కార్యక్రమానికి ఎంపి నిమ్మల కిష్టప్ప, మున్సిపల్ ఛైర్‌పర్సన్ లక్ష్మి హాజరయ్యారు.
అంతకుముందు హిందూపురం నియోజకవర్గంలో పర్యటించిన బాలకృష్ణ ప్రజా సమస్యల పరిష్కారం కోసం స్థానికంగా డెస్క్‌ను ఏర్పాటు చేశారు. ముస్లింల కోసం ఉర్దూ పాఠశాలలు, కళాశాలలను ప్రారంభిస్తామని చెప్పారు. నీటి సమస్యను త్వరలోనే తీర్చుతామని తెలిపారు.












Click it and Unblock the Notifications