Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

కృతజ్ఞత లేకుండా బతకడం - బండ్ల టార్గెట్ ఎవరు..!?

ఏపీ రాజకీయాలు ఆసక్తి కరంగా మారుతున్నాయి. తాజాగా పిఠాపురంలో జరిగిన సభలో నాగబాబు చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి. పిఠాపురం నుంచి పవన్ గెలుపు వెనుక ఎవరైనా ఉన్నామని అనుకుంటే వారి ఖర్మ అంటూ చేసిన కామెంట్స్ టీడీపీతో సహా వర్మ మద్దతు దారుల కు రుచించటం లేదు. వర్మకు పెద్ద ఎత్తున మద్దతు లభిస్తోంది. ఇదే సమయంలో మెగా ఫ్యామిలీ తో సత్సంబంధాలు ఉన్న బండ్ల గణేష్ చేసిన ట్వీట్ వైరల్ అవుతోంది.

మెగా కుటుంబానికి.. ప్రత్యేకంగా పవన్ కు భక్తుడుగా చెప్పుకునే బండ్ల గణేష్ చేసిన ట్వీట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. తాజాగా ఆయన ఎవరు పేరు ప్రస్తావన చేయకుండానే చేసిన ఈ ట్వీట్ పైన ఎవరి అభిప్రాయాలు వారు వెల్లడిస్తున్నారు. ఈ ట్వీట్ పైన స్పందిస్తున్న వారు తాజాగా పిఠాపురంలో నాగబాబు జనసేన సభలో చేసిన కామెంట్స్ కు కౌంటర్ గానే పోస్టింగ్స్ చేస్తున్నారు. పిఠాపురంలో పవన్ గెలుపు వెనుక ఎవరైన ఉన్నామని అనుకుంటే వారి ఖర్మ అని నాగబాబు వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యల పైన టీడీపీ.. వర్మ మద్దతు దారులు ఆగ్రహంతో ఉన్నారు.

ఇక, ఈ రోజు బండ్ల గణేష్ ఎక్స్ ఖాతాలో.. "కృతజ్ఞత లేకుండా బతకడం మానవత్వాన్ని కోల్పోవ డమే. ద్రోహంతో బతకడం మనుష్యత్వాన్ని నాశనం చేసుకోవడమే. ఒక మనిషి జీవితంలో కృత జ్ఞత ఎంత ముఖ్యమో, ద్రోహం ఎంత ప్రమాదకరో స్పష్టంగా తెలియజేస్తుంది. మనం ఎప్పుడూ కృతజ్ఞతతో జీవించాలి" అంటూ పోస్టు చేసారు. కొందరు ఏమైందంటూ ప్రశ్నించగా.. మరి కొందరు నాగబాబును ఉద్దేశించి చేసిన ట్వీట్ గా సమాధానం వస్తున్నారు. గతంలో నాగబాబును భోలా నాగేంద్రుడిగా బండ్ల గణేష్ అభివర్ణించారు. కాగా, ఇప్పుడు బండ్ల గణేష్ ట్విట్ ను వర్మ మద్దతు దారులు వైరల్ చేస్తున్నారు.

https://x.com/ganeshbandla/status/1900777153211621388

bandla-ganesh-latest-tweet-goes-viral-amid-nagababu-comments-on-varma

కాగా, ప్రకాశ్ రాజ్ ను ఉద్దేశించి చేసిన పోస్టింగ్ అంటూ మరి కొందరు అభిప్రాయ పడుతున్నారు.
పవన్ ప్రసంగాన్ని ప్రకాశ్ రాజ్ ప్రస్తావించారు. ఎవరైనా ఆయనకు చెప్పండి అంటూ కామెంట్ చేసారు. దీనికి కౌంటర్ గానే బండ్ల ఈ ట్వీట్ చేసారని మరి కొందరు తమ అభిప్రాయం వెల్లడిస్తు న్నారు. అయితే, ఈ ట్వీట్ పై వర్మ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. గణేష్ మాట్లాడింది కరక్ట్ అంటూ పోస్టులు పెడుతున్నారు. మరికొందరైతే నాగబాబుకు భలే కౌంటర్ ఇచ్చావ్ అంటూ అభినందిస్తున్నారు. ఇక, దీని పైన బండ్ల గణేష్ స్పష్టత ఇస్తారా.. సస్పెన్స్ కంటిన్యూ చేస్తారా అనేది ఆసక్తి కరంగా మారుతోంది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+