ఆ జిల్లాను భయపెడుతున్న బర్డ్ ఫ్లూ.. కోడిగుడ్లు, కోళ్ళు విక్రయాలపై నిషేధం!
ఉమ్మడి చిత్తూరు జిల్లాలో బర్డ్ ఫ్లూ విజృంభిస్తోంది. చిత్తూరు జిల్లాలో బర్డ్ ఫ్లూ విస్తరణ స్థానికులకు తీవ్ర ఆందోళన కలిగిస్తుంది. వేల సంఖ్యలో కోళ్లు మృత్యువాత పడుతున్న క్రమంలో అధికారులు అప్రమత్తమయ్యారు. సదుం మండలాలలో ఇప్పటికే నిర్ధారణ అయిన ఈ బర్డ్ ఫ్లూ, కార్వేటి నగరంలో కూడా కలకలం రేపుతుంది. దీంతో అప్రమత్తమైన జిల్లా యంత్రాంగం ప్రత్యేక రాపిడ్ యాక్షన్ టీంను రంగంలోకి దింపింది.
కోళ్లు, కోడిగుడ్ల విక్రయాలపై నిషేధం
కలెక్టర్ కార్యాలయంలో కంట్రోల్ రూమ్ ను కూడా ఏర్పాటు చేశారు. కలెక్టర్ సమిత్ కుమార్ టెలికాన్ఫరెన్స్ ద్వారా మండల స్థాయి ఆరోగ్య శాఖ అధికారులను అప్రమత్తం చేయగా అధికారులు సామూహిక మరణాల పైన ప్రాథమిక విచారణ చేపట్టారు. ఇదిలా ఉంటే ఈ క్రమంలో బర్డ్ ఫ్లూ వ్యాప్తి చెందుతున్న ప్రాంతాలలో కోడిగుడ్లను, కోళ్లను ఎవరికి అమ్మకూడదని, ఆ ప్రాంతంలో కోళ్లు, కోడిగుడ్ల విక్రయాలపై నిషేధం విధించారు.

కోళ్ళ రక్త నమూనాలను భోపాల్ లోని ల్యాబ్ కు
నిన్న ఒక్కరోజే వెయ్యికి పైగా ఆర్కేవి పేట, ఇందిరా కాలనీలో కోళ్లఫారాలలో కోళ్లు మృతి చెందాయి. దీంతో ఫారం యజమానులు అధికారులకు తెలియజేశారు. చనిపోయిన కోళ్ళను అధికార యంత్రాంగం జాగ్రత్తగా పూడ్చి పెడుతోంది. చనిపోయిన కోళ్లకు సంబంధించి రక్త నమూనాలను భోపాల్ లోని ల్యాబ్ కు పంపారు. ఈ క్రమంలోనే కారణాలు తెలిసే వరకు కోడిగుడ్లను, కోళ్లను విక్రయించరాదని ఫారం యజమానులకు అధికారులు ఆదేశాలు జారీ చేశారు.
పౌల్ట్రీ ఫామ్ ల నిర్వాహకులు బయో సెక్యూరిటీ నిబంధనలను విధిగా పాటించాలి
అంతేకాదు ఎక్కడైతే కోళ్లు భారీ సంఖ్యలో మృతి చెందాయో అక్కడకు ఇతరులను అనుమతించవద్దని, వాహనాలను రానివ్వకూడదు అని యజమానులకు స్పష్టం చేశారు. బర్డ్ ఫ్లూ వ్యాప్తి నివారణలో భాగంగా ఈ చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. పౌల్ట్రీ ఫామ్ ల నిర్వాహకులు బయో సెక్యూరిటీ నిబంధనలను విధిగా పాటించాలని అధికారులు ఆదేశించారు.
బర్డ్ ఫ్లూ విస్తరిస్తే పౌల్ట్రీ పరిశ్రమకు తీవ్ర నష్టం
ఉమ్మడి చిత్తూరు జిల్లాలో వేల కోళ్ల ఫారాలు ఉన్నాయి. లక్షల సంఖ్యలో కోళ్ల పెంపకం జరుగుతోంది. ఇక్కడి నుంచి పెద్ద ఎత్తున కోళ్ళ ఎగుమతులు ఉన్నాయి. ఈ ప్రాంతంలో బర్డ్ ఫ్లూ విస్తరిస్తే పౌల్ట్రీ పరిశ్రమకు తీవ్ర నష్టం జరుగుతుంది. దీంతో అధికారులు ఈ వ్యాధి విస్తరణ కట్టడి చేయడానికి, పౌల్ట్రీ పరిశ్రమను కాపాడడానికి తగిన చర్యలు చేపడుతున్నారు. దీనికి సంబంధించి ఎప్పటికప్పుడు ప్రభుత్వానికి కూడా నివేదికలు పంపుతున్నారు.
-
రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్, పథకాలు ఇక నుంచి..!! -
ఏపీ నూతన ఎన్నికల కమిషనర్ గా.. జగన్ బాధిత అధికారి..!? -
ఇలా చేస్తే అమరావతి గొడవ క్లోజ్..! మావిగన్ వేళ చంద్రబాబుకు సాయిరెడ్డి ఐడియా..! -
గ్రామాల్లోకి కూడా "అన్నా క్యాంటీన్లు"..! -
అడ్డంగా దొరికిన చంద్రబాబు? అంకెలతో తేల్చేసిన సజ్జల ..! -
అతిపెద్ద నిర్ణయాన్ని తీసుకోబోతున్నాం- తేల్చి చెప్పిన ప్రధాని మోదీ -
కటౌట్ కు తగ్గ పర్ఫెక్ట్ ఫిల్మ్- టైటిల్ గూస్ బంప్స్: విజువల్ వండర్ -
AP Inter Results: ఏపీలో ఇంటర్ ఫలితాల ముహూర్తం ఫిక్స్, అఫీషియల్..!! -
పాకిస్థాన్ కు ఎగిరి గంతేసే వార్త.. ఒకేసారి రూ. 41,500 కోట్లు సాయం అందింది..!! -
కెరీర్ లోనే ఫస్ట్ ప్లాఫ్.. ఎలా తట్టుకుంటున్నావ్ అన్నా..!! -
రాజ్యసభకు టీడీపీ, బీజేపీ నుంచి ఊహించని అభ్యర్దులు- జనసేన నుంచి ఆయనే..!! -
వాస్తు ప్రకారం ఏ రాశివారికి ఏ దిక్కులో ఉండే ఇళ్లు కలిసివస్తాయి?












Click it and Unblock the Notifications