చంద్రబాబు ప్రభుత్వానికి కేంద్రం బిగ్ షాక్..ఢిల్లీలో మారుతున్న లెక్కలు
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి బనకచర్ల ప్రాజెక్టు విషయంలో కేంద్రం నుండి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఈ కీలక ప్రాజెక్టుకు పర్యావరణ అనుమతులు నిరాకరించినట్లు కేంద్రం స్పష్టం చేసింది. ఏపీ పంపిన ప్రతిపాదనలను తిప్పి పంపింది.
దీంతో బనకచర్ల కాలువల సామర్థ్యం పెంపు పనులను చేపట్టాలన్న చంద్రబాబు ప్రభుత్వ ఆశలకు అడ్డుకట్ట పడింది. పర్యావరణ అనుమతులు పొందడంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విఫలమైందని కేంద్రం తేల్చి చెప్పింది.

ఈ నిర్ణయం వెనుక తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఫిర్యాదు కూడా ఒక కారణంగా తెలుస్తోంది. బనకచర్ల ప్రాజెక్టును అక్రమంగా చేపట్టిన ప్రాజెక్టుగా పేర్కొంటూ, వెంటనే చర్యలు తీసుకోవాలని ఆయన కేంద్ర జలశక్తి మంత్రిని కలిసి విజ్ఞప్తి చేశారు.
ఆ సమయంలో ఏపీ సీఎం చంద్రబాబు సైతం రేవంత్ రెడ్డిపై విమర్శలు చేశారు. సముద్రంలో కలిసే నీళ్లను వినియోగించుకుంటే తప్పు ఏముందని ఆయన రేవంత్ రెడ్డిని ప్రశ్నించారు. దీనిపై కూర్చొని మాట్లాడుకుంటే సమస్యకు పరిష్కారం లభిస్తుందని చంద్రబాబు చెప్పడం జరిగింది. అయితే బనకచర్ల ప్రాజెక్టుకు అనుమతి ఇచ్చేది లేదని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది.
రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇచ్చిన ఫిర్యాదును పరిగణనలోకి తీసుకుని కేంద్రం ఈ తుది నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. బనకచర్ల ప్రాజెక్టు అనుమతులపై అనేక అభ్యంతరాలు వచ్చాయని నిపుణుల కమిటీ తెలిపింది.
జీడబ్ల్యూడీటీ , సీడబ్ల్యూసీ సంప్రదింపులు అవసరమని కేంద్ర నిపుణుల కమిటీ వెల్లడించింది. దీంతో బనకచర్ల ప్రాజెక్టుకు బ్రేక్ పడినట్టు అయింది. ఈ పరిణామంతో రాష్ట్రంలోని సాగునీటి ప్రాజెక్టుల భవిష్యత్తు , రెండు తెలుగు రాష్ట్రాల మధ్య జల వివాదాలపై ఎలాంటి ప్రభావం చూపుతుందో వేచి చూడాలి.
-
ఏపీలో 75 లక్షల పేద కుటుంబాలకు గుడ్ న్యూస్-చంద్రబాబు కీలక ఆదేశాలు..! -
దీదీ ఆస్తుల చూస్తే షాక్ అవ్వాల్సిందే! సంచలన అఫిడవిట్ -
ఆ నిధులన్నీ వారికే: సీఎం రేవంత్ కీలక నిర్ణయం -
ఒరేయ్ ఆజామూ లగెత్తరోయ్.. తులం బంగారం రూ. 2 వేలే.. -
AP Inter Results 2026: ఇంటర్ ఫలితాలు ఎప్పుడంటే ? బోర్డు క్లారిటీ..! -
పేలిన బంగారం ధరల బాంబు- తారాజువ్వ -
IPL 2026: ముంబై ఇండియన్స్ కొంపముంచిన బుడ్డోడు! -
చెన్నై సూపర్ కింగ్స్ కు భారీ ఉపశమనం- పులి వచ్చింది -
ఓటీటీలోకి తెలుగు బోల్డ్ మూవీ.. అర్జున్ రెడ్డికి మించి.. ఆ రోజు నుంచే స్ట్రీమింగ్ -
today rashiphalalu: నేడు ముఖ్య గ్రహాల గోచారంతో వీరి పంట పండుతుంది.. మీరున్నారా? -
తమిళనాడు, కేరళ, బెంగాల్, అసోంలో గెలుపెవరిది ? సీఓటర్ తాజా సర్వే..! -
'హ్యాపీ బర్త్ డే బావా'.. ఎన్టీఆర్ ఎమోషనల్ పోస్ట్.. బన్ని షాకింగ్ రిప్లై..












Click it and Unblock the Notifications