బాలకృష్ణ ప్రశంస, అసెంబ్లీలో విద్యుత్ కట్: మండలికే...
హైదరాబాద్: సభాపతి కోడెల శివప్రసాద్ కేన్సర్ ఆసుపత్రికి అంతర్జాతీయస్థాయిలో గుర్తింపు తీసుకు వచ్చారని హిందూపురం శాసన సభ్యుడు నందమూరి బాలకృష్ణ శుక్రవారం అసెంబ్లీలో అన్నారు. కోడెల సభాపతిగా ఏకగ్రీవంగా ఎన్నికైన నేపథ్యంలో అభినందలు తెలుపుతూ ఆయన మాట్లాడారు.
పేదల పక్షపాతి అయిన కోడెల పేరును ప్రతిపాదించడం సంతోషించదగ్గ విషయమన్నారు. పలు మంత్రి పదవులను ఆయనను వరించాయని, ఆయన వాటిని సమర్థవంతంగా నిర్వహించారన్నారు.

విద్యుత్ కట్
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీకి విద్యుత్ కోతలు తప్పడం లేదు. శుక్రవారం సభ కొనసాగుతుండగానే కాసేపు విద్యుత్ నిలిచిపోయింది.
డిప్యూటీ స్పీకర్ పదవికి నామినేషన్ వేసిన మండలి
డిప్యూటీ స్పీకర్ పదవికి మండలి బుద్ధప్రసాద్ శుక్రవారం సాయంత్రం నామినేషన్ దాఖలు చేశారు. కాగా, అంతకుముందు డిప్యూటీ స్పీకర్‌గా గొల్లపల్లి సూర్యారావును పేరు వినిపించింది. శుక్రవారం డిప్యూటీ స్పీకర్ కోసం నోటిఫికేషన్ జారీ అయింది. సాయంత్రం ఐదు గంటల వరకు నామినేషన్లను స్వీకరించారు. 23న ఎన్నిక ఉంటుంది. ఈ నేపథ్యంలో మండలి నామినేషన్ దాఖలు చేశారు. ప్రభుత్వ చీఫ్ విప్‌గా కాల్వ శ్రీనివాసులు, ప్రభుత్వ విప్‌లుగా బొండా ఉమ, కోన రవికుమార్ పేర్లు ఖరారైనట్లుగాసమాచారం.












Click it and Unblock the Notifications