దీపావళికి అనంతపురం, కర్నూలుకు అదిరిపోయే గిఫ్ట్ ప్రకటించిన నరేంద్రమోడీ
పండగల దృష్ట్యా ప్రయాణికుల రద్దీ ఎక్కువగా ఉంటుండటంతో భారతీయ రైల్వే సాధారణంగానే ప్రత్యేక రైళ్లను నడిపి రద్దీని నియంత్రిస్తుంటుంది. దీపావళి, చత్ పండగలు వస్తుండటంతో అనంతపురం, కర్నూలు మీదుగా రెండు ప్రత్యేక రైళ్లను దక్షిణ మధ్య రైల్వే నడుపుతోంది. బెంగళూరు నుంచి కలబురిగి వరకు నడిచే ఈ రైళ్లు అక్టోబరు 30, నవంబరు రెండు తేదీల్లో అందుబాటులో ఉంటాయి. 06533 నెంబరుతో ప్రత్యేక రైలుగా బెంగళూరులోని శ్రీ విశ్వేశ్వరయ్య టెర్మినల్(ఎస్ఎంవీటీ) రాత్రి 9.15 గంటలకు బయలుదేరి తర్వాత రోజు ఉదయం 7.40 గంటలకు కలబురిగి చేరుకుంటాయి.
12 జనరల్ బోగీలు
06534 నెంబరుతో ఈనెల 31, నవంబరు మూడు తేదీల్లో అందుబాటులో ఉండే ప్రత్యేక రైలు కలబురిగి నుంచి ఉదయం 9.35 గంటలకు బయలుదేరి అదేరోజు రాత్రి 8.00 గంటలకు బెంగళూరు ఎస్ఎంవీటీకి చేరుకుంటుంది. మార్గమధ్యంలో ఈ రైళ్లకు యలహంక, ధర్మవరం, అనంతపురం, గుంతకల్లు, అదోని, మంత్రాలయం, రాయచూర్, కృష్ణ, యాదగిరి, షాబాద్ స్టేషన్లలో హాల్టింగ్ సౌకర్యం ఉంది. మూడు స్లీపర్ బోగీలు, రెండు ఏసీ త్రీటైర్ బోగీలు, 12 జనరల్ బోగీలు, లగేజీ, బ్రేక్ వ్యాన్, దివ్యాంగుల బోగీతో సహా 19 బోగీలతో ఈ రైలు బయలుదేరుతుంది.

అదనపు బోగీల ఏర్పాటు
పండగల సీజన్ ను దృష్టిలో ఉంచుకొని నాలుగు రైళ్లకు అదనపు కోచ్ లను ఈస్ట్ కోస్ట్ రైల్వే ఏర్పాటు చేసింది. అక్టోబరు 16 నుంచి 19 వరకు రూర్కెలా-గుణపూర్ రాజ్యరాణి ఎక్స్‌ప్రెస్ (18117) రైలు, గుణుపూర్ - రూర్కెలా రాజ్యరాణి ఎక్స్‌ప్రెస్ (18118) రైలుకు ఈనెల 17 నుంచి 20 వరకు ఒక స్లీపర్ క్లాస్ కోచ్ యాడ్ చేశారు.పండుగ సీజన్‌లో వెయిట్‌లిస్ట్ చేసిన ప్రయాణికుల అదనపు రద్దీని క్లియర్ చేయడానికి నాలుగు రైళ్లకు అదనపు కోచ్‌లు పెంచాలని ఈస్ట్ కోస్ట్ రైల్వే నిర్ణయించింది.
రూర్కెలా-జగ్దల్‌పూర్ ఇంటర్‌సిటీ ఎక్స్‌ప్రెస్ (18107) రైలుకు, జగ్దల్‌పూర్ -రూర్కెలా ఇంటర్‌సిటీ ఎక్స్‌ప్రెస్ (18108) రైలుకు 19, 20 తేదీల వరకు ఒక స్లీపర్ కాచ్ బోగీని అదనంగా కలిపారు.












Click it and Unblock the Notifications