బెంగళూరు రేవ్ పార్టీ.. ఎఫ్ఐఆర్ లో సంచలన విషయాలు, షాకింగ్ ట్విస్ట్ లు!!

బెంగళూరులోని రేవ్ పార్టీ ఇప్పుడు కర్ణాటకతో పాటు తెలుగు రాష్ట్రాలను షేక్ చేస్తుంది. ఈ రేవ్ పార్టీలో సినీ ప్రముఖులు, రాజకీయ ప్రముఖులు పాల్గొన్నారు. పెద్ద ఎత్తున డ్రగ్స్ కూడా పట్టుబడ్డాయి. మొత్తం 100 నుండి 150 మంది వరకు పాల్గొన్న ఈ అతి భారీ రేవ్ పార్టీని బెంగళూరు పోలీసులు చేధించారు. అయితే తాజాగా ఈ రేవ్ పార్టీకి సంబంధించి కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి.

హైదరాబాద్ బిజినెస్ మ్యాన్ పుట్టినరోజున రేవ్ పార్టీ
సన్ సెట్ టు సన్ రైజ్ విక్టరీ పేరుతో ఈ రేవ్ పార్టీని హైదరాబాద్ కి చెందిన బిజినెస్ మాన్ వాసు పుట్టినరోజు వేడుకల కోసం ఏర్పాటు చేసినట్టు తెలుస్తుంది. మొత్తం ఈ రేవ్ పార్టీలో 150 మంది పాల్గొన్నట్టు చెబుతున్న పోలీసులు ఎఫ్ఐఆర్లో రేవ్ పార్టీలోని ప్రముఖుల పేర్లు నమోదు చేయలేదు. రాజకీయ, సినీ ప్రముఖుల పేర్లు లేకుండా ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్టు సమాచారం.

Bangalore Rave Party Sensational things shocking twists in FIR

రేవ్ పార్టీ కేసులో ఐదుగురు అరెస్ట్
బెంగళూరు ఎలక్ట్రానిక్ సిటీ సమీపంలోని జీఆర్ ఫార్మ్స్ లో నిర్వహించిన ఈ రేవ్ పార్టీకి సంబంధించి బెంగళూరు సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్ అయిదుగురు వ్యక్తులను అరెస్ట్ చేసింది. అరెస్టు చేసిన వారు వాసు, అరుణ్, సిద్ధిక్, రణధీర్, రాజ్ భవ్ గా పోలీసులు గుర్తించారు . నిర్వాహకుడు వాసు అరుణ్ దగ్గర బంధువులు కాగా, ఈ ఈవెంట్ మొత్తాన్ని అరుణ్ ఇన్చార్జిగా నిర్వహించాడు.

రేవ్ పార్టీలో పట్టుబడిన డ్రగ్స్
ఇదిలా ఉంటే సిద్ధికి, రణధీర్, రాజ్ భవ్ ముగ్గురూ డ్రగ్స్ పెడలర్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఆదివారం రాత్రి 11:30 నిమిషాలకు నగర పరిధిలో రేవ్ పార్టీ నిర్వహిస్తున్నట్లు సమాచారం అందటంతో దాడులు చేసిన సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు అక్కడ రేవ్ పార్టీలోని వారిని పట్టుకున్నారు. అంతేకాదు కొకైన్, హైడ్రో గంజా మరియు ఇతర డ్రగ్స్ తో పాటు అనేక ఎండిఎంఏ మాత్రలను సీజ్ చేశారు.

ఎఫ్ఐఆర్ లో కనిపించని సినీ సెలబ్రిటీలు, రాజకీయ నాయకుల పేర్లు
ప్రస్తుతం ఐదుగురు నిందితులను జ్యుడీషియల్ కస్టడీకి పంపి పరప్పన అగ్రహార జైలులో ఉంచారు.150 మందికి పైగా రేవ్ పార్టీలో పట్టుకున్న పోలీసులు సినీ సెలబ్రిటీలు, రాజకీయ నాయకుల పేర్లు ఎఫ్ఐఆర్లో చేర్చక పోవడం గమనార్హం. 20కి పైగా లగ్జరీ కార్లను అక్కడ స్వాధీనం చేసుకున్న క్రమంలో, ఈ వాహనాలు ఎవరివి అన్నది ఆ ప్రముఖులు ఎవరు అన్నది ఎఫ్ఐఆర్ లో చేర్చకపోవడం అందరి దృష్టిని ఈ కేసుపై మళ్లేలా చేస్తుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+