పొలిటికల్ కామెంట్స్ మళ్లీ చేసిన బండ్ల (బ్లేడ్) గణేష్ ! ఈ సారి పవన్ కళ్యాణ్ ప్రసన్నం కోసమేనా ?

రాజకీయాల్లోకి వచ్చి తక్కువ రోజుల్లోనే హల్ చల్ చేసిన బండ్ల గణేష్ రాజకీయాలు నాకొద్దు బాబోయ్ అంటూ రాజకీయాల నుండి వైదొలిగారు. ఇక తాజాగా జనసేనపై బండ్ల గాలి మళ్లినట్టుంది. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ను ముఖ్యమంత్రిగా చూడాలన్నదే తన కోరిక అని సినీ నిర్మాత, హాస్య నటుడు బండ్ల గణేష్ అన్నారు. ఓ టీవీ చానెల్ ఇంటర్వ్యూలో ఆయన పవన్ సీఎం కావాలనే తన కోరిక వెల్లడించారు . పవన్ కళ్యాణ్ అధికారంలోకి వస్తే చూస్తూ ఆనందిస్తానని, అంతే తప్ప మళ్లీ రాజకీయాల్లోకి వచ్చే ప్రసక్తి లేదని ఆయన తేల్చి చెప్పారు.

రాజకీయాల్లో ఉన్నది పోయింది.. ఉంచుకున్నది పోయిందన్న బండ్ల గణేష్

రాజకీయాల్లో ఉన్నది పోయింది.. ఉంచుకున్నది పోయిందన్న బండ్ల గణేష్

పవన్ కళ్యాణ్ కు పరమ భక్తుడిని అని చెప్పుకునే బండ్ల గణేష్ గత ఎన్నికల సమయంలో ఊహించని విధంగా కాంగ్రెస్ పార్టీ తీర్ధం పుచ్చుకున్నారు. ఇక బోలెడు సంచలనాలతో రాష్ట్రం దృష్టిని ఆకర్షించాడు. కానీ రాజకీయాల్లో ఉన్నది , ఉంచుకున్నదీ పోయిందని రాజకీయాలకు గుడ్ బై చెప్పారు. ఇది టెంపరరీగా కాదు.. పాలిటిక్స్‌కు ఫుల్‌స్టాప్ పెట్టేశాను అంతేనని బండ్ల గణేష్ చెప్పుకొచ్చారు .మంచి సినిమా.. కాస్త మనకు డబ్బులు మిగులుతాయని అనుకుంటే తీస్తానని చెప్పారు. డబ్బులు మిగలకుండా సినిమా తీయాలంటే తనకు భయమని చెప్పారు. రిస్క్ తీసుకోవాల్సిన అవసరం తనకు లేదని అన్నారు. ఇప్పుడైతే తాను అన్ని విధాలా హ్యాపీగా ఉన్నానని, రిస్క్ చేయడం ఎందుకని చేయడం లేదని బండ్ల పేర్కొన్నారు .

రాజకీయాల్లో సక్సెస్ కోసం వెయిట్ చేసే ఓపిక లేదు అన్న బండ్ల

రాజకీయాల్లో సక్సెస్ కోసం వెయిట్ చేసే ఓపిక లేదు అన్న బండ్ల

రాజకీయాలపై తన అభిప్రాయాన్ని బండ్ల గణేష్ కుండ బద్దలు కొట్టారు. సినిమాలకు టైమ్ ఉంటుంది కానీ.. రాజకీయాలకు ఎలాంటి టైమ్ ఉండదని,రాజకీయాల్లో సక్సెస్ కోసం వెయిట్ చేసే అంత ఓపిక తనకు లేదని అన్నారు. తాను మంత్రి అయిపోవాలని అనుకున్నానని, కొందరు తనను చెడగొట్టారని, మీలాంటి వాళ్లు ప్రమాణ స్వీకారం చేయాలని తప్పు దోవ పట్టించారని ఆయన అన్నారు. ఉన్నదీ పోయింది, ఉంచుకున్నదీ పోయింది అనే పరిస్థితి తనకు వచ్చిందని ఆయన అన్నారు.

పవన్ సీఎం కావాలన్నదే నా కోరిక అన్న బండ్ల

పవన్ సీఎం కావాలన్నదే నా కోరిక అన్న బండ్ల

తాను రాజకీయాలకు పనికిరానని ఎన్నికలకు ముందే తేలింది గానీ వెంటనే బయటికి వచ్చేస్తే బాగుండదని పార్టీలోనే ఉండాల్సి వచ్చిందని ఆయన అన్నారు. అంతకు ముందు తను ఒక స్టార్ లా ఉన్నానని తాను రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ఏ స్టారూ కాదని తేలిపోయిందని గణేష్ అన్నారు. మొత్తానికి రాజకీయాలు వద్దు అంటూనే పవన్ కళ్యాణ్ సీఎం కావాలనే తన కోరిక బయటపెట్టి జనసేనకు జై అంటున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+