బేస్ మ్యాప్‌లు తయారైతేనే అమరావతి నిర్మాణంపై స్పష్టత
అమరావతి: రాజధాని అమరావతికి సింగపూర్ మాస్టర్ ప్లాన్ అందింది. ఏయే వసతులు ఏయే సర్వే నెంబర్లలో వస్తాయో అందులో పేర్కొనలేదు. వాటన్నింటి పైన మాస్టర్ ప్లాన్‌కు సంబంధించిన బేస్ మ్యాప్‌లు తయారైతే దానిపై ఓ స్పష్టత వస్తుందని భావిస్తున్నారు.
వాటి తయారీకి ఏపీ రాజధాని ప్రాంత అభివృద్ధి సంస్థ (సీఆర్డీఏ) కొంతకాలంగా కసరత్తులు చేస్తోంది. కొద్ది వారాల్లోనే బేస్ మ్యాపులను సిద్ధం చేసి దానిపై నోటిఫికేషన్ జారీ చేసేలా చర్యలు తీసుకుంటోంది. సీఆర్డీఏ వెబ్ సైట్లో ఉంచిన అమరావతి మాస్టర్ ప్లానును కేవలం ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ను సూచించే మ్యాప్‌లే.
అమరావతి సీడ్ కేపిటల్, క్యాపిటల్ సిటీ, రాజధాని ప్రాంతాల్లో ఏర్పాటు చేయదల్చిన వివిధ వసతులు, చేపట్టదలిచిన నిర్మాణాలను స్థూలంగా సూచించే ప్రణాళిక.

సీడ్ క్యాపిటల్ పైన ప్రజల అభిప్రాయాలు, సూచనల కోసం 30 రోజుల గడువిచ్చిన సీఆర్డీఏ.. అది ముగిసే నాటికి బేస్ మ్యాపులను సిద్ధం చేసేందుకు చర్యలు తీసుకుంటోంది. తుది బేస్ మ్యాప్‌లో వివరాలను బట్టి ఏయే నిర్మాణాలు ఎక్కడెక్కడ ఉండబోతున్నాయో స్పష్టత వస్తుంది.
కాగా, ఏపీ రాజధానిని హ్యాపీ క్యాపిటల్‌గా నిర్మించాలని సీఆర్డీయేకు ఆంధ్రా మేథావుల వేదిక సూచన చేసింది. అల్పాదాయ, మధ్యాదాయ వర్గాలు నివసించేలా, పర్యావరణ రహిత నిర్మాణాలు అవసరమని అది సూచించింది.












Click it and Unblock the Notifications