హిందూపురం టిడిపి కంచుకోట: బాలయ్య సేఫ్

అనంతపురం: తన తండ్రి ఎన్టీ రామారావు వారసత్వాన్ని అందిపుచ్చుకోవాలని ఆరాటపడుతున్న నందమూరి హీరో బాలకృష్ణ సురక్షితమైన సీటును ఎంచుకున్నారు. హిందూపురం తెలుగుదేశం పార్టీకి పెట్టని కోట. దీంతో బాలయ్య విజయం ఇక్కడ నల్లేరు మీద నడకే అవుతుంది. హిందూపురం నుంచి ఓడిపోయిన చరిత్ర తెలుగుదేశం పార్టీకి లేదు. ఆయన విజయం ఖాయమైనట్లేనని భావిస్తున్నారు.

సైకిల్ గుర్తును హిందూపురంలో ఓడించడం ఎవరి వల్లా కాదు. 1982 నుంచి హిందూపురం తెలుగుదేశం పార్టీకి పెట్టనికోట మాదిరిగానే ఉంది. ఒక్క ఎన్నికలో కూడా ఇక్కడ అభ్యర్థులు ఎవరైనా సైకిల్ ఓటమి చవి చూడలేదు. తెలుగుదేశం పార్టీ అవిర్భవించిన తర్వాత 1982లో జరిగిన తొలి ఎన్నికల్లో ఆ పార్టీ తరఫున పోటీ చేసి పి. రంగనాయకులు విజయం సాధించారు

Balakrishna safe at Hindpuram segment

ఆయనే 2004 ఎన్నికల్లో కూడా విజయం సాధించారు. ఈ మధ్యలో ఎన్టీ రామారావు మూడు సార్లు హిందూపురం నుంచి పోటీ చేసి విజయం సాధించారు. గత ఎన్నికల్లో 2009లో పి. అబ్దుల్ ఘనీ తెలుగుదేశం పార్టీ నుంచి పోటీ చేసి విజయం సాధిచారు.

హిందూపురం తెలుగుదేశం పార్టీకి, ఆ పార్టీ వ్యవస్థాపకుడు ఎన్టీ రామారావుకు విధేయత ప్రకటిస్తూ వస్తోంది. ఇప్పుడు బాలకృష్ణ అక్కడి నుంచి సునాయసంగా విజయం సాధించడాన్ని ఎవరూ ఆపలేరని అంటున్నారు. ఈ సీటును బాలకృష్ణ సోదరుడు నందమూరి హరికృష్ణ కూడా ఆశించారు. అయితే, చంద్రబాబుకు సన్నిహితుడైన బాలకృష్ణకే సీటు దక్కింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+