పూర్ణా మార్కెట్, డబ్బా ఖాళీ: 'జగన్' డబుల్ (పిక్చర్స్)
హైదరాబాద్: సమైక్యాంధ్ర ఉద్యమంలో భాగంగా సమైక్యాంధ్ర పరిరక్షణ వేదిక ఇచ్చిన పిలుపు మేరకు మంగళవారం సీమాంధ్రలో రహదారుల దిగ్బంధనం, బంద్ జరిగింది. పలు వర్గాలు బంద్‌లో స్వచ్చంధంగా పాటించాయి. రోడ్డుమార్గాలకు కూడలి అయిన విజయవాడ నుంచి చెన్నై, కోల్‌కత్తా, హైదరాబాద్, మచిలీపట్నం ఇలా నాలుగు వైపులకు వెళ్లే జాతీయ రహదారులన్నీ ఆందోళనకారులు దిగ్బంధించారు.
సీమాంధ్రలో ప్రతిచోట రహదారుల దిగ్బంధం జరగటంతో వాహనాలు ప్రధాన రహదారులపై ఎక్కడికక్కడ నిలిచాయి. సీమాంధ్రలోని దాదాపు అన్ని పట్టణాల్లో పలు సంఘాల నేతల నాయకత్వంలో స్వచ్ఛందంగా బంద్ జరిగింది. సినిమా థియేటర్లలో పగటి ఆటలు రద్దయ్యాయి. విద్యా సంస్థలు రెండో రోజు కూడా మూతబడ్డాయి. అన్ని రకాల వాణిజ్య వ్యాపార సంస్థలు హోటళ్లు పూర్తిగా మూతబడ్డాయి.
సమైక్యాంధ్ర కోరుతూ జాతీయ రహదారుల దిగ్బంధం, స్వచ్ఛంద బంద్ పాటించటంతో జిల్లాలో జన జీవనం స్తంభించింది. జిల్లాలో నిర్వహించిన అన్ని కార్యక్రమాలు విజయవంతమయ్యాయి. సర్వమత ప్రార్థనలు చేశారు. బంద్‌కు మద్దతు పలకకుండా తెరిచివున్న ప్రైవేటు బ్యాంకులను సమైక్యాంధ్ర విద్యార్థి జెఎసి నాయకులు మూయించివేశారు.

జగదాంబ సెంటర్
సమైక్యాంధ్ర ఉద్యమంలో భాగంగా సమైక్యాంధ్ర పరిరక్షణ వేదిక ఇచ్చిన పిలుపు మేరకు జగదాంబ సెంటర్‌లో మూతబడిన దుకాణాలు.

వైయస్సార్ కాంగ్రెసుకు డబుల్
సమైక్యాంధ్ర ఉద్యమంలో భాగంగా తీర ప్రాంతంలో జై సమైక్యాంధ్ర ప్లకార్డులు ప్రదర్శిస్తున్న వైయస్సార్ కాంగ్రెసు పార్టీ కార్యకర్తలు. నిన్న జగన్ పార్టీ కార్యకర్తలు జగన్‌కు బెయిల్ వచ్చిన ఆనందాన్ని జరుపుకుంటూనే మరోవైపు బందులో పాల్గొన్నారు. తీరంలో జగన్ సైకత శిల్పం.

పూర్ణ మార్కెట్
సమైక్యాంధ్ర ఉద్యమంలో భాగంగా సమైక్యాంధ్ర పరిరక్షణ వేదిక ఇచ్చిన పిలుపు మేరకు పూర్ణ మార్కెట్టులో మూతబడిన దుకాణాలు.

రైలు డబ్బా ఖాళీ
సమైక్యాంధ్ర ఉద్యమంలో భాగంగా సమైక్యాంధ్ర పరిరక్షణ వేదిక ఇచ్చిన పిలుపు మేరకు బంద్ పాటిస్తుండటంతో రైళ్లలో జనం లేని దృశ్యం.

స్టేషన్ ఎదుట
సమైక్యాంధ్ర ఉద్యమంలో భాగంగా సమైక్యాంధ్ర పరిరక్షణ వేదిక ఇచ్చిన పిలుపు మేరకు బంద్ పాటిస్తుండటంతో రైల్వే స్టేషన్ వద్ద జనం లేని దృశ్యం.

రోడ్లు ఖాళీ
సమైక్యాంధ్ర ఉద్యమంలో భాగంగా సమైక్యాంధ్ర పరిరక్షణ వేదిక ఇచ్చిన పిలుపు మేరకు బంద్ పాటిస్తుండటంతో రోడ్లు ఖాళీగా ఉన్న దృశ్యం.

రోడ్లపై లేని జనం
సమైక్యాంధ్ర ఉద్యమంలో భాగంగా సమైక్యాంధ్ర పరిరక్షణ వేదిక ఇచ్చిన పిలుపు మేరకు విశాఖపట్నంలో బంద్ పాటిస్తుండటంతో రోడ్లు ఖాళీగా ఉన్న దృశ్యం.

చౌరస్తాలో లేని జనం
సమైక్యాంధ్ర ఉద్యమంలో భాగంగా సమైక్యాంధ్ర పరిరక్షణ వేదిక ఇచ్చిన పిలుపు మేరకు విశాఖపట్నంలో బంద్ పాటిస్తుండటంతో రోడ్లు ఖాళీ.

తోపుడు బళ్లు
సమైక్యాంధ్ర ఉద్యమంలో భాగంగా బందు పాటిస్తున్న శ్రీశ్రీశ్రీ కనక మహాలక్ష్మి తోపుడు బళ్ల వర్తక సంఘం. విభజన వద్దు... సమైక్యాంధ్ర ముద్దు అంటూ ప్రదర్శన.

వుడా బ్యాంక్
సమైక్యాంధ్ర ఉద్యమంలో భాగంగా సమైక్యాంధ్ర పరిరక్షణ వేదిక ఇచ్చిన పిలుపు మేరకు విశాఖలో బ్యాంకులను బంద్ చేస్తున్న దృశ్యం.

బంద్ ర్యాలీ
సమైక్యాంధ్ర ఉద్యమంలో భాగంగా సమైక్యాంధ్ర పరిరక్షణ వేదిక ఇచ్చిన పిలుపు మేరకు విశాఖలో బ్యాంకులను బంద్ చేసి ర్యాలీ తీస్తున్న దృశ్యం.

తిరుపతిలో బంద్
సమైక్యాంధ్ర ఉద్యమంలో భాగంగా సమైక్యాంధ్ర పరిరక్షణ వేదిక ఇచ్చిన పిలుపు మేరకు చిత్తూరు జిల్లా తిరుపతిలో బంద్ పాటిస్తూ నిరసనలో పాల్గొన్న సమైక్యవాదులు.

మహిళ డ్యాన్స్
సమైక్యాంధ్ర ఉద్యమంలో భాగంగా నిరసన కార్యక్రమాల్లో పాల్గొన్న ఓ మహిళ తిరుపతిలో దరువుకు అనుగుణంగా నాట్యం చేస్తున్న దృశ్యం.

తిరుపతిలో ఖాళీ
సమైక్యాంధ్ర ఉద్యమంలో భాగంగా సమైక్యాంధ్ర పరిరక్షణ వేదిక ఇచ్చిన పిలుపు మేరకు తిరుపతిలో బంద్ పాటిస్తుండటంతో రోడ్లు ఖాళీగా ఉన్న దృశ్యం.

ఖాళీగా ఉన్న రోడ్లు
సమైక్యాంధ్ర ఉద్యమంలో భాగంగా సమైక్యాంధ్ర పరిరక్షణ వేదిక ఇచ్చిన పిలుపు మేరకు తిరుపతిలో బంద్ పాటిస్తుండటంతో రోడ్లు ఖాళీ.

సామాన్యుడు
భావోద్వేగాలకు రగులుతున్న తెలుగు జాతి.. చోద్యం చూస్తున్న రాజకీయ నాయకులు అంటూ నిరసన తెలుపుతున్న సమైక్యవాదులు.












Click it and Unblock the Notifications