భువనేశ్వరిపై బాలయ్య, పవన్ కళ్యాణ్ పై చిరంజీవి.. ఆత్మీయానురాగాల సమాహారం ఏపీ మంత్రుల ప్రమాణం

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో టిడిపి కూటమి విజయం సాధించడంతో నేడు టిడిపి బిజెపి జనసేన కూటమి నుంచి ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు, ఉపముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ తోపాటు మొత్తం 25 మంది మంత్రులు ప్రమాణ స్వీకారం చేశారు. ఈ ప్రమాణ స్వీకార ఘట్టం ఆద్యంతం ఉద్వేగ భరితంగా సాగింది.ఐదేళ్ళ పోరాటం అందరి కళ్ళ ముందు కనిపించింది.

భావోద్వేగాల సమాహారంగా ఏపీ మంత్రుల ప్రమాణం
భావోద్వేగాల మధ్య, ఆత్మీయ ఆలింగనాల మధ్య, ఒకరిపై ఒకరు చూపించే అనురాగాలకు ప్రతీకగా ఈ కార్యక్రమం జరిగింది. ఈ వేడుకల్లో కొన్ని ఆసక్తికరమైన ఘట్టాలు ఏపీ మంత్రుల ప్రమాణ స్వీకారం ఆత్మీయత అనురాగాల సమాహారంగా చూపించాయి. ఒకరిపై ఒకరికి ఉన్న ప్రేమకు ప్రతీకగా నిలిచాయి.

Balakrishna with Bhuvaneswari Chiranjeevi with Pawan Kalyan sentiments and emotions in swearing in ceremony

భువనేశ్వరిపై బాలయ్య ప్రేమ
ఏపీ సీఎం గా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేస్తున్నవేళ వేదిక పైన జరిగిన ఆసక్తికర సంఘటనలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ముఖ్యంగా నందమూరి బాలకృష్ణ వేదిక పైన ఉన్న భువనేశ్వరిపై చూపించిన ప్రేమ, ప్రస్తుతం సోషల్ మీడియాలో చెక్కర్లు కొడుతోంది. ప్రమాణ స్వీకారం సందర్భంగా నారా, నందమూరి ఫ్యామిలీ మెంబర్లు కన్నీరు పెట్టుకున్న ఘటనలు అందరినీ ఉద్వేగానికి లోను చేశాయి.

తలపై ముద్దు పెట్టి ఆశీర్వదించిన బాలయ్య
నారా చంద్రబాబు నాయుడు అనే నేను అంటూ ప్రమాణ స్వీకారం ప్రారంభించగానే నందమూరి రామకృష్ణ, ఘట్టమనేని శేషగిరిరావు తదితరులు భావోద్వేగానికి గురయ్యారు. అలాగే వేదికపై ఉన్న భువనేశ్వరి వద్దకు వచ్చి హిందూపురం ఎమ్మెల్యే, సోదరుడు బాలకృష్ణ ఆమె తలపై ముద్దు పెట్టి ఆశీర్వదించి వెళ్లారు. ఇది అన్నా చెల్లెళ్ళ మధ్య ఆత్మీయానురాగాలకు ప్రతీకగా నిలిచింది.

అన్న కాళ్ళకు మొక్కిన పవన్ కళ్యాణ్
అంతేకాదు మరోవైపు పవన్ కళ్యాణ్ ప్రమాణ స్వీకార సమయంలో వేదికపై ఉన్న చిరంజీవి కూడా భావోద్వేగానికి గురయ్యారు. చిరంజీవి ఫ్యామిలీ అంతా పవన్ కు మద్దతుగా అక్కడకు వచ్చి అమితానందం పొందారు. ప్రమాణ స్వీకారం తర్వాత వేదికపై ఉన్న పెద్దలందరికీ నమస్కరించిన పవన్ కళ్యాణ్ నేరుగా తన అన్నయ్య చిరంజీవి వద్దకు వెళ్లి ఆయనకు పాదాభివందనం చేశారు. చిరంజీవి తన సోదరుడిని ఆలింగనం చేసుకొని గుండెలకు హత్తుకున్నారు. ప్రస్తుతం ఈ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+