నా ఫ్యామిలీని టచ్ చేసినా కూడా ఊరుకోవాలా - బాలినేని..!!

ఏపీలో ఎన్నికల సమయంలో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. టీడీపీ కూటమి -వైసీపీ మధ్య ఈ ఎన్నికలు ప్రతిష్ఠాత్మకంగా మారాయి. తాజాగా ఒంగోలులో చోటు చేసుకున్న ఘటనల పైన మాజీ మంత్రి బాలినేని స్పందించారు. తనను టచ్ చేస్తే ఊరుకున్నానని.. తన ఫ్యామిలీని టచ్ చేసినా కూడా ఊరుకోవాలా అని ప్రశ్నించారు. ఎన్నికల ప్రచారానికి వెళ్లిన త‌న‌ కోడలిపై టీడీపీ శ్రేణులు నానా దుర్బాషలాడి దాడికి ప్రయత్నించటంపై టీడీపీ అధినేత చంద్రబాబు సమాధానం చెప్పాలని డిమాండ్‌ చేసారు.

ఒంగోలులో భయానక పరిస్దితులు సృష్టించి టీడీపీ లబ్ధిపొందాలని చూస్తోందని బాలినేని విమర్శించారు. గొడవ జరిగిన ప్రాంతానికి ఏం జరిగిందో సామాన్య వ్యక్తులను అడిగి తెలుసుకోవాలన్నారు. ఐదేళ్ల క్రితం ఒంగోలు కమ్మపాలెంలో ఇదే తరహా ఘటనకు పాల్పడి అక్రమ కేసులు పెట్టారని గుర్తు చేసారు. తాము అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ సామాజిక వర్గానికి చెందిన ఒక్కరిని కూడా ఇబ్బంది పెట్టలేదన్నారు.
ఐదుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన త‌న‌ కుటుంబంపై ఇలాంటి ఘటనలకు పాల్పడటం కరెక్టేనా చంద్రబాబు, పవన్ కల్యాణ్‌ సమాధానం చెప్పాలని బాలినేని డిమాండ్‌ చేశారు.

Balineni seriously reacts over political clashes in Ongole warns tdp leaders

రిమ్స్ లో చికిత్స పొందుతున్న వైసీపీ కార్యకర్తల దగ్గరకు టీడీపీ కార్య‌క‌ర్త‌లు వెళ్లి మీ సంగతి తేలుస్తామంటూ బెదిరించార‌ని, త‌మ కార్యకర్తలను ఒంగోలు రిమ్స్ లో బెదిరించిన వీడియోలు కూడా స్పష్టంగా ఉన్నాయన్నారు. ఎన్నికల్లో లబ్ది పొందేందుకు కావాలనే ప్లాన్ చేసి ఇలాంటి ఘటనకు పాల్పడ్డారని ఆరోపించారు. ఈ ఘటనపై ఎస్పీ స్పందించకపోతే ఇళ్లకు వెళ్లి కొడతామని మాజీ ఎమ్మెల్యే జనార్దన్ బెదిరిస్తున్నార‌ని ఆరోపించారు. ఒంగోలు ఇష్యూ మీద అన్ని ఆధారాలతో ఎన్నికల కమిషన్ కు ఫిర్యాదు చేస్తామ‌ని బాలినేని వెల్లడించారు.

ఒంగోలు ఘటనపై చీరాల ఎమ్మెల్యే కరణం బలరాం స్పందించారు. చంద్రబాబుకు చెప్పింది వినే అలవాటు ఉందే కానీ నిజాలు తెలుసుకునే అలవాటు లేదన్నారు. చంద్రబాబు వాస్తవాలు తెలుసుకుని మాట్లాడితే బాగుంటుందని సూచించారు. ఈ ఘటన కావాలని క్రియేట్ చేసిన సమస్యలా కనిపిస్తుందని.. బాలినేని కుటుంబ సభ్యుల ప్రచార సమయంలో వారిని టీడీపీ కార్యకర్తలు కించపరిచేలా మాట్లాడారని వివరించారు. కులాల మధ్య తేడాలు పెట్టాలని చూస్తున్నారని..ఇది చాలా తప్పని చెప్పారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+